crabs
-
మెట్రోలో ‘పీత’లాటకం!
మహానగరాల్లో మెట్రో రైళ్లలో ప్రయాణికులు చాలావరకు మోత బరువులు లేకుండా, నీటుగా తయారై వెళ్తుంటారు. చెవుల్లో హెడ్ఫోన్లు, చేతుల్లో స్మార్ట్ఫోన్లతో ఎవరి లోకంలో వాళ్లు బిజీగా ఉంటారు. అలాంటి మెట్రోలో ఒక్కసారిగా డజను దాకా పీతలు ప్రత్యక్షమయ్యాయి. ఆకాశంలోంచి కాకపోయినా ఒక ప్రయాణికురాలి ప్లాస్టిక్ సంచి నుంచి కింద పడ్డాయి. స్వేచ్ఛ దొరికిందే తడవుగా తలోవైపు చకచకా పరుగులు తీశాయి. దాంతో సదరు మహిళకు గాభరాతో మెట్రో రైలు తలుపు వైపు పరుగెత్తింది. సాయం కోసం అటు ఇటూ చూసింది. చిరిగిన సంచినే వాటిపై గట్టిగా అదిమిపెడుతూ ఆపసోపాలు పడింది. ఇదంతా చూస్తున్న సూటు బూటు వేసుకున్న ఓ పెద్దాయన ఆమెకు సాయంగా రంగంలోకి దిగాడు. ఎడమ చేత్తో ఫోను చూస్తూనే కుడి చేత్తో పీతల వేట మొదలు పెట్టాడు. ఆయనకు మరో ‘హెడ్‌ఫోన్’ ప్రయాణికుడు, మరో వ్యక్తి తోడయ్యారు. ఇంకొకరు పెద్ద ఖాళీ సంచి అందించారు. అంతా కలిసి ఒక్కో పీతను ఒడుపుగా ఒడిసిపట్టి సంచిలో వేశారు. అయినా పీతలు పట్టుకున్న వాళ్లను కొండీలతో కరుస్తూ పారిపోయేందుకు ప్రయతి్నంచాయి. చివరికి అంతా కలిసి అన్ని పీతలనూ విజయవంతంగా సంచీలో వేశారు. మెట్రోలో ఈ పీతల హడావిడిని ఒక ప్రయాణికుడు వీడియో తీసి ఇన్‌స్టాలో పెడితే ఏకంగా కోటీ 15 లక్షల మందికి పైగా చూశారు. లెక్కలేనన్నిసార్లు షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కుప్పలు తెప్పలుగా లైక్‌లు, కామెంట్లూ వస్తున్నాయి. ‘సూటూ బూటు నీటుగాళ్లు తిరిగే మెట్రోలో జనం సాయానికి ఇంతగా జనం ముందుకురావడం గ్రేట్’ అని ఒకరు, ‘పీతలు భలే తాజాగా ఉన్నాయి. వండుకు తింటే నా సామిరంగా..’ అని ఇంకొకరు కామెంట్ పెట్టారు. ఇంతకీ ఇదెక్కడ జరిగిందన్నది మాత్రం తెలియదు! View this post on Instagram A post shared by SubwayCreatures (@subwaycreatures) -
ఆ పీతల కూర ఎంత పనిచేసింది..చివరికి పోలీస్‌స్టేషన్..
మాములుగా అత్యంత అరుదుగానే వేరే ప్రాంతానికి సంబంధించిన ఫుడ్ ఐటెమ్స్ అయితే బాగా ఖరీదుగా ఉంటాయి. అది కూడా మహా అయితే వెయ్యి లేదా ఆపైన ఉంటుంది. కానీ మనకు తెలిసిన ఐటెం అందుబాటులో ఉండేది అంత ధర ఉండదు. పోనీ ఓ పెద్ద రెస్టారెంట్ అయినా కూడా ఘోరమైన ధర ఫలకదు. కానీ ఇక్కడొక జపాన్ టూరిస్ట్‌కి మాత్రం తాను ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటెం ధర విని మాటలు రాలేదు. ఏడుపుఒక్కటే తక్కువ అన్నంత చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. చివరికి పోలీసులను కూడా ఆశ్రయించింది. జపాన్‌కి చెందిన షిన్బా తన స్నేహితులతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లింది. అక్కడ ఆమె ఆగస్టు 19న ప్యారడైజ్ రెస్టారెంట్లో భోజనం చేస్తుండగా ఆమె చిల్లి క్రాబ్ ఆకర్షించడంతో వెంటనే దాన్ని కూడా ఆర్డర్ చేసింది. అయితే సర్వర్ దాని ధర కేవలం 20 డాలర్లు(రూ.1,661/-) చూపించాడు. దీంతో అంత పెద్ద మొత్తం ఏం కాదుకదాగా అని ధైర్యంగా ఆర్డర్ చేసింది తీరా తిన్నాక సర్వర్ ఇచ్చిన బిల్లు చూసి ఒక్కసారిగా కంగుతింది. ఒక్కరు తింటే అంతే అయ్యేది కాని ఇక్కడ తిన్నది నలుగురు కాబట్టి దాని ధర అంతేనని తేల్చి చెప్పారు రెస్టారెంట్ సిబ్బంది. దీంతో ఒక్కసారిగా ఆమె షాకయ్యింది. అది అలస్కాన్ కింగ్ చిల్లీ క్రాబ్ అని దాని ధర అంతే ఉంటుందని చెప్పడంతో ఆమెకు ఒక్కసారిగా అయోమయంగా అనిపించింది. ముందుగానే సర్వర్‌ని ఆ పీతల కూర రెసిపీ ధర అడిగే ఆర్డర్ చేస్తే ఇలా అనడం అర్థం కాలేదు. అది కూడా ఆ బిల్లు ఏకంగా రూ. 56,603 అని ఉండేటప్పటికీ ఏమని ప్రశ్నించాలో తెలియలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. వారు వచ్చి ఆ రెస్టారెంట్ అధికారులను అడిగితే..అంతకుముందు అదే రెసిపీకి వెరొక కస్టమర్ పే చేసిన బిల్లు చూపించి దీని ఖరీదు ఎక్కువ అని చెప్పారు. ఇక ఆ పీతను కూడా తీసుకొచ్చి ఇది చాలా బరువుగా ఉంటుందని, కస్టమర్ ఆర్డర్ చేయంగానే అప్పటికప్పుడు వండి పెడతామని చెప్పడంతో ఆమెకు నోటి మాట రాలేదు. అయితే అంత ఖరీదైన పీతలు గురించి క్లియర్‌గా మెనులో ఎందుకివ్వలేదు. సర్వర్ నాకు ఇలా 20 డాలర్లని ఎందుకు చూపించాడు అని వాదనకు దిగింది. ఆ రెసిపీ వందగ్రాములే 20 డాలర్లు అని అర్థం అని చెప్పడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతయ్యింది. ఇక కాసేపటి చర్చల అనంతరం సదరు రెస్టారెంట్ సహృద్భావంతో 70 డాలర్లు (రూ. 6.749) తగ్గించేందుకు ముందుకు వచ్చింది. కానీ సదరు కస్టమర్ కట్టేందుకు నిరాకరించింది. పైగా సదరు రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేగాదు ఈ విషయమై సింగపూర్ టూరిజం బోర్డుని కూడా సంప్రదించింది. వారు ఆమెన సింగపూర్ వినయోగాదారుల అసోసీయేషన్ని సంప్రదించమని చెప్పారు. ఇష్టంగా తిన్న పీతల కూర రగడ కాస్త కేసుల వరకు వెళ్లి తీరని చేదు అనుభవాన్ని మిగిల్చింది. (చదవండి: అత్యంత అరుదైన పావురం!చూస్తే..షాకవ్వడం ఖాయం) -
ఆ దేశం పీతలను అంతం చేసేందుకు ఏకంగా రూ. 26 కోట్లు..!
