ప్రతి దేశం తన బడ్జెట్ ప్రకారం ఆయా రంగాల అభివృద్ధికి కొంత కేటాయించడం కామన్. అన్ని దేశాల్లోనూ జరిగేదే. కానీ కేవలం ఒక సీ ఫుడ్ కోసం కోట్లు కేటాయించడం విన్నారా!. అది కూడా పీతలను తొలగించేందుకు దాదాపు 26 కోట్లు కేటాయించాలని ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏంటీ వింత నిర్ణయం అనిపిస్తుంది కదా!. అసలు ఎందుకు ఇటలీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాటి కోసం ప్రత్యేకంగా అంత డబ్బు ఎందుకంటే..
అసలేం జరిగిందంటే..ఇటలీలో నీలిరంగు పీతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎంతలా అంటే ప్రఖ్యాతి గాంచిన నత్తల జాతిని అంతం చేసేలా పెరిగిపోతున్నాయి. నిజానికి ఈ నీలరంగు పీతను పశ్చిమ అట్లాంటిక్‌కు చెందినవి. తొలినాళ్లలో ఒకటో రెండు నీలి పీతలను గుర్తించారు ఇటలీ వాసులు. ఆ తర్వాత క్రమంగా వాటి సంఖ్య పెరిగిపోవడమే గాక వాటి కారణంగా నత్తలు మాయం అవ్వుతున్నాయి. దీంతో పాటు షెల్‌ఫిష్, ఫిఫ్ రో వంటి ఇతర జలచరాలు చనిపోవడం జరిగింది. ఇటలీ వాసులు మొలస్కా జాతికి చెందిన నత్తలను బాగా తింటారు. అందుకు సంబంధించి ఆక్వా కల్చర్ ఇటలీలో బాగా ప్రఖ్యాతి గాంచింది.
అలాంటి ఆక్వాకల్చర్ ఇప్పుడు ఈ నీలిపీతల కారణంగా చాల నష్టాలను చవి చూస్తోంది. ఈ నీలిపీతలు సముద్ర జాతికి చెందని కొన్ని మొక్కలు, ఇతర జలచర జంతువులను తినేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఉత్తర ఇటలీలో ఉన్న పో రివర్ వ్యాలీ డెల్టాలో ఉన్న ఆక్వాఫార్మ్‌లు దారుణంగా దెబ్బతిన్నాయి. సముద్ర జీవశాస్త్రవేత్తలు ఈ నీలి పీతలు ఈ ప్రాంతంలో ఉండే నత్తలను దాదాపు 90% వరకు తినేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఇటలీ ప్రభుత్వం ఆ నీలిపీతల ఉధృతికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకుంది.
ఈ మేరకు ఇటాలియన్ వ్యవసాయం మంత్రి ఫ్రాన్సిస్కో లోలోబ్రిగిడా పో నది డెల్టాను సందర్శించిన తదనంతరమే ఈ పీతల నిర్మూలన కోసం నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పెద్ద ఎత్తున ఆ పీతలను వేటాడి అంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులు వీలైనంత ఎక్కువ పీతలను పట్టి వాటిని చంపేయాలని సూచించారు. అందుకు కోసం దాదాపు రూ. 26,51,00,000 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. వీలైనంత తర్విత గతిన ఈ నీలిపీతల సంఖ్యను తగ్గించకపోతే పరిస్థితి తీవ్రమై పర్యావరణ ప్రభావాలకు లోనవ్వాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరించారు. అంతేగాదు యూఎన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం, చైనా, దక్షిణ కొరియా తర్వాత ఇటలీనే ఎక్కువగా నత్తలను పెంచే మూడొవ అతిపెద్ద ఉత్పత్తిదారు.
(చదవండి: ఇష్టం అంటే మరీ ఇలానా! ఈ 'స్ట్రేంజ్ అడిక్షన్' వింటే షాకవ్వాల్సిందే!)
Comments
Please login to add a commentAdd a comment