న్యూఢిల్లీ: జీవితంలో ఓ సొంతిల్లు కొనుక్కోవాలని ఎవరికైనా ఉంటుంది. ఇందుకోసం పైసాపైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్న వారు లేదా కొనుక్కున్న వారు ఉంటారు. ఈ క్రమంలో సామాన్యులు తమ తాహతుకు మించే ఖర్చు చేస్తారు. అయితే మన దేశంలో వంద కోట్ల ఖరీదు చేసే ఫ్లాట్లు ఉన్నాయంటే మీరు నమ్ముతారా?
లగ్జరీ రియల్ ఎస్టేట్‌కు కొత్త నిర్వచనం
న్యూఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లో లీడింగ్ రియల్ ఎస్టేట్ డెవరపర్స్(డీఎల్‌ఎఫ్) సంస్థ ‘ది కామెల్లియాస్’ పేరుతో అత్యంత ఖరీదైన లగ్జరీ అపార్ట్‌మెంట్‌లను నిర్మిస్తోంది. ఇది భారతదేశంలో లగ్జరీ రియల్ ఎస్టేట్‌కు కొత్త నిర్వచనాన్ని అందించే విధంగా ఉందనే మాట వినిపిస్తోంది. ‘ది కామెలియాస్’లో ఒక్కో అపార్ట్ మెంట్ ధర రూ.100 కోట్ల వరకు ఉంది. దేశంలోని అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు, సీఈఓలు, అత్యంత ధనవంతులకోసం ‘ది కామెల్లియాస్’ నిర్మితమయ్యింది. ఈ ప్రాజెక్ట్ విలాసవంతమైన ఇంటీరియర్స్, సాటిలేని విసాలవంతమైన సౌకర్యాలకు నెలవుగా ఉంది.
పదేళ్లలో నాలుగు రెట్లు పెరిగిన ఇళ్ల ధరలు
2014లో ‘ది కామెలియాస్’ ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు చదరపు అడుగు ధర రూ.22,500. కానీ నేడు దాని ధర చదరపు అడుగు రూ.85,000కు పైగానే పలుకుతోంది. అంటే పదేళ్లలో 4 రెట్లు పెరిగింది. గతంలో దాదాపు రూ.25-30 కోట్లకు అమ్ముడుపోయిన ఇక్కడి ఫ్లాట్ ధర నేడు రూ.100 కోట్లకు చేరుకుంది. ఢిల్లీలోని అత్యంత పాష్ ఏరియాలు, గురుగ్రామ్‌లోని పాష్ ఏరియాల మధ్య ధరల వ్యత్యాసం ఇప్పుడు తగ్గుతోందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. ఇటీవల, టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్‌పై ఒక నివేదికను అందించింది.
బాల్కనీలోంచి చూస్తే..
డీఎల్‌ఎఫ్ ది కామెల్లియాస్‌లోని ఫ్లాట్‌లో 72 అడుగుల గాజు బాల్కనీ ఉంటుంది. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి అతిథులు కోసం మరొకటి ఆ ఫ్లాట్‌లోని వారి కోసం రూపొందించారు. ఈ బాల్కనీ వినోదాలకు కేంద్రంగా ఉంటుంది. దీనిలో డైనింగ్ ఏరియా, ఫార్మల్ సీటింగ్, ఫ్యామిలీ మీటింగ్స్ కోసం ప్రత్యేక కార్నర్‌లు ఉన్నాయి. ఈ బాల్కనీలోంచి చూస్తే బయటనున్న స్విమ్మింగ్ పూల్, పచ్చని చెట్లు కనిపిస్తాయి.
లగ్జరీ లివింగ్‌లో కొత్త బెంచ్‌మార్క్
ఫ్లాట్ ఇంటీరియర్ డిజైన్‌లో సింపుల్‌గా ఉంటుంది. క్లాస్సి, స్పెషల్ ఫర్నిషింగ్‌ను ఇందుకోసం వినియోగించారు. డీఎల్‌ఎఫ్‌కు చెందిన ఐకానిక్ ప్రాజెక్ట్‌లు ‘ది అరాలియాస్’, ‘ది మాగ్నోలియాస్’ మాదిరిగా ఈ ప్రాజెక్ట్ కూడా ఢిల్లీ- ఎన్‌సీఆర్‌లో అల్ట్రా-లగ్జరీ లివింగ్ కోసం కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. కాగా ది కామెల్లియాస్‌కు మించిన పెద్ద ప్రాజెక్ట్‌ను త్వరలో ప్రారంభించేందుకు డీఎల్‌ఎఫ్ సన్నాహాలు చేస్తోందని సమాచారం.
కొత్త ప్రాజెక్టులో..
డీఎల్‌ఎఫ్ దహ్లియాస్ పేరుతో నిర్మితమవుతున్న ఈ అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ గోల్ఫ్ కోర్స్ రోడ్, గురుగ్రామ్‌లో నిర్మింతం కానుంది. సగటున ఒక అపార్ట్‌మెంట్‌కు దాదాపు రూ.100 కోట్లు ఖర్చుకానుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ. 34,000 కోట్లుగా అంచనా. ఇందులో 9,500 చదరపు అడుగుల నుండి 16,000 చదరపు అడుగుల వరకు నివాస స్థలాలు ఉంటాయి. దహ్లియాస్‌లో 2,00,000-చదరపు అడుగుల క్లబ్‌హౌస్ ఏర్పాటు కానుంది. ఇది కామెల్లియాస్‌లోని క్లబ్‌హౌస్ కంటే చాలా పెద్దదిగా ఉండనుంది. ఇది లగ్జరీ మార్కెట్‌లో మరింత ఆకర్షణీయంగా మారనుంది.
ఇది కూడా చదవండి: నేడు సుబ్రహ్మణ్య షష్టి: ఈ 10 ఆలయాల్లో విశేష పూజలు
Comments
Please login to add a commentAdd a comment