ప్రముఖ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’(కేబీసీ) సీజన్ 15లో ప్రస్తుతం ‘కేబీసీ జూనియర్స్ వీక్’ జరుగుతోంది. చివరి ఎపిసోడ్‌లో హర్యానాలోని మహేంద్రగఢ్ నివాసి మయాంక్ హాట్‌సీట్‌పై కూర్చున్నాడు. ఈ 12 ఏళ్ల కంటెస్టెంట్‌తో హోస్ట్ బిగ్ బీ అమితాబ్ పలు విషయాలను ముచ్చటించారు.
అమితాబ్ బచ్చన్ ఈ ఎపిసోడ్‌లోని మొదటి ప్రశ్నను అడిగారు. దీనికి సమాధానం చెబితే రూ. 6,40,000 గెలుచుకోవచ్చు. 2023లో వాషింగ్టన్ డీసీలో ప్రారంభించిన ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ఎవరి పేరు మీద ఉంది? అని అడిగారు. దీనికి మయాంక్ సరైన సమాధానం ఇస్తూ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ అని చెప్పాడు. తరువాతి ప్రశ్నలకు మయాంక్ సరైన సమాధానాలు చెబుతూ వచ్చాడు.
గేమ్ సమయంలో మయాంక్ తాను పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నదీ ఇంకా తనకు తెలియడం లేదని చెప్పాడు. తరువాత మాయాంక్ ‘మీరు చిన్నప్పుడు ఏం కావాలని అనుకున్నారు?’ అని అడిగాడు. అందుకు అమితాబ్ బదులిస్తూ ‘చిన్నప్పుడు ఎక్కువగా గిల్లీ దందా ఆడేవాళ్లం. అది తప్ప మరేదీ మా మనసులోకి రాలేదు’ అని చెప్పారు. తరువాత అమితాబ్.. మయాంక్‌ను కోటి రూపాయల ప్రశ్న అడిగాడు. కొత్తగా కనుగొన్న ఖండానికి ‘అమెరికా’ అని పేరు పెట్టిన ఘనత ఏ యూరోపియన్ కార్టోగ్రాఫర్‌కు దక్కుతుంది? అడి అడిగారు.
దీనికి సమాధానం చెప్పేందుకు మయాంక్ ఒక ఒక నిపుణుడి సహాయం తీసుకుని ‘మార్టిన్ వాల్డ్సీముల్లర్’అని సరైన సమాధానం చెప్పాడు. సీజన్ 15లో భారీ మొత్తాన్ని గెలుచుకున్న తొలి జూనియర్ కోటీశ్వరుడు మయాంక్. ఈ విషయాన్ని అమితాబ్ షోలో ప్రకటించారు. ఆ సమయంలో మయాంక్ తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. తరువాత అమితాబ్.. మయాంక్‌ను రూ. 7 కోట్ల ప్రశ్న అడిగారు. దీనికి మయాంక్ సమాధానం చెప్పలేక గేమ్ ముగించి, కోటి రూపాయలు తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: ఇప్పుడు దీపావళి చేసుకుంటాం: ఉత్తరకాశీ కార్మికులు
Comments
Please login to add a commentAdd a comment