ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద పంటలకు బీమా చేయించడానికి ఈ నెల 31 చివరీ తేదీ అని మండల వ్యవసాయాధికారి రాగమ్మ తెలిపారు.
ఫసల్ బీమాను సద్వినియోగం చేసుకోండి
మొయినాబాద్: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద పంటలకు బీమా చేయించడానికి ఈ నెల 31 చివరీ తేదీ అని మండల వ్యవసాయాధికారి రాగమ్మ తెలిపారు. బ్యాంకు రుణం పొందే రైతులు రుణం తీసుకునే సమయంలోనే ఫసల్ బీమాకు ప్రీమియం చెల్లించాలన్నారు. రుణం తీసుకోని రైతులు డీడీల రూపంలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు. మొక్కజొన్న పంటకు గ్రామం యూనిట్‌గా, ఇతర పంటలకు మండలం యూనిట్‌గా పరిగణిస్తామన్నారు. వరికి ఎకరాకు రూ.364, మొక్కజొన్న ఎకరాకు రూ.400, కంది ఎకరాకు రూ.260, జొన్న ఎకరాకు రూ.200, పెసర ఎకరాకు రూ. 200 చొప్పున ప్రీమియం చెల్లించాలన్నారు. డీడీలు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ హైదరాబాద్ పేరుతో తీయాలన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ నెల 31లోపు డీడీలు తీసి మండల వ్యవసాయాధికారులకు ఇవ్వాలన్నారు. ఇతర వివరాలకు సెల్: 7288894656 నంబర్‌లో సంప్రదించాలన్నారు.