ప్రతి దేశం తన బడ్జెట్ ప్రకారం ఆయా రంగాల అభివృద్ధికి కొంత కేటాయించడం కామన్. అన్ని దేశాల్లోనూ జరిగేదే. కానీ కేవలం ఒక సీ ఫుడ్ కోసం కోట్లు కేటాయించడం విన్నారా!. అది కూడా పీతలను తొలగించేందుకు దాదాపు 26 కోట్లు కేటాయించాలని ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏంటీ వింత నిర్ణయం అనిపిస్తుంది కదా!. అసలు ఎందుకు ఇటలీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాటి కోసం ప్రత్యేకంగా అంత డబ్బు ఎందుకంటే.. అసలేం జరిగిందంటే..ఇటలీలో నీలిరంగు పీతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎంతలా అంటే ప్రఖ్యాతి గాంచిన నత్తల జాతిని అంతం చేసేలా పెరిగిపోతున్నాయి. నిజానికి ఈ నీలరంగు పీతను పశ్చిమ అట్లాంటిక్‌కు చెందినవి. తొలినాళ్లలో ఒకటో రెండు నీలి పీతలను గుర్తించారు ఇటలీ వాసులు. ఆ తర్వాత క్రమంగా వాటి సంఖ్య పెరిగిపోవడమే గాక వాటి కారణంగా నత్తలు మాయం అవ్వుతున్నాయి. దీంతో పాటు షెల్ఫిష్, ఫిఫ్ రో వంటి ఇతర జలచరాలు చనిపోవడం జరిగింది. ఇటలీ వాసులు మొలస్కా జాతికి చెందిన నత్తలను బాగా తింటారు. అందుకు సంబంధించి ఆక్వా కల్చర్ ఇటలీలో బాగా ప్రఖ్యాతి గాంచింది. అలాంటి ఆక్వాకల్చర్ ఇప్పుడు ఈ నీలిపీతల కారణంగా చాల నష్టాలను చవి చూస్తోంది. ఈ నీలిపీతలు సముద్ర జాతికి చెందని కొన్ని మొక్కలు, ఇతర జలచర జంతువులను తినేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఉత్తర ఇటలీలో ఉన్న పో రివర్ వ్యాలీ డెల్టాలో ఉన్న ఆక్వాఫార్మ్‌లు దారుణంగా దెబ్బతిన్నాయి. సముద్ర జీవశాస్త్రవేత్తలు ఈ నీలి పీతలు ఈ ప్రాంతంలో ఉండే నత్తలను దాదాపు 90% వరకు తినేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఇటలీ ప్రభుత్వం ఆ నీలిపీతల ఉధృతికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇటాలియన్ వ్యవసాయం మంత్రి ఫ్రాన్సిస్కో లోలోబ్రిగిడా పో నది డెల్టాను సందర్శించిన తదనంతరమే ఈ పీతల నిర్మూలన కోసం నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పెద్ద ఎత్తున ఆ పీతలను వేటాడి అంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులు వీలైనంత ఎక్కువ పీతలను పట్టి వాటిని చంపేయాలని సూచించారు. అందుకు కోసం దాదాపు రూ. 26,51,00,000 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. వీలైనంత తర్విత గతిన ఈ నీలిపీతల సంఖ్యను తగ్గించకపోతే పరిస్థితి తీవ్రమై పర్యావరణ ప్రభావాలకు లోనవ్వాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరించారు. అంతేగాదు యూఎన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం, చైనా, దక్షిణ కొరియా తర్వాత ఇటలీనే ఎక్కువగా నత్తలను పెంచే మూడొవ అతిపెద్ద ఉత్పత్తిదారు. (చదవండి: ఇష్టం అంటే మరీ ఇలానా! ఈ 'స్ట్రేంజ్ అడిక్షన్' వింటే షాకవ్వాల్సిందే!) -
విడ్డూరం! మనుషులకే కాదు.. చేపలు, పీతలకూ కరోనా పరీక్షలు, వైరల్ వీడియో
మూడేళ్ల నుంచి కరోనా మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తూనే ఉంది. ఈ వైరస్ సోకిందో లేదో తెలియాలంటే ముందుగా కోవిడ్ టెస్టు చేయించుకోవాల్సిందే! జ్వరం, దగ్గు, జలుబు, నీరసం.. ఇలా ఎలాంటి లక్షణాలు కనిపించినా కరోనా ఏమోనని భయపడి టెస్టులకు క్యూ కట్టేవారు. అయితే ఇప్పటి వరకు సాధారణంగా కేవలం మనుషులకు మాత్రమే ఈ కరోనా టెస్టులు చేశారు. తాజాగా మానవులతోపాటు చేపలు, పీతలకు కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు. చైనాలోని జియామెన్‌లో ఈ సంఘటన జరిగింది. చైనాలోని సముద్రతీర నగరం జియామెన్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. జియామెన్‌లో 40 మందికి కోవిడ్ సోకడంతో.. నగరంలోని అయిదు మిలియన్ల మందికి పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కేవలం మనుషుకు మాత్రమే కాదు. కొన్ని రకాల సముద్రజీవులకు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. సముద్రం మీద వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి వచ్చినపుడు.. వారితోపాటు తీసుకొచ్చిన చేపలు, జలచరాలకు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఫలితంగా బతికున్న చేపలు, పీతలకు కోవిడ్ టెస్టులు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను సౌత్ చైనా మార్నింగ్ పోస్టు ట్విటర్లో పోస్టు చేసింది. ఇందులో పీపీఈ కిట్ ధరించిన వైద్యాధికారులు చేపలు, పీతలు వంటి జలచరాల స్వాబ్ తీసి కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రిషి సునాక్ దంపతులు Videos of pandemic medical workers giving live seafood PCR tests have gone viral on Chinese social media. pic.twitter.com/C7IJYE7Ses — South China Morning Post (@SCMPNews) August 18, 2022 అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది చేపలకు టెస్టులు చేయడాన్ని సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ అధికారుల తీరును విమర్శిస్తున్నారు. కాగా తమ నిర్ణయాన్ని జియామెన్ మున్సిపల్ ఓషియానిక్ డెవలప్మెంట్ బ్యూరో అధికారులు సమర్థించుకున్నారు. కరోనా కల్లోలం రేపిన హైనాన్ నుంచి తాము పాఠం నేర్చుకున్నామని తెలిపారు. విదేశీయుల నుంచి మత్స్యకారులకు వైరస్ సోకి సముద్ర ఉత్పత్తులకు వ్యాపిస్తున్నదని చెప్పారు. -
రాకాసి పీత!.. గోల్ఫ్ స్టిక్‌ని చెకోడీలు విరిచినట్లు పటపట విరిచేసింది!
