Tackling
-
ఆ దేశం పీతలను అంతం చేసేందుకు ఏకంగా రూ. 26 కోట్లు..!
ప్రతి దేశం తన బడ్జెట్ ప్రకారం ఆయా రంగాల అభివృద్ధికి కొంత కేటాయించడం కామన్. అన్ని దేశాల్లోనూ జరిగేదే. కానీ కేవలం ఒక సీ ఫుడ్ కోసం కోట్లు కేటాయించడం విన్నారా!. అది కూడా పీతలను తొలగించేందుకు దాదాపు 26 కోట్లు కేటాయించాలని ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏంటీ వింత నిర్ణయం అనిపిస్తుంది కదా!. అసలు ఎందుకు ఇటలీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాటి కోసం ప్రత్యేకంగా అంత డబ్బు ఎందుకంటే.. అసలేం జరిగిందంటే..ఇటలీలో నీలిరంగు పీతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎంతలా అంటే ప్రఖ్యాతి గాంచిన నత్తల జాతిని అంతం చేసేలా పెరిగిపోతున్నాయి. నిజానికి ఈ నీలరంగు పీతను పశ్చిమ అట్లాంటిక్‌కు చెందినవి. తొలినాళ్లలో ఒకటో రెండు నీలి పీతలను గుర్తించారు ఇటలీ వాసులు. ఆ తర్వాత క్రమంగా వాటి సంఖ్య పెరిగిపోవడమే గాక వాటి కారణంగా నత్తలు మాయం అవ్వుతున్నాయి. దీంతో పాటు షెల్ఫిష్, ఫిఫ్ రో వంటి ఇతర జలచరాలు చనిపోవడం జరిగింది. ఇటలీ వాసులు మొలస్కా జాతికి చెందిన నత్తలను బాగా తింటారు. అందుకు సంబంధించి ఆక్వా కల్చర్ ఇటలీలో బాగా ప్రఖ్యాతి గాంచింది. అలాంటి ఆక్వాకల్చర్ ఇప్పుడు ఈ నీలిపీతల కారణంగా చాల నష్టాలను చవి చూస్తోంది. ఈ నీలిపీతలు సముద్ర జాతికి చెందని కొన్ని మొక్కలు, ఇతర జలచర జంతువులను తినేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఉత్తర ఇటలీలో ఉన్న పో రివర్ వ్యాలీ డెల్టాలో ఉన్న ఆక్వాఫార్మ్‌లు దారుణంగా దెబ్బతిన్నాయి. సముద్ర జీవశాస్త్రవేత్తలు ఈ నీలి పీతలు ఈ ప్రాంతంలో ఉండే నత్తలను దాదాపు 90% వరకు తినేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఇటలీ ప్రభుత్వం ఆ నీలిపీతల ఉధృతికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇటాలియన్ వ్యవసాయం మంత్రి ఫ్రాన్సిస్కో లోలోబ్రిగిడా పో నది డెల్టాను సందర్శించిన తదనంతరమే ఈ పీతల నిర్మూలన కోసం నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పెద్ద ఎత్తున ఆ పీతలను వేటాడి అంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులు వీలైనంత ఎక్కువ పీతలను పట్టి వాటిని చంపేయాలని సూచించారు. అందుకు కోసం దాదాపు రూ. 26,51,00,000 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. వీలైనంత తర్విత గతిన ఈ నీలిపీతల సంఖ్యను తగ్గించకపోతే పరిస్థితి తీవ్రమై పర్యావరణ ప్రభావాలకు లోనవ్వాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరించారు. అంతేగాదు యూఎన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం, చైనా, దక్షిణ కొరియా తర్వాత ఇటలీనే ఎక్కువగా నత్తలను పెంచే మూడొవ అతిపెద్ద ఉత్పత్తిదారు. (చదవండి: ఇష్టం అంటే మరీ ఇలానా! ఈ 'స్ట్రేంజ్ అడిక్షన్' వింటే షాకవ్వాల్సిందే!) -
వాల్‌మార్ట్‌లో జింక హల్చల్.. సిబ్బంది భలే కంట్రోల్ చేశారే! వైరల్
మనుషుల అభివృద్ధి పేరుతో నగరాలను విస్తరించూకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతాలు కూడా జననివాసాలుగా మారుతున్నాయ్.దీని కారణంగా అడవులు తగ్గి జంతువులు నగరాల్లో సంచరించడం ఇటీవల మామూలుగా మారిపోయింది. కొన్ని సందర్భాల్లో అవి మనుషుల మధ్య కనిపిస్తు అవి బెదురుతూ మనల్ని భయపెడుతున్నాయి. కాగా ఈ సన్నివేశాలు రికార్డు కావడం, నెట్టింట వైరల్ గా మారి హల్ చల్ చేయడం తెలిసిందే. ప్రస్తుతం అలాంటి తరహాలో ఓ జింక్ వాల్‌మార్ట్‌లోకి రాగా దాన్ని కంట్రోల్ చేయడానికి నానతంటాలు పడ్డాడు ఓ సిబ్బంది. వివరాల్లోకి వెళితే.... విస్కాన్సిన్ వాల్‌మార్ట్‌లో అనుకోని కస్టమర్ రూపంలో ఓ జింక షాపులోకి వచ్చింది. పాపం అక్కడి పరిసరాలు అంతా కొత్తగా ఉండే సరికి కాస్త బెదిరి నానా హైరానా చేసింది. ఇక షాపును ధ్వంసం చేస్తుండడంతో అందులోని ఓ సిబ్బంది మాత్రం ధైర్యంగా ఆ జింకను కట్టడి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందులో.. జింకను నడవకుండా సిబ్బంది చాకచక్యంగా దాన్ని నియంత్రిస్తూ వ్యవహరించాడు. జంతువు పట్టు నుండి బయటపడటానికి ప్రయత్నించినప్పటికీ, వదలకుండా అలానే ఆ సిబ్బంది ఉండగా ఈ క్రమంలో ఇతర సిబ్బంది దాని బయటకు పంపడానికి వెనుక తలుపు తెరిచి పంపేసి హమ్మయ్యా అనుకున్నారు. ఈ ఘటన జూన్ 23 న బారాబూలో జరిగగా, ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. When a deer got loose inside a Wisconsin Walmart, one brave employee pinned it with her bare hands until coworkers could rush to open a back door. According to reports, the deer was then released outside safely. pic.twitter.com/a3rzY9wMkg— NowThis (@nowthisnews) June 30, 2021 -
కేసుల పరిష్కారంలో వేగం పెంచాలి
న్యాయ వ్యవస్థపై ప్రజావిశ్వాసాన్ని పెంపొందించాలి హైకోర్టు జడ్జి, జస్టిస్ నవీ¯ŒSరావు పరకాలలో కోర్టు భవనాలు ప్రారంభం పరకాల : కోర్టుకు పోతే త్వరగా న్యాయం జరగదని ప్రజల్లో ఉన్న అపోహను తొలగించాలని హైకోర్జు జడ్జి, జస్టిస్ పి.నవీ¯ŒSరావు అన్నారు. రూ.2.50 కోట్లతో పరకాలలో నిర్మించిన జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మెజిసే్ట్రట్ ఆఫ్ ఫస్ట్‌క్లాస్ కోర్టు భవనాలను ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జిల్లా జడ్జి ఎం.లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ నవీ¯ŒSరావు మాట్లాడుతూ న్యాయవాదులు సమన్వయంతో వ్యవహరించి ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించాలన్నారు. కోర్టులపై ప్రజా విశ్వాసాన్ని పెంపొందింపజేయాలన్నారు. సకల సౌకర్యాలు కలిగిన కోర్టు భవనాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించాలన్నారు. జిల్లా జడ్జి ఎం.లక్ష్మణ్ మాట్లాడుతూ గతంలో చెట్లకింద నిర్వహించిన కోర్టు ఇప్పుడు కొత్త బిల్డింగ్‌లోకి మారిందన్నారు. కేసులను త్వరగా పరిష్కరించడంపై దృష్టిసారించాలని కోరారు. బార్ కౌన్సిల్ సభ్యుడు ముద్దసాని సహోదర్‌రెడ్డి మాట్లాడుతూ మన దేశానికి పాకిస్తా¯ŒS కంటే పెద్ద శత్రువులు కొంతమంది కాంట్రాక్టర్లు, ఇంజినీర్లేనన్నారు. కొత్తగా కడుతున్న కోర్టు భవనాలు త్వరగా కూలిపోతున్నాయన్నారు. జిల్లా కోర్టు వెనుక భాగంలో నిర్మించిన భవనం ఐదేళ్లు కూడా నిలవలేదన్నారు. ఈ వ్యవస్థలో సమూల మార్పులు రావాలన్నారు. సీనియర్ న్యాయవాదులు మల్లారెడ్డి, పున్నం రాజిరెడ్డి, బార్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు ఒంటేరు రాజమౌళి, జూనియర్ సివిల్ కోర్టు జడ్జిలు జీవ¯ŒSకుమార్, అర్జున్, జిల్లా అదనపు జడ్జిలు, జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, తొర్రూర్ కోర్టుల జడ్జిలు, పరకాల డీఎస్పీ వైవీఎస్ సుధీంద్ర, సబ్ డివిజ¯ŒSలోని పోలీసు అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. అంతకుముందు కోర్టు భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి వందేమాతర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైకోర్టు జడ్జి నవీ¯ŒSరావుకు పూర్ణకుంభ స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.