2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను జూలై 31లోపు దాఖలు చేయాలి. ఏప్రిల్ 1 నుంచి 2023–24 అసెస్‌మెంట్ సంవత్సరానికి కొత్త ఐటీఆర్ ఫారమ్‌లు అందుబాటులో ఉంటాయి. నిబంధనల ప్రకారం రూ. 2.5 లక్షల ప్రాథమిక మినహాయింపు కంటే ఎక్కువ సంపాదించే వ్యక్తులు తమ ఐటీఆర్‌లను గడువుకు ముందే సమర్పించాలి.
ఇదీ చదవండి: Fact Check: ఐటీ నుంచి రూ.41 వేల రీఫండ్! నిజమేనా?
అయితే రూ. 5 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపులకు అర్హత పొందిన వారు మాత్రం పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పలు కారణాల వల్ల ఐటీఆర్ దాఖలు గడువును గత ఏడాది జూలై 31 నుంచి సెప్టెంబర్ 30కి పొడిగించింది. అయితే ఈ సంవత్సరం కూడా పొడిగింపు ఏమైనా ఉంటుందా అన్నది ఇప్పటివరకూ తెలియదు. (ట్యాక్స్‌పేయర్ల కోసం స్పెషల్ యాప్, ఎలా పనిచేస్తుంది?)
ఆలస్యమైతే ఏమవుతుంది?
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 234F కింద ఐటీఆర్ దాఖలు ఆలస్యమైతే ఆలస్య రుసుము రూ. 5,000 చెల్లించాలి. ఒక వేళ వార్షికాదాయం రూ. 5 లక్షల కంటే తక్కువైతే ఈ ఆలస్య రుసుమును రూ.1000లకు తగ్గిస్తారు. గడువు ముగిసిన తర్వాత రిటర్న్‌ను సమర్పించినట్లయితే ఆలస్య రుసుముతోపాటు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 234A ప్రకారం పన్ను బకాయిపై నెలకు 1 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తుంది.
ఐటీఆర్ ఫైలింగ్ గడువు దాటిపోతే మరో నష్టం కూడా ఉంది. ఆలస్య రుసుము, వడ్డీ చెల్లించి గడువు ముగిసిన తర్వాత కూడా రిటర్న్స్‌ను ఫైల్ చేయవచ్చు. కానీ తదుపరి సర్దుబాట్ల కోసం నష్టాలను అందులో చేర్చడానికి వీలుండదు. సాధారణంగా స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు, రియల్ ఎస్టేట్ లేదా ఏదైనా సంస్థల్లో పెట్టుబడుల వల్ల నష్టాలు ఉంటే వాటిని ఐటీఆర్‌లో చేర్చి వచ్చే ఏడాది ఆదాయంతో సర్దుబాటు చేసుకోవచ్చు. ఫలితంగా పన్ను భారం బాగా తగ్గుతుంది. ఇది గడువు తేదీలోపు ఐటీఆర్ సమర్పిస్తేనే.
ఇదీ చదవండి: Hindenburg Research: త్వరలో హిండెన్‌బర్గ్ మరో బాంబ్.. ఈసారి ఎవరి వంతో..!
Comments
Please login to add a commentAdd a comment