Finacial markets
-
అక్కడ ఒక్కో ఇల్లు రూ. 100 కోట్లు.. అదిరిపోయే ప్రత్యేకతలు
న్యూఢిల్లీ: జీవితంలో ఓ సొంతిల్లు కొనుక్కోవాలని ఎవరికైనా ఉంటుంది. ఇందుకోసం పైసాపైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్న వారు లేదా కొనుక్కున్న వారు ఉంటారు. ఈ క్రమంలో సామాన్యులు తమ తాహతుకు మించే ఖర్చు చేస్తారు. అయితే మన దేశంలో వంద కోట్ల ఖరీదు చేసే ఫ్లాట్లు ఉన్నాయంటే మీరు నమ్ముతారా?లగ్జరీ రియల్ ఎస్టేట్‌కు కొత్త నిర్వచనంన్యూఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లో లీడింగ్ రియల్ ఎస్టేట్ డెవరపర్స్(డీఎల్ఎఫ్) సంస్థ ‘ది కామెల్లియాస్’ పేరుతో అత్యంత ఖరీదైన లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మిస్తోంది. ఇది భారతదేశంలో లగ్జరీ రియల్ ఎస్టేట్‌కు కొత్త నిర్వచనాన్ని అందించే విధంగా ఉందనే మాట వినిపిస్తోంది. ‘ది కామెలియాస్’లో ఒక్కో అపార్ట్ మెంట్ ధర రూ.100 కోట్ల వరకు ఉంది. దేశంలోని అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు, సీఈఓలు, అత్యంత ధనవంతులకోసం ‘ది కామెల్లియాస్’ నిర్మితమయ్యింది. ఈ ప్రాజెక్ట్ విలాసవంతమైన ఇంటీరియర్స్, సాటిలేని విసాలవంతమైన సౌకర్యాలకు నెలవుగా ఉంది.పదేళ్లలో నాలుగు రెట్లు పెరిగిన ఇళ్ల ధరలు2014లో ‘ది కామెలియాస్’ ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు చదరపు అడుగు ధర రూ.22,500. కానీ నేడు దాని ధర చదరపు అడుగు రూ.85,000కు పైగానే పలుకుతోంది. అంటే పదేళ్లలో 4 రెట్లు పెరిగింది. గతంలో దాదాపు రూ.25-30 కోట్లకు అమ్ముడుపోయిన ఇక్కడి ఫ్లాట్ ధర నేడు రూ.100 కోట్లకు చేరుకుంది. ఢిల్లీలోని అత్యంత పాష్ ఏరియాలు, గురుగ్రామ్‌లోని పాష్ ఏరియాల మధ్య ధరల వ్యత్యాసం ఇప్పుడు తగ్గుతోందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. ఇటీవల, టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్‌పై ఒక నివేదికను అందించింది.బాల్కనీలోంచి చూస్తే..డీఎల్ఎఫ్ ది కామెల్లియాస్లోని ఫ్లాట్‌లో 72 అడుగుల గాజు బాల్కనీ ఉంటుంది. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి అతిథులు కోసం మరొకటి ఆ ఫ్లాట్‌లోని వారి కోసం రూపొందించారు. ఈ బాల్కనీ వినోదాలకు కేంద్రంగా ఉంటుంది. దీనిలో డైనింగ్ ఏరియా, ఫార్మల్ సీటింగ్, ఫ్యామిలీ మీటింగ్స్ కోసం ప్రత్యేక కార్నర్లు ఉన్నాయి. ఈ బాల్కనీలోంచి చూస్తే బయటనున్న స్విమ్మింగ్ పూల్, పచ్చని చెట్లు కనిపిస్తాయి.లగ్జరీ లివింగ్‌లో కొత్త బెంచ్మార్క్ఫ్లాట్ ఇంటీరియర్ డిజైన్‌లో సింపుల్‌గా ఉంటుంది. క్లాస్సి, స్పెషల్ ఫర్నిషింగ్‌ను ఇందుకోసం వినియోగించారు. డీఎల్ఎఫ్కు చెందిన ఐకానిక్ ప్రాజెక్ట్‌లు ‘ది అరాలియాస్’, ‘ది మాగ్నోలియాస్’ మాదిరిగా ఈ ప్రాజెక్ట్ కూడా ఢిల్లీ- ఎన్సీఆర్లో అల్ట్రా-లగ్జరీ లివింగ్ కోసం కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. కాగా ది కామెల్లియాస్కు మించిన పెద్ద ప్రాజెక్ట్‌ను త్వరలో ప్రారంభించేందుకు డీఎల్ఎఫ్ సన్నాహాలు చేస్తోందని సమాచారం.కొత్త ప్రాజెక్టులో..