The Crab Can Be Seen Clutching The End Of Golf Club: మనం ఇంతవరకు చాలా రకాల జంతువులు, సరీసృపాలకు సంబంధించిన వీడియోలను చాలనే చూశాం. పైగా అవి చేసే రకరకాల విన్యాసలు చూస్తే భయంకరంగానూ ఆశ్యర్యంగాను అనిపిస్తుంది. అచ్చం అలానే ఇక్కొడక భారీ పీత గోల్ప్ స్టిక్‌ని భలే సులభంగా విరిచేసింది. (చదవండి: 40 రోజుల్లో 700 మైళ్లు.. ప్రీత్ చాందీ ఒంటరి సాహసం..!) అసలు విషయంలోకెళ్లితే...ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ద్వీపంలో స్థానికుడు పాల్ బుహ్నర్ అతని స్నేహితులు గోల్ఫ్ క్లబ్లో ఒక పెద్ద పీతను చూశారు. ఆ పీత చూడటానికి చాలా పెద్దగా ఉంది. అది గోల్ఫ్ స్టిక్(ఐరన్)ని ఏదో చెకోడిలు విరిచినట్టుగా పటపటమంటు విరిచేస్తుంది. పైగా అలా మూడు గోల్ఫ్ స్టిక్ల్ని విరిచేస్తుంది. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కెర్రీ బుహ్నర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పైగా తన భర్త పాల్ బుహ్నర్ గోల్ప్ సందర్బంగా ఈ వీడియోని చిత్రికరించారు అని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: రూ.లక్షకో డ్రైవింగ్ స్కూల్) -
స్పెషల్ బ్రిడ్జిలు.. ఇవి మనుషుల కోసం కాదండోయ్.. పీతల కోసం
సాధారణంగా ఎక్కడైనా ప్రజల కోసం బ్రిడ్జిలు కడుతుంటారు. కానీ ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ద్వీపంలో మాత్రం ప్రత్యేకంగా పీతల కోసం కడతారు. ఒకేసారి గుంపులు గుంపులుగా బయటకు వచ్చే ఆ ఎర్ర పీతలు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు వాహనాలు, ప్రజల వల్ల ఇబ్బంది పడకుండా ఆ వంతెనలు ఏర్పాటు చేస్తుంటారు. క్రిస్మస్ ద్వీపంలో మొదటి వాన పడగానే ఎర్ర పీతలు లక్షలాదిగా రోడ్లమీదికి వచ్చేస్తాయి. అవి ఉండే అడవి నుంచి సముద్రం వైపు వెళ్తాయి. అన్ని పీతలు ఒకేసారి రోడ్లమీదికి వచ్చేస్తే జనాలకు ఇబ్బందే కదా. ఆ దారుల్లోంచి వాహనాలు వెళ్తే పీతలకు కూడా ఇబ్బందే. అందుకే ఇటు పీతలు, అటు జనాలు ఇబ్బంది పడుకుండా క్రిస్మస్ ఐలాండ్ నేషనల్ పార్కు సిబ్బంది బ్రిడ్జిలు కడతారు. పీతలు బయటకు రావడానికి కొద్ది నెలల ముందు నుంచే బ్రిడ్జిలు కట్టడం మొదలుపెడతారు. బయటకు వచ్చిన పీతలు చక్కగా వాటి మీది నుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తారు. ఆ పీతల దారుల్లో జనాలు, వాహనాలు వెళ్లకుండా గుర్తులు కూడా పెడతారు. ఇంతకీ ఆ పీతలు అలా సముద్రం వైపు ఎందుకు వెళ్తాయనుకుంటున్నారు? గుడ్లు పెట్టడానికి. సముద్రం దగ్గర ఆడ, మగ పీతలు ఒక్కటై ఆ తర్వాత సముద్రంలోకి ఆడ పీతలు గుడ్లు వదులుతాయి. ఒక్కో పీత సముద్రంలోకి దాదాపు లక్ష గుడ్లను వదుల్తుందట. నెల తర్వాత పిల్ల పీతలు తీరానికి వచ్చి అటు నుంచి అడవిలోకి వెళ్తాయట. క్రిస్మస్ ద్వీపంలో ఇది ఎప్పుడూ జరిగేదే. -
వైరల్: రోడ్లపైకి కోట్ల సంఖ్యలో దండెత్తిన పీతలు.. సినిమా గ్రాఫిక్స్ అనుకుంటే పొరపాటే!
Crores Of Red Crabs On The Roads: సాధారణంగా హాలీవుడ్ సినిమా మమ్మీ లో రోడ్లపైకి లక్షల సంఖ్యలో తేళ్లు వచ్చిన సన్నివేశం గుర్తుందా. అయితే ఆ సన్నివేశం చిత్రీకరించడానికి దర్శకుడికి చాలా ఖర్చు అయ్యుంటుంది. తాజాగా ఎలాంటి ఖర్చు లేకుండానే సరిగ్గా ఆ సీన్ లానే ఓ ప్రాంతంలో లక్షలాది పీతలు వలస వెళ్తూ.. రోడ్లపైకి ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆ ప్రాంత దారులన్నీ స్థానిక అధికారులు మూసివేశారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో క్రిస్మస్ ఐలాండ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్రిస్మస్ ఐలాండ్ సమీపంలోని అడవి నుంచి వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఉన్న ఓ పార్క్ తీరం వైపు ఏటా వేల సంఖ్యలో క్రాబ్స్ వెళ్తుంటాయి. అక్టోబర్, నవంబర్ నెలలో అక్కడ అడవుల్లో వానలు కురవడం ఆగిపోయిన తరువాత ఇది సముద్రంలోకి వెళ్లిపోతాయి. అలా వెళ్లాలంటే క్రిస్మస్ ఐటాండ్‌లోని రోడ్లు, బ్రిడ్జిల మీదుగానే వెళ్లాలి. ఇది ప్రతి ఏడాది జరిగేతంతే అయినా ఈ సారి మాత్రం వాటి సంఖ్య వేల కాదు లక్షలు కాదు ఏకంగా కోట్లలో ఉన్నాయి. స్థానికుల సమాచారం మేరకు దాదాపు 5 కోట్ల పీతలు ఉన్నట్లు తెలుస్తోంది. క్రిస్ మస్ లో రోడ్లు, బ్రిడ్జిలు, పార్కులు, ఇళ్ల మీదకు ఒక్కసారిగా పీతలు ఎగబడ్డాయి. కోట్ల సంఖ్యలో వచ్చిన పీతలను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లను విడిచి బయటకు రావడడానికి భయపడిపోతున్నారు. చివరకు రోడ్లు కూడా మూసి వేశారు. Roads on Christmas Island were closed as thousands of red crabs emerged from the forest to begin their annual migration journey to the ocean on the island off the coast of Western Australia pic.twitter.com/zRvP2iCdC4 — Reuters (@Reuters) November 18, 2021 -
వాటి దెబ్బకు పిక్నిక్ హర్రర్ సినిమా అయ్యింది!
