మాములుగా అత్యంత అరుదుగానే వేరే ప్రాంతానికి సంబంధించిన ఫుడ్ ఐటెమ్స్ అయితే బాగా ఖరీదుగా ఉంటాయి. అది కూడా మహా అయితే వెయ్యి లేదా ఆపైన ఉంటుంది. కానీ మనకు తెలిసిన ఐటెం అందుబాటులో ఉండేది అంత ధర ఉండదు. పోనీ ఓ పెద్ద రెస్టారెంట్ అయినా కూడా ఘోరమైన ధర ఫలకదు. కానీ ఇక్కడొక జపాన్ టూరిస్ట్‌కి మాత్రం తాను ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటెం ధర విని మాటలు రాలేదు. ఏడుపుఒక్కటే తక్కువ అన్నంత చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. చివరికి పోలీసులను కూడా ఆశ్రయించింది.
జపాన్‌కి చెందిన షిన్బా తన స్నేహితులతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లింది. అక్కడ ఆమె ఆగస్టు 19న ప్యారడైజ్ రెస్టారెంట్‌లో భోజనం చేస్తుండగా ఆమె చిల్లి క్రాబ్ ఆకర్షించడంతో వెంటనే దాన్ని కూడా ఆర్డర్ చేసింది. అయితే సర్వర్ దాని ధర కేవలం 20 డాలర్లు(రూ.1,661/-) చూపించాడు. దీంతో అంత పెద్ద మొత్తం ఏం కాదుకదాగా అని ధైర్యంగా ఆర్డర్ చేసింది తీరా తిన్నాక సర్వర్ ఇచ్చిన బిల్లు చూసి ఒక్కసారిగా కంగుతింది. ఒక్కరు తింటే అంతే అయ్యేది కాని ఇక్కడ తిన్నది నలుగురు కాబట్టి దాని ధర అంతేనని తేల్చి చెప్పారు రెస్టారెంట్ సిబ్బంది. దీంతో ఒక్కసారిగా ఆమె షాకయ్యింది. అది అలస్కాన్ కింగ్ చిల్లీ క్రాబ్ అని దాని ధర అంతే ఉంటుందని చెప్పడంతో ఆమెకు ఒక్కసారిగా అయోమయంగా అనిపించింది.
ముందుగానే సర్వర్‌ని ఆ పీతల కూర రెసిపీ ధర అడిగే ఆర్డర్ చేస్తే ఇలా అనడం అర్థం కాలేదు. అది కూడా ఆ బిల్లు ఏకంగా రూ. 56,603 అని ఉండేటప్పటికీ ఏమని ప్రశ్నించాలో తెలియలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. వారు వచ్చి ఆ రెస్టారెంట్ అధికారులను అడిగితే..అంతకుముందు అదే రెసిపీకి వెరొక కస్టమర్ పే చేసిన బిల్లు చూపించి దీని ఖరీదు ఎక్కువ అని చెప్పారు. ఇక ఆ పీతను కూడా తీసుకొచ్చి ఇది చాలా బరువుగా ఉంటుందని, కస్టమర్ ఆర్డర్ చేయంగానే అప్పటికప్పుడు వండి పెడతామని చెప్పడంతో ఆమెకు నోటి మాట రాలేదు.
అయితే అంత ఖరీదైన పీతలు గురించి క్లియర్‌గా మెనులో ఎందుకివ్వలేదు. సర్వర్ నాకు ఇలా 20 డాలర్లని ఎందుకు చూపించాడు అని వాదనకు దిగింది. ఆ రెసిపీ వందగ్రాములే 20 డాలర్లు అని అర్థం అని చెప్పడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతయ్యింది. ఇక కాసేపటి చర్చల అనంతరం సదరు రెస్టారెంట్ సహృద్భావంతో 70 డాలర్లు (రూ. 6.749) తగ్గించేందుకు ముందుకు వచ్చింది. కానీ సదరు కస్టమర్ కట్టేందుకు నిరాకరించింది. పైగా సదరు రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేగాదు ఈ విషయమై సింగపూర్ టూరిజం బోర్డుని కూడా సంప్రదించింది. వారు ఆమెన సింగపూర్ వినయోగాదారుల అసోసీయేషన్‌ని సంప్రదించమని చెప్పారు. ఇష్టంగా తిన్న పీతల కూర రగడ కాస్త కేసుల వరకు వెళ్లి తీరని చేదు అనుభవాన్ని మిగిల్చింది.
Comments
Please login to add a commentAdd a comment