డీఎల్ఎఫ్ దహ్లియాస్ పేరుతో నిర్మితమవుతున్న ఈ అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ గోల్ఫ్ కోర్స్ రోడ్, గురుగ్రామ్‌లో నిర్మింతం కానుంది. సగటున ఒక అపార్ట్‌మెంట్‌కు దాదాపు రూ.100 కోట్లు ఖర్చుకానుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ. 34,000 కోట్లుగా అంచనా. ఇందులో 9,500 చదరపు అడుగుల నుండి 16,000 చదరపు అడుగుల వరకు నివాస స్థలాలు ఉంటాయి. దహ్లియాస్‌లో 2,00,000-చదరపు అడుగుల క్లబ్‌హౌస్ ఏర్పాటు కానుంది. ఇది కామెల్లియాస్లోని క్లబ్‌హౌస్ కంటే చాలా పెద్దదిగా ఉండనుంది. ఇది లగ్జరీ మార్కెట్లో మరింత ఆకర్షణీయంగా మారనుంది.ఇది కూడా చదవండి: నేడు సుబ్రహ్మణ్య షష్టి: ఈ 10 ఆలయాల్లో విశేష పూజలు -
ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ పనులు తప్పక చేయండి..లేదంటే!
గత ఆర్థిక సంవత్సరాంతంలో ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటు ఎటువంటి మార్పులు లేకుండా ఆమోదించింది. బిల్లు కాస్తా చట్టమైంది. చేర్పులో.. మార్పులో.. కూర్పులో.. వెరసి .. చట్టం అమల్లోకి వచ్చేసింది. ఈ మధ్య ప్రతి రోజూ పేపర్లలో నాలుగు ముఖ్యమైన అంశాలు, ఐదు విశేషాలు, ఆరు అమల్లోకి, ఏడు మార్పులు.. పది నిబంధనలూ అంటూ ఎన్నో వ్యాసాలు వరుసగా వచ్చాయి. నంబరుతో పని లేకుండా మీరు ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో చేయవలసింది ఏమిటంటే.. ► ఇప్పటివరకూ చేసుకోకపోతే వెంటనే పాన్‌తో ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోండి. అలా చేసుకోకపోతే ముందు ముందు ఆర్థిక వ్యవహారాలను స్తంభింపచేస్తారు. పెనాల్టీ పడుతుంది. ఈసారి ఇక వాయిదా ఇవ్వరు. ► 31–3–2022తో ముగిసిన సంవత్సరానికి రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు తేదీ 31–07–2022 అని మర్చిపోకండి. గత రెండు సంవత్సరాలు కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో పెద్ద పెద్ద వాయిదాలిచ్చారు. ఖచ్చితంగా ఈసారి వాయిదాలుండవు. ► మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే డిపార్ట్మెంట్ ఈసారి ఏప్రిల్ మొదటి వారంలోనే అన్ని ఫారంలను నోటిఫై చేసింది. సులువైన, సరళమైన ప్యాకేజీలు అమలు చేసింది. ఏ క్షణంలోనైనా ఎనేబుల్ చేస్తుంది. అలా అయింది అంటే ఆట మొదలైందన్నమాటే. ► కొత్తగా ’రివైజ్ రిటర్ను’ పట్టుకువచ్చారు. గతంలో ఏదైనా ఖర్చు అంటే .. పన్ను, వడ్డీలు కడితే వేసుకోవచ్చు. 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల్లో ఏదేని కారణం వల్ల ఆదాయం తక్కువగా చూపి ఉంటే .. ఇప్పుడు మర్చిపోయిన ఆదాయాన్ని చూపిస్తూ .. పన్ను, వడ్డీ అదనంగా 25 శాతం లేదా 50 శాతం చెల్లించి రివైజ్ రిటర్ను వేసుకోవచ్చు. రివైజ్ చేసినప్పుడు ఆదాయం తగ్గితే ఒప్పుకోరు. ►క్రిప్టో ఆస్తుల మీద పన్ను, భవిష్య నిధిలో జమ రూ. 