సాక్షి, న్యూఢిల్లీ : ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే తలదాచుకున్నట్లు మరోసారి రుజువైంది. ఇంటెలిజెన్స్ బ్యూరో తాజా విచారణలో ఈ విషయం వెల్లడయ్యింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం కుదుటపడటంతో తిరిగి అసాంఘిక కార్యకలాపాలకు దిగినట్లు ఓ ఐబీ అధికారి తెలిపారు.
అతని ప్రాణాలకు ముప్పువాటిల్లుతుందన్న ఉద్దేశంతో పాకిస్థాన్ గూఢాచారి సంస్థ ఐఎస్‌ఐ అతన్ని గత మూడు నెలల్లో నాలుగైదు ప్రాంతాలకు మార్చిందంట. ప్రస్తుతం కరాచీ నుంచే కార్యకలాపాలను మొదలుపెట్టిన దావూద్ దుబాయ్‌లో ఉన్న ఓ వ్యక్తితో సంభాషిస్తుండగా ఆడియోలను రికార్డు చేసిందని ఆయన చెబుతున్నారు. ఈ మేరకు యూఏఈ ప్రభుత్వంతో ఐబీ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారని తెలిపారు.
ఆఫ్ఘనిస్థాన్-భారత్ మధ్య డ్రగ్స్ వ్యవహారంతోపాటు, ముంబైలో లావాదేవీలు చూసుకుంటున్నాడంట. దీంతో ఎలాగైనా అతన్ని బయటకు రప్పించే ఉద్దేశ్యంతో ఉన్న భారత్ ప్లాన్ బీ ని అమలు చేయబోతుంది. దాని ప్రకారం అతని వ్యాపారాలను లక్ష్యంగా నాశనం చేయబోతుందంట. తద్వారా ఆర్థికంగా దావూద్‌ను దెబ్బతీయటం.. ఆ దెబ్బకు పాక్ కూడా అతనికి సహకరించటం ఆపేస్తుందని భారత్ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment