ఇంటర్ పరీక్షలకు దరఖాస్తులు
Published Tue, Oct 25 2016 6:45 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
ఏలూరు సిటీ :
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాసేందుకు దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించేందుకు నవంబర్ 1తేదీ వరకు అపరాద రుసుము లేకుండా అవకాశం ఉందని ఇంటర్ విద్యమండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎస్‌ఏ «ఖాదర్ మంగళవారం తెలిపారు. రూ.120ల అపరాధ రుసుముతో నవంబర్ 10తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.500ల అపరాధ రుసుముతో 17తేదీ వరకు, రూ.వెయ్యి అపరాద రుసుముతో 28తేదీ వరకు, రూ.2వేలు అపరాద రుసుముతో డిసెంబర్ 21తేదీ వరకు, రూ.3వేలు అపరాద రుసుముతో డిసెంబర్ 31తేదీ వరకు, రూ.5వేలు అపరాధ రుసుముతో 2017 జనవరి 18తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజులు చెల్లించాలని ఆయన కోరారు
Advertisement
Advertisement