2,50,000 దాటితే వచ్చే వడ్డీ మీద పన్ను, అదనపు టీడీఎస్ వసూలు.. ఇలాంటివన్నీ కొత్త బరువులు. ► కోవిడ్ ఖర్చుల నిమిత్తం వచ్చిన మొత్తం, కోవిడ్ వల్ల మృత్యువాత పడినందుకు వచ్చే పరిహారం, ఉద్యోగస్తులకు కొత్త పెన్షన్ స్కీమ్ జమలపరమైన మినహాయింపులు.. ఇవన్నీ ఉపశమనాలు. ► నోటీసులు ఎప్పుడైనా రావచ్చు. చకోర పక్షుల్లాగా రోజూ మీ ఈమెయిల్ బాక్సును గమనించండి. వెంటనే జవాబు ఇవ్వండి. అశ్రద్ధ వద్దు. కొన్ని చిన్న చిన్న వివరణల వల్ల .. సవరణల వల్ల సమస్య సమసిపోతుంది. కొన్నింటికి రుజువులు ఇవ్వాలి. స్క్రూటినీ అయితే .. బాగా ప్రిపేర్ అవ్వాలి. తగినంత సమయం ఇస్తారు. అలుసు తీసుకుని జాప్యం చేయొద్దు. ఫేస్‌లెస్ రోజులివి! ►ఈ మధ్య డాక్టర్ల విషయంలో బుక్స్ రాయలేదని పెనాల్టీలు వేశారు. ఉద్యోగస్తులు అవసరం లేదు. ఇతరులు బుక్స్ రాయండి. ఇప్పుడు ఎన్నో అకౌంటింగ్ ప్యాకేజీలు ఉన్నాయి. రుజువులు భద్రపర్చుకోండి. జీఎస్టీ చట్టప్రకారం నడుచుకోండి. ► ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్లానింగ్ ఆలోచించండి. ఆస్తి కొనాలన్నా.. అమ్మాలన్నా.. ఆస్తుల పంపకం, రిటైర్మెంట్ ప్రయోజనాలు, వ్యాపారం చేయాలన్నా.. పెద్ద పెద్ద మొత్తాలు ఇన్వెస్ట్ చేయాలన్నా.. ఆలోచించి అడుగేయండి. -
ఆర్థికంగా కోలుకోవాలంటే పర్యాటకం ఉరకలెత్తాలి
దాదాపు 12 నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో పర్యా టకం అగ్రభాగంలో ఉంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు నిబంధనలు సరళీకృతం చేయ డంతోపాటు వివిధ విభాగాల తోడ్పాటు అవసరం. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ (డబ్ల్యూటీటీసీ) ప్రకారం పర్యాటక రంగం అంతర్జాతీయంగా 3,815 బిలియన్ డాలర్లు నష్ట పోయినట్లు అంచనా. పర్యాటక రంగాన్ని దీర్ఘకాలంగా వెంటిలేటర్‌పై ఉంచిన ఈ విపత్తు తొలగాలంటే మార్కె ట్లోకి విజయవంతంగా పరీక్షించిన పలు టీకాలు రావడమే ఏకైక మార్గం. పలు దేశాల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తోంది. మాల్దీవుల్లో 56.6 శాతం, థాయ్‌లాండ్‌లో 19.8 శాతం, మలేసియాలో 18.8 శాతం, ఆస్ట్రేలియాలో 10.8 శాతం, జపాన్‌లో 7 శాతం, భారత్‌లో 6.8 శాతం వరకు టూరిజంతో ఆదాయం వస్తోంది. అయితే, సంక్షోభాల కారణంగా పర్యాటకరంగం ఒడిదుడుకులకు గురికావడం చరిత్రలో ఇదే తొలిసారి కాదు. 2003లో సార్స్ కారణంగా అతలాకుతలమైన టూరిజం గాడిన పడేందుకు పదకొండు నెలలు పట్టింది. 2001లో అమెరికాలో జరిగిన 9/11 దాడుల అనంతరం పర్యాటకం దాదాపు పద్నాలుగు నెలల పాటు నేలచూపులు చూసింది. 2009లోనూ ఆర్థికమాంద్యం వల్ల ఊబిలోకి జారిన టూరిజం గట్టెక్కడానికి పంతొమ్మిది నెలలు పట్టింది. డబ్ల్యూటీటీసీ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2020 సెప్టెంబర్ నాటికి 14.26 కోట్ల ఉద్యోగాలు పోయినట్లు అంచనా. ఈ ఏడాది చివరి నాటికి ఇది 19.7 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. వీరిలో 43 శాతం మంది పర్యాటక రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారు. ఈ మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా ఆగ మనాలు (ఎరైవల్స్) 65 శాతం తగ్గినట్లు నివేదికలు వెల్లడి స్తున్నాయి. కోవిడ్ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా టూరిజం విధానాల్లో సమూల మార్పులు రావాలని ‘దర్యా’(సౌదీ అరేబియా)లో జరిగిన జీ–20 పర్యాటక శాఖ మంత్రుల సమావేశం సూచించింది. ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు పర్యాటక పునరుజ్జీవం ఆవశ్యకమని ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రపంచవ్యాప్తంగా 220 దేశాలను పరిశీలించిన అనంతరం 167 దేశాలు సంక్షోభాన్ని అధిగమించేందుకు వేగంగా నిర్దిష్ట చర్యలు చేపట్టాయని ఐరాస అంతర్జాతీయ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్ డబ్ల్యూటీవో) తెలిపింది. పర్యాటక రంగం పునరుజ్జీవం కోసం ప్రభుత్వాలు, ఆర్థిక వ్యవస్థలు తమ విధానాలను సవరించడంతోపాటు ఉపశమన చర్యలు చేపట్టడం అవసరం. ప్రత్యామ్నాయ మార్కెట్ల అన్వేషణ, ఉత్పత్తుల పరిశోధన దిశగా కార్య కలాపాలు సాగాలి. పలు దేశాలతో పాటు డిజిటల్ సంస్థలు, సేవా సంస్థలు వైద్య సదుపాయాలపై ప్రయాణికులకు విస్తృత అవగాహన కల్పించి విశ్వాసం కలిగించే ప్రయత్నం చేశాయి. సామాజిక దూరాన్ని పాటించేలా యాప్‌ల వినియోగం, సాంకేతిక సేవలను అందుబాటులోకి తెచ్చాయి. కోవిడ్ కారణంగా కొన్ని దేశాలు తమ ద్రవ్య నిర్వహణ విధానాన్ని మార్చుకున్నాయి. 2020 మార్చిలో అమెరికా ప్రభుత్వం కరోనా వైరస్ ఎయిడ్, రిలీఫ్, ఎకనామిక్ సెక్యూరిటీ చట్టం ద్వారా ప్రజారోగ్యం, సహాయ ప్యాకేజీ కింద 2.2 ట్రిలియన్ డాలర్లను కేటాయించింది. ఈ నిధిని దశలవారీగా పంపిణీ చేశారు. ఈ చట్టం అమెరికా కార్మికులు, కుటుంబాలు, చిన్న వ్యాపారులకు వేగంగా, నేరుగా సాయాన్ని అందచేయడం, ఉద్యోగ భద్రతకు తోడ్పడింది. వ్యాపార ఒడిదుడుకులు ఎదుర్కొన్న కంపెనీ లకు లక్ష యూరోల వరకు గ్రాంట్లు అందచేసేలా కరోనా వైరస్ డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేసింది ఫిన్లాండ్. పర్యాటక రంగంలో ప్రయాణాలు, వసతుల కల్పనపై నూతన విధానాలు, సృజనాత్మక చర్యలు చేపట్టే సంస్థలకు నిధులు కేటాయించింది. పర్యాటక రంగం కోలుకునేందుకు 18 బిలియన్ యూరోలు కేటాయించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం సంసిద్ధత తెలిపింది. ఇక ఐస్‌ల్యాండ్ ప్రత్యేంగా 18 బిలియన్ల ఐస్లాండిక్ క్రోనాల పెట్టుబడుల ప్రణాళిక రూపొందించింది. భారీ పర్యాటక కేంద్రాలు, జాతీయ పార్కుల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టింది. ఎయిర్‌పోర్టుల టెర్మినళ్లను పొడిగించడంతో పాటు మెరుగైన సదుపాయాలు కల్పించారు. నౌకాశ్ర యాలు, రోడ్లను అభివృద్ధి చేశారు. పర్యాటక రంగంలో వచ్చే మూడేళ్లలో 3.4 బిలియన్ యూరోలను పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా సమీకరించేలా స్పెయిన్ పరిశ్రమలు, వాణిజ్యం, పర్యాటక శాఖ ప్రణాళిక సమర్పించింది. స్పానిష్ రికవరీ విధానంలో భాగంగా దీన్ని సిద్ధం చేశారు. తమ దేశానికి వచ్చే పర్యాటకులు కోవిడ్ బారిన పడితే 3,000 డాలర్లు పరిహారంగా చెల్లిస్తామని ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం ప్రకటిం చడం విశేషం. సైప్రస్ ప్రభుత్వం ఇంకా ముందుకెళ్లి, కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన పర్యాటకుల వసతి, భోజనం, మందుల ఖర్చును తామే భరిస్తామని ప్రకటించింది. విదేశీ పర్యాటకులు తిరిగి వెళ్లేందుకు విమాన ఖర్చులు మాత్రమే భరిస్తే చాలని పేర్కొంది. సహ ప్రయాణికుల ఖర్చును కూడా భరిస్తామని తెలిపింది. ఇక మన దేశానికి వస్తే– కోవిడ్ వల్ల తీవ్రంగా నష్టపోయిన రంగాలపై ఆర్బీఐ నియమించిన నిపుణుల కమిటీ పేర్కొన్న ఆరు రంగాలలో ఆతిథ్యం, టూరిజం పరిశ్రమలున్నాయి. ఇబ్బందుల్లో ఉన్న సంస్థల పునర్ని ర్మాణం, యాజమాన్య మార్పిడి లాంటివి కమిటీ సిఫా రసుల్లో కీలకం. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా రూ.3 లక్షల కోట్ల వరకు కొల్లేటరల్ సెక్యూరిటీ లేకుండా రుణాలను ప్రకటించారు. 12 నెలల మారటోరియంతోపాటు నాలుగేళ్ల కాల పరిమితి విధించారు. భారత్‌ను సందర్శించే విదేశీ పర్యాటకులకు భరోసా కల్పించేలా డిజిటల్, టీవీల్లో పర్యాటక శాఖ విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించ నుంది. పర్యాటకుల భద్రత, ఎయిర్‌పోర్టులు, పర్యాటక ప్రాంతాలను అనుసంధానించే రోడ్డు సదుపాయాలపై ప్రచారం చేపట్టనుంది. స్థానిక భాషలు తెలిసిన వారికి పర్యాటకం ద్వారా ఉపాధి కల్పించేలా ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిస్ట్ ఫెసిలిటేటర్ సర్టిఫికెట్ కోర్సుల ద్వారా అవకాశం కల్పిస్తోంది. కోవిడ్ టీకా ఆవిష్కరణ ప్రయత్నాలు ఫలిస్తుండటంతో 2021లో పర్యాటక రంగం కోలుకుని గాడిన పడుతుందని పర్యాటక శాఖ ఆశాజనకంగా ఉంది. -జి. కమల వర్ధన రావు వ్యాసకర్త ఐఏఎస్, చైర్మన్ అండ్ ఎండీ, ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ -
333 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్ మంగళవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 333 పాయింట్లు పెరిగి 30363 వద్ద, నిఫ్టీ 102 పాయింట్లు లాభంతో 8925 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమెరికా ఫార్మా కంపెనీ మెడెర్నా ఇంక్ తయారీ చేసిన కోవిద్-19 వ్యాక్సిన్ ట్రయల్‌లో మంచి ఫలితాలను కనబర్చినట్లు ప్రకటించింది. వాక్సిన్స్పై ఆశలతో అంతర్జాతీయ మార్కెట్లలో సెంటిమెంట్ బలపడింది. ఫలితంగా నిన్నరాత్రి అమెరికా ప్రధాన సూచీలైన డోజోన్స్ 3.85శాతం, నాస్డాక్ 2.50శాతం, ఎస్అండ్పీ 3శాతం లాభంతో ముగిశాయి. దీంతో ఆసియాలో ప్రధాన మార్కెట్లన్నీ లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్, చైనా, హాంగ్‌కాంగ్‌తో దేశాలకు చెందిన షేర్లు 2శాతం లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ పరిణామాల విషయానికొస్తే... కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. ఆంక్షలతో కూడిన లాక్డౌన్ పొడగింపు(మే 31వరకు) సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. నేడు మొత్తం కేసుల సంఖ్య లక్షను దాటినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. సుమారు 3156 మంది మృత్యువాత పడ్డారు. నేడు బజాజ్ ఫైనాన్స్, అపోలో టైర్స్, ఉజ్జీవన్ ఫైనాన్స్‌తో పాటు సుమారు 18 కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తాయి. ఇవన్నీ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపే అంశాలు. ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్ 331 పాయింట్ల లాభంతో 30360 వద్ద నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 8914.65 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఒక్క ఐటీ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిన్నటి మార్కెట్లో భారీ పతనాన్ని చవిచూసిన ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగ షేర్లకు నేడు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 1.60శాతం లాభపడి 17,854.80 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎంఅండ్ఎం, యూపీఎల్, సిప్లా, టీసీఎస్, విప్రో షేర్లు అరశాతం నుంచి 1.50శాతం నష్టపోయాయి. టాటామోటర్స్, జీ లిమిటెడ్, ఓఎన్జీసీ, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ షేర్లు 3శాతం నుంచి 4.50శాతం లాభపడ్డాయి. -
పాక్ వెళ్లగొట్టేలా భారత్ సూపర్ ప్లాన్
సాక్షి, న్యూఢిల్లీ : ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే తలదాచుకున్నట్లు మరోసారి రుజువైంది. ఇంటెలిజెన్స్ బ్యూరో తాజా విచారణలో ఈ విషయం వెల్లడయ్యింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం కుదుటపడటంతో తిరిగి అసాంఘిక కార్యకలాపాలకు దిగినట్లు ఓ ఐబీ అధికారి తెలిపారు. అతని ప్రాణాలకు ముప్పువాటిల్లుతుందన్న ఉద్దేశంతో పాకిస్థాన్ గూఢాచారి సంస్థ ఐఎస్ఐ అతన్ని గత మూడు నెలల్లో నాలుగైదు ప్రాంతాలకు మార్చిందంట. ప్రస్తుతం కరాచీ నుంచే కార్యకలాపాలను మొదలుపెట్టిన దావూద్ దుబాయ్‌లో ఉన్న ఓ వ్యక్తితో సంభాషిస్తుండగా ఆడియోలను రికార్డు చేసిందని ఆయన చెబుతున్నారు. ఈ మేరకు యూఏఈ ప్రభుత్వంతో ఐబీ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్-భారత్ మధ్య డ్రగ్స్ వ్యవహారంతోపాటు, ముంబైలో లావాదేవీలు చూసుకుంటున్నాడంట. దీంతో ఎలాగైనా అతన్ని బయటకు రప్పించే ఉద్దేశ్యంతో ఉన్న భారత్ ప్లాన్ బీ ని అమలు చేయబోతుంది. దాని ప్రకారం అతని వ్యాపారాలను లక్ష్యంగా నాశనం చేయబోతుందంట. తద్వారా ఆర్థికంగా దావూద్‌ను దెబ్బతీయటం.. ఆ దెబ్బకు పాక్ కూడా అతనికి సహకరించటం ఆపేస్తుందని భారత్ భావిస్తోంది. -
స్టాక్ మార్కెట్లకు సెలవు
ముంబై : స్టాక్ మార్కెట్లు నేడు సెలవును పాటిస్తున్నాయి. గుడ్ ప్రైడే, అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్లు ట్రేడింగ్ ను జరుపడం లేదు. కాగ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ గురువారం ప్రకటించిన క్యూ4 ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో నిన్న మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,200 పాయింట్ల దిగువకు పతనమైంది. మొత్తం మీద సెన్సెక్స్ 182 పాయింట్లు నష్టపోయి 29,461 పాయింట్ల వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 9,151 పాయింట్ల వద్ద సెటిలయ్యాయి. శుక్రవారం సెలవుతో పాటు, శని, ఆదివారాలు కూడా మార్కెట్లు ట్రేడింగ్ ఉండకపోవడంతో దేశీయ ఈక్విటీ సూచీలకు మూడు రోజులు సెలవులు కలిసి వచ్చాయి. మరోవైపు దేశీయ మార్కెట్లతో పాటు అమెరికా ఫైనాన్సియల్ మార్కెట్లు గుడ్ ప్రైడే సందర్భంగా నేడు సెలవును పాటించనున్నాయి. మేజర్ ఆసియన్ మార్కెట్లు కూడా గుడ్ ప్రైడే, ఈస్టర్ మండే కారణంగా ఈ రోజుల్లో ట్రేడ్ హాలిడేను ప్రకటించాయి. అమెరికా కమోడిటీస్ మార్కెట్లు అంటే గోల్డ్, క్రూడ్-ఆయిల్ ఫ్యూచర్స్ నేడు ట్రేడింగ్ జరుపవు.