
తాడేపల్లిగూడెం: పీతలు పేరు చెప్పగానే మాంసాహారులు లొట్టలేస్తారు. కానీ ధర చూస్తే మాత్రం ఇదెక్కడి పితలాటకం అని జారుకునే పరిస్థితి వచ్చింది. జిల్లా మార్కెట్లకు గురువారం పెద్దపెద్ద పీతలు వచ్చా యి. పచ్చ రంగులో ఉన్న వీటికి సైజును బట్టి వ్యాపారులు ధర నిర్ణయించారు. చిన్న సైజువి ఒక్కోటి రూ.150, పెద్దవి గరిష్టంగా ఒక్కోటి రూ.వెయ్యి పలికాయి. సాధారణంగా పెద్దపీతలను వ్యాపారులు విదేశాలకు ఎగుమతి చేస్తారు. కరోనా వల్ల ఎగుమతు లు నిలిచిపోవడంతో ఇవి తణుకు, గూడెం మార్కెట్లకు వచ్చాయి. మనసు ఉండబట్ట లేని కొద్దిమంది మాత్రం కొనుగోలు చేశారు.