మెల్బోర్న్ : సరదాగా మిత్రులతో కలిసి ఫ్యామిలీ పిక్నిక్కు వెళ్లిన ఓ కుటుంబానికి మరిచిపోలేని అనుభవం ఎదురైంది. వారు పిక్నిక్ జరుపుకుంటున్న ప్రదేశంలోకి పదుల సంఖ్యలో భారీ ఎండ్రకాయలు చొచ్చుకురావటంతో అక్కడి పరిస్థితి హర్రర్ సినిమాను తలపించేలా మారింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని బార్బిక్యూలో ఆసల్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఎమి లూటిక్ అనే మహిళ ఫ్యామిలీ, మిత్రులతో కలిసి క్రిస్టమస్ ఐలాండ్‌లోని బార్బిక్యూకు పిక్నిక్ కోసం వెళ్లింది. బీచ్‌కు దగ్గరగా బస చేసిన వారు కబుర్లు చెప్పుకుంటూ, రుచిగా తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. (రాబిన్ హుడ్ అవతారమెత్తిన డీజీపీ ) ఈ నేపథ్యంలో రాత్రి వేళ ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ, పదుల సంఖ్యలో రాబర్ క్రాబ్స్( పెద్ద సైజు ఎండ్రకాయలు) పిక్నిక్ స్పాట్‌లోకి చొచ్చుకువచ్చాయి. దీంతో వారు ఒక్కసారిగా హడలిపోయారు. కొందరు అక్కడినుంచి పరిగెత్తారు. మరికొందరు వాటినుంచి తప్పించుకుని పోవటానికి తెగ శ్రమించారు. ఆ ఎండ్రకాయలు ఇష్టారాజ్యంగా అక్కడ బీభత్సం సృష్టించాయి. క్రిస్టమస్ ఐలాండ్ టూరిజం అధికారులు ఇందుకు సంబంధించిన ఫొటోలను, సమాచారాన్ని తమ ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేయగా సంఘటన వైరల్‌గా మారింది. -
ఆ పీతలు ఫ్లయిటెక్కుతాయ్
తూర్పు గోదావరి జిల్లా యానాం–కాకినాడ మధ్యన ఉండే ఓ మత్స్యకార పల్లె ‘పెదవలసల’. ఆ చిన్న గ్రామం తాతల కాలం నుంచీ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. కృష్ణా, గోదావరి నదీపాయల ముఖ ద్వారాలు, కోరంగి, నాగాయలంక ప్రాంతాల్లోనూ పీతలు లభ్యమవుతున్నా.. పెదవలసల ప్రాంత పీతలకు ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే.. అక్కడి మడ అడవుల్లో దొరికే పీతలు రుచిలో మేటిగా పేరొందాయి. ఇక్కడి మండ పీతలు, పసుపు పచ్చ పీతలకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అమెరికా, చైనా, థాయ్‌లాండ్, సింగపూర్ దేశాల ప్రజలు వీటిని ఇష్టంగా తింటారు. ఈ గ్రామం నుంచి ప్రతినెలా సుమారు 20 టన్నుల పీతలు విదేశాలకు విమాన యానం చేస్తున్నాయి. పొద్దుపొడవక ముందే వేటకు.. ► తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం చినవలసల, పెదవలసల, చినబొడ్డు వెంకటాయపాలెం, పెదబొడ్డు వెంకటాయపాలెం, గాడిమొగ, రామన్నపాలెం, పండి, పోర, కొత్తపాలెం గ్రామాల మత్స్యకారులు తరతరాలుగా పీతల వేటలో ఉన్నా.. పెదవలసల పీతలు విదేశాల్లో ప్రాచుర్యం పొందాయి. పదేళ్ల కుర్రాడి నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకూ తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరి భైరవపాలెం, భైరవలంక తదితర ప్రాంతాల్లో పీతలను వేటాడి మధ్యాహ్నానికి తిరిగొస్తారు. ► దేశీయ బోటులో ముగ్గురు లేదా నలుగురు మత్స్యకారులు బృందంగా వెళ్లి 10 కిలోల వరకు పీతలను వేటాడతారు. కిలో రూ.250 వంతున రోజుకు సుమారు రూ.2,500 వరకు సంపాదిస్తారు. ► సాధారణ పీతలను సమీపంలోని స్థానిక మార్కెట్లలోనే విక్రయిస్తారు. గ్రేడింగ్ చేసిన పీతలను వెదురు బుట్టల్లో కాకినాడ మార్కెట్‌కు తరలించి.. ఎగుమతిదారులకు విక్రయిస్తారు. ఆ రెండు రకాలకే డిమాండ్ ► పీతలు ఆర్థోపోడా వర్గం, కష్టేసియన్ తరగతికి చెందినవి. వీటిలో 300 రకాలున్నా.. సవాయి, చుక్క, శిలువ, మండ, పసుపు పచ్చ, గుడ్డు పీతలు రుచిలో ప్రత్యేకమైనవి. ► ‘సిల్లా’ జాతికి చెందిన మండ పీతలు, పసుపు పచ్చ, గుడ్డు పీతలు కేజీ వరకూ పెరుగుతాయి. గుడ్డు పీతలను కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాలకు రవాణా చేస్తుంటారు. ► మండ, పసుపు పచ్చ పీతలను గ్రేడింగ్ చేసి వాటిలో నాణ్యమైన వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ► వీటి ధర విదేశాల్లో కేజీ రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు పలుకుతుంది. ► విదేశీ మార్కెట్‌కు చేరే వరకు బతికి ఉండేలా.. పీతలను గోనె సంచులు, ప్లాస్టిక్ బాక్సుల్లో పెడతారు. దీనివల్ల వాటికి గాలి తగిలి కనీసం వారం రోజుల వరకు బతికే ఉంటాయి. అమెరికా వయా చెన్నై.. కోల్‌కతా ► పెదవలసల పరిసర ప్రాంతాల్లో లభ్యమయ్యే పీతలను కాకినాడ ప్రాంత కొనుగోలుదారులు రైళ్లలో చెన్నై, కోల్‌కతా నగరాలకు తరలిస్తారు. ► అక్కడ నుంచి విమానంలో అమెరికా, చైనా, సింగపూర్, థాయ్‌లాండ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ► కరోనా కారణంగా ప్రస్తుతం విదేశీ ఎగుమతులకు బ్రేక్ పడటంతో ఒడిశా,కర్ణాటక మార్కెట్లకు తరలిస్తున్నారు. నల్ల జిగురు మట్టి వల్లే ఆ రుచి సముద్ర తీరంలో పీతలను వేటాడే ప్రాంతాలు ఇసుక, బొండు ఇసుకతో ఉంటాయి. పెదవలసల మడ అడవుల్లో మాత్రమే సముద్రం మొగ వద్ద నల్ల జిగురు మట్టి ఉంటుంది. అందుకే ఇక్కడి పీతలకు అంత రుచి ఉంటుంది. – పోతాబత్తుల నూకరాజు, పీతల వ్యాపారి, పెదవలసల పీతల్లో ఔషధ గుణాలు ఔషధ గుణాలు కలిగిన వృక్ష జాతులు పెరిగే కోరంగి అభయారణ్యం పరిసరాల్లోని పీతలు రుచిగా ఉంటాయి. పీతలు తినడం వల్ల శరీరానికి రాగి, పాస్ఫరస్ రక్తం బాగా పడుతుంది. శరీరంలో ఎముక గట్టిపడటానికి దోహదపడుతుంది. ఒమేగా–3 ఉండటంతో గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.పెద్ద వయసులో అల్జీమర్స్ (మతిమరుపు) లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. రక్తంలో చక్కెర నిల్వలు కూడా తగ్గుతాయి. అందుకే విదేశీయులు ఇక్కడి పీతలను అమితంగా ఇష్టపడుతున్నారు. – సీహెచ్ గోపాలకృష్ణ, మత్స్యశాఖ అధికారి, అమలాపురం మూడు తరాలుగా ఇదే వృత్తి మూడు తరాలుగా మేమంతా పీతలను నమ్ముకునే బతుకుతున్నాం. తెల్లారిగట్లే మడ అడవుల్లోకి వెళ్లి మధ్యాహ్నం తిరిగొస్తాం. మిట్టమధ్యాహ్నం వరకూ కట్టపడితే ఆరేడు వందలు వత్తాయి. ఒక్కోసారి గుడ్డు పీత కేజీ, కేజీన్నరది కూడా పడతాది. – చక్కా సత్యనారాయణ, పెదవలసల పెద్దవి దొరికితే పండగే.. 30 ఏళ్ల నుంచి పీతలు కొని అమ్ముతున్నా. గుడ్డు పీత, పసుపు పీత కేజీ నుంచి కేజీన్నర సైజు ఉంటే విదేశీయులు తింటారు. అందుకే ఎక్కువ రేటుకు కొంటారు. అలాంటిది ఒక్కటి దొరికినా ఆ రోజు పండగే. – కామాడి రాఘవ, పెదవలసల -
ధర.. 'పీత'లాటకం.. ఒక్కోటి వెయ్యి
తాడేపల్లిగూడెం: పీతలు పేరు చెప్పగానే మాంసాహారులు లొట్టలేస్తారు. కానీ ధర చూస్తే మాత్రం ఇదెక్కడి పితలాటకం అని జారుకునే పరిస్థితి వచ్చింది. జిల్లా మార్కెట్లకు గురువారం పెద్దపెద్ద పీతలు వచ్చా యి. పచ్చ రంగులో ఉన్న వీటికి సైజును బట్టి వ్యాపారులు ధర నిర్ణయించారు. చిన్న సైజువి ఒక్కోటి రూ.150, పెద్దవి గరిష్టంగా ఒక్కోటి రూ.వెయ్యి పలికాయి. సాధారణంగా పెద్దపీతలను వ్యాపారులు విదేశాలకు ఎగుమతి చేస్తారు. కరోనా వల్ల ఎగుమతు లు నిలిచిపోవడంతో ఇవి తణుకు, గూడెం మార్కెట్లకు వచ్చాయి. మనసు ఉండబట్ట లేని కొద్దిమంది మాత్రం కొనుగోలు చేశారు. -
ఉడికిన పీత..లాభాలమోత
పిఠాపురం: సముద్ర పీతలు.. ఒకసారి తింటే ఆ రుచి మరచిపోలేం.. ఇక మన రాష్ట్ర తీరంలో దొరికే సముద్ర పీతలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. కొన్ని రకాల పీతల ధర విదేశాల్లో కిలో వేలల్లో ఉంది. మత్స్యకారులు, వ్యాపారులకు లాభాల పంట పండిస్తున్న ఈ పీతలు ఎగుమతికి అంత అనుకూలం కాకపోవడంతో.. ఐస్‌లో ఎంత పకడ్బందీగా పంపినా కొన్నిసార్లు పాడైపోతున్నాయి. ఈ సమస్యకు తూర్పుగోదావరి జిల్లా మత్స్యకారులు పరిష్కారం కనుగొన్నారు. అదే పీతల్ని ఉడికించి ఎగుమతి చేయడం. ఇలా చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండడంతో పాటు రుచిలో కూడా శ్రేష్టంగా ఉండడంతో ఈ విధానంలో ఎగుమతులు జోరందుకున్నాయి. సముద్ర పీతల ధర మన వద్ద కిలో రూ. 350 నుంచి రూ. 500 ఉంటే.. విదేశాల్లో రూ.5 వేల వరకూ పలుకుతుంది. బ్లూ క్రాబ్, త్రీస్పాట్ క్రాబ్, పచ్చ పీత, మండ పీత, జీలా పీత, చుక్క పీత తదితర రకాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని తీరప్రాంతాల నుంచి రోజూ సుమారు 20 నుంచి 25 టన్నుల పీతలు ఎగుమతి చేస్తున్నారు. అమెరికా, మలేషియా, థాయిలాండ్ దేశాల్లో జీలా రకం పీతలకు క్రేజ్ ఎక్కువ. సాధారణంగా పీతలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అమెరికా లాంటి దేశాలకు పంపాలంటే ఎక్కువ రోజుల నిల్వ చేయాల్సి రావడంతో ఎగుమతులు తక్కువగా ఉండేవి. పీతల్ని ఉడకబెట్టడం ద్వారా అవి ఎక్కువకాలం పాడవకుండా ఉండడాన్ని గుర్తించారు. దీంతో వేటాడి తెచ్చిన పీతలను కొనుగోలు చేసిన వ్యాపారులు తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాల్లో ఉడకబెట్టి, ఐస్ బాక్సుల్లో ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తున్నారు. ఈ పీతలు కాకినాడ నుంచి ముంబయి, చెన్నై వంటి నగరాల్లోని కంపెనీలకు ప్రత్యేక కంటైనర్లలో తరలించి అక్కడి నుంచి విమానాల్లో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పీతల వేటకు పెట్టుబడి ఎక్కువే.. పీతల్లో మొత్తం 7,693 రకాలున్నాయి. మన వద్ద 10 నుంచి 15 రకాలు మాత్రమే దొరుకుతాయి. పీతల్ని పట్టాలంటే బలమైన వలలు అవసరం. ఒక్కోసారి వల ఎంత గట్టిగా ఉన్నా.. పీతల డెక్కల నుంచి రక్షించడం కష్టం. అందుకే పీతల వేటకు ప్రత్యేక వలలు ఉపయోగిస్తారు. ఒక వల రెండు మూడు వేటల కంటే ఎక్కువ ఉపయోగపడదు. అందువల్లే వీటి వేటకు పెట్టుబడి ఎక్కువ. ఒకసారి పాడైతే అవి మరమ్మతులకు కూడా పనికిరావు. చేపల వేటకైతే 20 నుంచి 30 వేటల వరకు వల పనికొస్తుంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లినప్పుడు పీతల కోసం ప్రత్యేక వలలు వేస్తారు. కొంచెం లోతుగా ఉండే ప్రాంతాల్లో పీతలు ఎక్కువగా దొరుకుతాయి. ఆ ప్రదేశాల్లో ఎక్కువ పీతలు పడితే ఆ రోజు పంట పండినట్లే. అర కేజీ నుంచి సుమారు రూ.8 కేజీల బరువైన పీతలు దొరుకుతాయి. మాంసాన్ని వేరు చేసి ఎగుమతులు విదేశాల్లో పీతల్ని కాకుండా.. వాటి నుంచి వేరు చేసిన మాంసాన్ని కొనుగోలు చేస్తారు. దీంతో పీతల అవయవాల్ని బట్టి రేటు మారుతుంది. డెక్కల్లో మాంసానికి ఒక రేటు, కడుపు భాగంలో మాంసానికి మరో రేటు పలుకుతుంది. మన తీరప్రాంతంలో కొన్న పీతలను ఉడకబెట్టి.. ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తారు. అక్కడ వాటిని శుభ్రం చేసి డిప్పలు, డెక్కలు పూర్తిగా తొలగించి కేవలం మాంసాన్ని మాత్రమే ఎగుమతి చేస్తారు. విడివిడిగా ప్యాకింగ్‌లు చేసి విదేశాలకు పంపుతారు. గిరాకీ పెరిగింది ఉప్పాడ పరిసర ప్రాంతాల నుంచి ప్రతీ రోజు సుమారు టన్ను వరకు పీతలు కొనుగోలు చేస్తున్నారు. వేట ఎక్కువ ఉంటే 2 నుంచి 5 టన్నుల వరకు పీతలు కొంటున్నారు. జిల్లాలోని తీర ప్రాంతాల్లో కొనుగోలు చేసిన పీతలను కంటైనర్ ద్వారా చెన్నై, ముంబయిల్లోని ఫ్యాక్టరీలకు తరలించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మేము అమ్మే కంపెనీలు పీతల్ని అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. – మల్లిబాబు, పీతల వ్యాపారి, ఉప్పాడ జోరుగా ఎగుమతులు గతం కంటే పీతల ఎగుమతులు పెరిగాయి. ఉడకబెట్టి ప్యాకింగ్ చేయడం వల్ల పీతలు ఎక్కువ కాలం నిల్వ ఉండడంతో పాటు నాణ్యంగా ఉంటాయి. అందువల్లే విదేశాల్లో వీటికి గిరాకీ పెరిగింది. ఈ పీతల రకాలు మన తీర ప్రాంతంలోనే లభ్యమవుతాయి. చెరువుల్లో పెంచే పీతలకంటే సముద్ర పీతలకు గిరాకీ ఎక్కువ. ఉప్పాడ, కాకినాడ, అంతర్వేది తదితర ప్రాంతాల్లో వ్యాపారులు వీటిని కేజీల లెక్కన కొంటున్నారు. జీలా రకం పీత ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి. –శ్రీనివాసరావు, మత్స్యశాఖ ఏడీ, కాకినాడ -
మంత్రి ఇంటి ముందు వినూత్నంగా నిరసన
-
మంత్రి ఇంటి ముందు పీతలు వదిలారు..
సాక్షి, ముంబై: రత్నగిరి జిల్లాలో తివరే డ్యాం ఆనకట్ట తెగిపోవడానికి పీతలే ప్రధాన కారణమని వ్యాఖ్యలు చేసిన జలవనరుల శాఖ మంత్రి తానాజీ సావంత్‌కు ఎన్సీపీ కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపారు. మంగళవారం ఉదయం ఎన్సీపీ కార్యకర్తలు గుంపులుగా వచ్చి సావంత్ ఇంటి ప్రాంగణంలో గంపలో పీతలు తీసుకొచ్చి పోసి నిరసన తెలిపారు. తివరే డ్యాం ఆనకట్ట తెగిపోవడానికి ప్రధాన కారణం పీతలేనని ఇటీవల తానాజీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహానికి గురైన ఎన్సీపీ కార్యకర్తలు మంత్రి ఇంటి ముందు పీతలు పోశారు. మరోవైపు అక్కడకు చేరుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా ఇటీవల కురిసిన వర్షాలకు తివరే ఆనకట్టకు గండిపడి దిగువన ఉన్న గ్రామాలు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 19మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. -
ఆ బ్యాక్టీరియా అతని శరీరాన్ని తినేస్తోంది..
న్యూజెర్సీ : మాంసం తినే బ్యాక్టీరియా పీతల వేటగాడి పాలిట శాపంగా మారింది. శరీరంలోని భాగాలను కొద్ది కొద్దిగా తింటూ అతన్ని చావుకు దగ్గర చేస్తోంది. ఈ సంఘటన న్యూజెర్సీలోని మ్యాట్స్ ల్యాండింగ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూజెర్సీకి చెందిన ఏంజెల్ పెరెజ్ అనే పీతల వేటగాడు జూలై 2వ తేదీన మోరైస్ నదిలో వేటకు వెళ్లి పీతలు పట్టి ఇంటికి చేరుకున్నాడు. ఆ మరుసటి రోజు అతని కుడికాలు కొద్దిగా వాపుకు గురై బొబ్బలతో ఎర్రగా మారింది. అతడికి ఇదివరకే పార్కిన్సన్స్ అనే వ్యాధి ఉండటంతో కుటుంబసభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. ఆస్పత్రిలో చేరినప్పటికి.. దాన్ని ఓ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా భావించిన వైద్యులు ఏవో మందులు రాసి అతన్ని ఇంటికి పంపించారు. కొద్ది రోజుల తర్వాత ఆ ఇన్ఫెక్షన్ పెరెజ్ రెండో కాలికి కూడా సోకింది. దీంతో మళ్లీ అతను ఆస్పత్రిలో చేరగా అతని పరిస్థితిని గమనించిన వైద్యులు ప్రత్యేకమైన పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అసలు విషయం బయటపడింది. విబ్రియో అనే మాంసం తినే బ్యాక్టీరియా అతని శరీరంలోకి ప్రవేశించి కొద్ది కొద్దిగా అతని కాళ్లను తింటోందని తేలింది. ఆ ఇన్ఫెక్షన్ రెండు కాళ్లకు పూర్తిగా వ్యాపించి అతని ప్రాణానికే ముప్పగా మారింది. ప్రస్తుతం ఏంజెల్ పెరెజ్ 24గంటల అత్యవసర విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
పీతల పెంపకానికి డిమాండ్
నరసాపురం రూరల్: అంతర్జాతీయంగా పీతల పెంపకానికి మంచి డిమాండ్ ఉందని మత్స్యశాఖ డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఫణిప్రకాష్ అన్నారు. మండలంలోని తూర్పుతాళ్లు చామకూరిపాలెం ప్రాథమిక పాఠశాల వద్ద మంగళవారం రెండో అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. ఇప్పటికే బంగ్లాదేశ్, ఇండియా, థాయ్‌లాండ్, ఫిలిప్పైన్స్ తదితర దేశాల్లో పీతల సాగు ప్రాచుర్యం పొందిందన్నారు. మండపీత (సిల్లా సెర్రేట్రా) పెరుగుదల రుచి, మార్కెట్ ధర అధికంగా ఉండడం వల్ల పెంపకానికి రైతులు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. రొయ్యల సాగుకు ప్రత్యామ్నాయంగా పీతల సాగుకు తీరప్రాంత గ్రామాలు అనుకూలమన్నారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ శ్రమ లేకుండా లాభాలు ఆర్జించవచ్చని వివరించారు. రాష్ట్రంలో పీతల హేచరీని గుంటూరు జిల్లా సూర్యలంకలో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. నీటి నాణ్యత, పీతలు సాగు విధానాన్ని రిటైర్డ్ డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామ్మోహనరావు, ఎంపెడా ఏడీ పట్నాయక్ తదితరులు వివరించారు. జిల్లాలో 400 హెక్టార్లలో పీతలు, పండుగప్ప సాగవుతున్నట్టు చెప్పారు. సదస్సులో ఎంపీటీసీ పుచ్చకాయల తిరుపతమ్మ, మత్సశాఖ సహాయ సంచాలకులు ఎ.అప్పలరాజు, రమణకుమార్, అభివృద్ది అధికారులు ఎల్ఎన్ఎన్ రాజు, వి.సత్యనారాయణ, ఏడీ ఏడుకొండలు, ప్రతిభ, ఎంపీఈఏలు, పలువురు రైతులు పాల్గొన్నారు. -
సముద్రగర్భంలో తీసిన షాకింగ్ వీడియో
ఒకేసారి పెట్టిన వేలాది గుడ్ల ద్వారా ఉద్భవించే పీతలు.. పెరిగేకొద్దీ స్వజాతి జీవులను సహించలేవు. ఆహారం, స్థలం.. అన్నింటికోసం ఒకదానితో ఒకటి పోటీపడుతుంటాయి. అలాంటి పీతలు క్రమంగా ఒక్కటవుతున్నాయి. పీతల జీవన విదానంలో చోటుచేసుకుంటున్న ఈ మార్పులకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి ఇటీవలే బయటికి వచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన సముద్రగర్భ శాస్త్రవేత్త షెరీ మారిస్ మెల్ బోర్న్ లోని పోర్ట్ ఫిలిఫ్ బే సముద్ర గర్భంలో యాదృచ్ఛికంగా తీసిన వీడియోలో.. జెయింట్ క్రాబ్(రాకాసి పీత) ఒకటి ముందు నడుస్తుండగా, వేలాది పీతలు దాన్ని అనుసరిస్తూ కనిపించాయి. ఎవరిమీదో దండయాత్రకు వెళుతున్నట్లు లేదా కవాతు నిర్వహిస్తున్నట్లు క్రమపద్ధతిలో సాగిపోయిన పీతల బృందం తనకు కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం కల్పించినట్లు షెరీ చెప్పింది. ప్రాణ రక్షణ, ఆహార సేకరణ వంటి అత్యవసరాలను ఒంటరిగాకంటే బృందంగా ఉంటేనే చక్కబెట్టుకోవచ్చన్న ఆలోచనతోనే ఒక్కటయ్యాయని, అవి స్వజాతివైరం వీడటం ఆశ్చర్యం కలిగిస్తున్నదని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు గుంపులుగా ఏర్పడ్డ పీతలు.. ముందుముందు మనుషులతో పోరాటానికి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి..! -
కాలిఫోర్నియా బీచ్ లో 'రెడ్ కార్పెట్'
కాలిఫోర్నియాః అక్కడి తీర ప్రాంతాలు ఇప్పుడు సందర్శకులకు, పర్యటకులకు రెడ్ కార్పెట్ తో భయాన్ని గొల్పుతున్నాయి. రెడ్ కార్పెట్ అంటే సాదర స్వాగతం అనుకుంటే తప్పులో కాలేసినట్లే. నీటిలో కాలుష్య ప్రభావమో.. వాతావరణ ప్రతికూల పరిస్థితులో కానీ జలచరాలు కుప్పలు తెప్పలుగా ఒడ్డుకు చేరుకుంటుండటంతో ఎర్రని ట్యూనా పీతలతో నిండిన తీరం రెడ్ కార్పెట్ ను తలపిస్తోంది. వేలకు వేలుగా ఎర్ర పీతలు దక్షిణ కాలిఫోర్నియా బీచుల్లో చేరడం న్యూ పోర్ట్ బీచ్ సందర్శకులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అరుదుగా కనిపించే ఆ దృశ్యాన్ని కొందరు వింతగా చూస్తుంటే... అక్కడి మునిసిపల్ సిబ్బంది మాత్రం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయలేక తీవ్ర కష్టాలు పడుతున్నారు. కొన్నేళ్ళ క్రితం ఇలాగే సుమారు మూడు అంగుళాల పొడవైన ఎర్ర పీతలు కాలిఫోర్నియా ఆరెంజ్ కౌంటీ ప్రాంతాన్ని ముంచెత్తాయి. అయితే కొందరి కష్టం మరి కొందరికి ఆనందం అన్నట్టు.. శాండియాగోకి దగ్గరలో ఉన్న ఇంపీరియల్ బీచ్ లో పక్షుల ఆనందం మాత్రం పట్టలేకుండా ఉంది. ఓ స్పెషల్ బఫెట్ ను వాటి ముందు పెట్టినట్లు బీచ్ ఒడ్డుకు చేరిన పీతలను తినేందుకు ఉత్సాహంగా పక్షులు అక్కడికి చేరుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి చేరిన పీతలను అక్కడే వదిలేయాలా, తిరిగి సముద్రంలోకి పంపించాలా అన్న విషయంపై అధికారులు తలమునకలౌతున్నారు. గత 15 సంవత్సరాలనుంచి ఇలా ఎర్ర పీతలు సముద్ర తీరాల్లోకి కొట్టుకు వస్తున్నట్లు పురపాలక రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఒక్క క్రితం సంవత్సరంలోనే బాల్బోవా ఐస్ ల్యాండ్, చైనా కోవ్ ప్రాంతాల్లో కార్మికులు, స్వచ్ఛంద సభ్యులు కలసి ఎనిమిది టన్నుల దాకా ఒడ్డుకు చేరిన పీతలను పట్టుకొన్నట్లు లాస్ ఏంజిల్స్ దగ్గరలోని ఆరెంజ్ కౌంటీ న్యూపోర్ట్ నగరం చెప్తోంది. ఇలా నీటినుంచి జలచరాలు బయటకు వచ్చేయడానికి తీవ్ర వాతావరణ మార్పులే కారణమని సైంటిస్టులు చెప్తున్నారు. -
అన్వేషణం: బీచ్ కాని బీచ్
బీచ్ అంటే ఎలా ఉంటుంది? మేటలు వేసిన ఇసుక, ఆ ఇసుకలో మెరిసే గవ్వలు, అడ్డదిడ్డంగా పరుగులు తీసే పీతలు... ఇలాంటివే కనిపిస్తుంటాయి బీచ్‌లలో. కానీ ఆ బీచ్ అలా ఉండదు. ఎరుపురంగును చల్లినట్టుగా ఉంటుంది. ఎర్ర దుప్పటిని ఆరబెట్టినట్టుగా ఉంటుంది. సంధ్యాసమయంలో సూరీడు కనిపించినంత ఎర్రగా మెరుస్తూ ఉంటుంది. అందుకే దాన్ని రెడ్ బీచ్ అని పిలుస్తారు. చైనాలోని దవా కౌంటీలో, ల్యోనింగ్ అనే ప్రాంతంలో ఉంది రెడ్‌బీచ్. అయితే బీచ్ అన్నాం కదా అని ఇది సముద్రతీరం కాదు. ఓ నదీ పరీవాహక ప్రాంతం మాత్రమే. నిజానికి ల్యోనింగ్లో ఒకప్పుడు చాలా నదులు ఉండేవట. ఇవన్నీ చాలా దగ్గర దగ్గరగా ఉండేవని చెబుతారు. వాటిలో కొన్ని కాలక్రమంలో అంతరించి పోయాయి. ఇప్పటికీ చాలా నదులు మిగిలే ఉన్నాయి. అలా మిగిలివున్న పంజిన్ నదీ పరీవాహక ప్రాంతంలో ఉంది రెడ్‌బీచ్. ఈ బీచ్ ఎర్రగా ఉండటానికి, అసలు దీన్ని రెడ్‌బీచ్ అనడానికి కారణం... అక్కడ ఆవరించి ఉన్న ఎరుపురంగు మొక్కలు. జీనస్ అనే ఒక రకమైన రెల్లుగడ్డి ఆ ప్రాంతమంతా విస్తారంగా పెరుగుతుంది. ఆ గడ్డిమొక్కలు ఎరుపురంగులో ఉంటాయి. కొన్ని కిలోమీరట్ల మేర ఆవరించిన వాటిని చూస్తే, అక్కడి నేలే అంత ఎర్రగా ఉందా అనిపిస్తుంది. పేరుకు ఇది రెల్లు గడ్డే అయినా దీనితో చాలా ఉపయోగం ఉంది. దీనితో పేపర్ తయారు చేస్తారు. అందుకోసమే ఈ బీచ్‌ను ఎంతో జాగ్రత్తగా కాపాడుతున్నారు. జీనస్ మొక్కలు ఏప్రిల్ నెల నుంచి ఎదగడం మొదలు పెడతాయి. ఇవి మరీ ఎత్తుగా పెరగవు. అలా అని మరీ చిన్నగా కూడా ఉండవు. తొలుత పచ్చగానే ఉన్నా... పెరిగేకొద్దీ ఎరుపురంగును సంతరించుకుంటాయి. నవంబర్, డిసెంబర్ నెలలు వచ్చేసరికి పూర్తిగా ఎర్రగా మారిపోవడంతో అక్కడంతా చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. అందుకే అక్టోబర్ చివరి వారం నుంచి ఈ ప్రాంతానికి సందర్శకుల తాకిడి పెరుగుతుంది! శిక్షించే జైలు కాదు... శిక్షణనిచ్చే జైలు! నార్వేలోని బాస్టోయ్లో ఉన్న దీవిలో ఒక జైలు ఉంది. ఇది అన్ని కారాగారాల్లాంటిది కాదు. ఇక్కడ ఖైదీలను బంధించరు. ఫ్రీగా వదిలేస్తారు. వాళ్లు ఎలాగైనా తిరగొచ్చు. ఏది నచ్చితే అది చేయవచ్చు. సరదాగా ఎంజాయ్ చేయవచ్చు. మొత్తంగా హాయిగా ఉండవచ్చు. కేవలం నూట పదిహేను మంది మాత్రమే పట్టే ఈ జైల్లో జైలర్, మరో ఇద్దరు అధికారులు, ఐదుగురు సెక్యూరిటీ గార్డులు మాత్రమే ఉంటారట. వంట దగ్గర్నుంచి గడ్డి కోయడం వరకూ ఖైదీలే వంతుల వారీగా చేస్తుంటారు. ఇంతే తినాలి, ఇవే తినాలి అనే రూల్స్ ఉండవు. కావలసినంత సుష్టుగా తినవచ్చు. రోజులో కాసేపు వారికి ఆసక్తి ఉన్న ఏదో ఒక అంశంలో శిక్షణ ఉంటుంది. బయటకు వెళ్లాక తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు, మళ్లీ నేరాల జోలికి పోకుండా ఉండేందుకు అవసరమైన పనులు నేర్పిస్తారు. మిగిలిన సమయమంతా సరదాగా, ప్రశాంతంగా గడపవచ్చు. బంధించడం వల్ల నేరస్తుల్లో మార్పు రాదని, వారి ఆలోచనల్లో మార్పు తేవాలని నమ్మే ఆర్నే వెర్నెవిక్ ఆలోచనలకు ప్రతిరూపమే బాస్టోయ్ కారాగారం. జైళ్ల గవర్నర్‌గా ఆయన తీర్చిదిద్దిన ఈ జైలు ఇతర దేశాల్లోని అధికారులను కూడా ఆలోచింపజేస్తోంది!