నవోదయ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం | september 16th last date for navodaya aplications | Sakshi
Sakshi News home page

నవోదయ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

Published Wed, Jul 20 2016 8:10 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

september 16th last date for navodaya aplications

బిజినేపల్లి: వట్టెం నవోదయ విద్యాలయంలో 2017–18 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ పి.సాయిసుబ్బారావు బుధవారం తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం, సంబంధిత విద్యాధికారి కార్యాలయం నుంచి దరఖాస్తులు ఉచితంగా పొందవచ్చన్నారు. నవోదయ విద్యాలయ వెబ్‌సైట్‌  www.navodayahyd.org.in, www.navshq.org, www.jnvmbnr.org ద్వారా దరఖాస్తులు పొంది పూర్తిచేసి సంబంధిత మండల విద్యాధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను సెప్టెంబర్‌ 16వరకు అందించాలని తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement