కేసుల పరిష్కారంలో వేగం పెంచాలి
-
న్యాయ వ్యవస్థపై ప్రజావిశ్వాసాన్ని పెంపొందించాలి
-
హైకోర్టు జడ్జి, జస్టిస్ నవీ¯ŒSరావు
-
పరకాలలో కోర్టు భవనాలు ప్రారంభం
పరకాల : కోర్టుకు పోతే త్వరగా న్యాయం జరగదని ప్రజల్లో ఉన్న అపోహను తొలగించాలని హైకోర్జు జడ్జి, జస్టిస్ పి.నవీ¯ŒSరావు అన్నారు. రూ.2.50 కోట్లతో పరకాలలో నిర్మించిన జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మెజిసే్ట్రట్ ఆఫ్ ఫస్ట్‌క్లాస్ కోర్టు భవనాలను ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జిల్లా జడ్జి ఎం.లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ నవీ¯ŒSరావు మాట్లాడుతూ న్యాయవాదులు సమన్వయంతో వ్యవహరించి ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించాలన్నారు. కోర్టులపై ప్రజా విశ్వాసాన్ని పెంపొందింపజేయాలన్నారు. సకల సౌకర్యాలు కలిగిన కోర్టు భవనాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించాలన్నారు.
జిల్లా జడ్జి ఎం.లక్ష్మణ్ మాట్లాడుతూ గతంలో చెట్లకింద నిర్వహించిన కోర్టు ఇప్పుడు కొత్త బిల్డింగ్‌లోకి మారిందన్నారు. కేసులను త్వరగా పరిష్కరించడంపై దృష్టిసారించాలని కోరారు. బార్ కౌన్సిల్ సభ్యుడు ముద్దసాని సహోదర్‌రెడ్డి మాట్లాడుతూ మన దేశానికి పాకిస్తా¯ŒS కంటే పెద్ద శత్రువులు కొంతమంది కాంట్రాక్టర్లు, ఇంజినీర్లేనన్నారు. కొత్తగా కడుతున్న కోర్టు భవనాలు త్వరగా కూలిపోతున్నాయన్నారు. జిల్లా కోర్టు వెనుక భాగంలో నిర్మించిన భవనం ఐదేళ్లు కూడా నిలవలేదన్నారు. ఈ వ్యవస్థలో సమూల మార్పులు రావాలన్నారు. సీనియర్ న్యాయవాదులు మల్లారెడ్డి, పున్నం రాజిరెడ్డి, బార్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు ఒంటేరు రాజమౌళి, జూనియర్ సివిల్ కోర్టు జడ్జిలు జీవ¯ŒSకుమార్, అర్జున్, జిల్లా అదనపు జడ్జిలు, జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, తొర్రూర్ కోర్టుల జడ్జిలు, పరకాల డీఎస్పీ వైవీఎస్ సుధీంద్ర, సబ్ డివిజ¯ŒSలోని పోలీసు అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. అంతకుముందు కోర్టు భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి వందేమాతర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైకోర్టు జడ్జి నవీ¯ŒSరావుకు పూర్ణకుంభ స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.