నిమిషానికి రూ.కోటి రెమ్యునరేషన్‌.. నటి రియాక్షన్ అదిరిపోయింది! | Urvashi Rautela Talked About Being The Highest-Paid Actress In The Country; Video Viral - Sakshi
Sakshi News home page

దేశంలోనే అత్యధిక పారితోషికం.. తనదైన శైలిలో స్పందించిన నటి!

Published Wed, Aug 30 2023 7:20 PM | Last Updated on Wed, Aug 30 2023 8:09 PM

Urvashi Rautela talked about being the highest paid actress in the country - Sakshi

బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా పరిచయం అక్కర్లేని పేరు. బాస్ పార్టీ అంటూ మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత అఖిల్ నటించిన ఏజెంట్‌ చిత్రంలోనూ ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది.  ఇటీవలే ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఈఫిట్ టవర్‌ను వన్డే వరల్డ్‌ కప్‌ను ఆవిష్కరించిన ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇలాంటి ‍అరుదైన అవకాశం దక్కించుకున్న ఏకైక నటిగా స్థానం దక్కించుకుంది. అయితే తాజాగా ఒక్క నిమిషానికి రూ. కోటి రూపాయల రెమ్యునరేషన్‌ వసూలు చేస్తోందని గత కొద్ది రోజులుగా ఆమెపై రూమర్స్ వస్తున్నాయి. అంతే కాదు ఆమెపై నెటిజన్స్ సైతం ట్రోల్స్ కూడా చేశారు. 

(ఇది చదవండి: స్టార్ హీరో కేసులో హైకోర్టు కీలక తీర్పు.. ఆ డబ్బు!)

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన ఊర్వశికి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. మీరు ఒక నిమిషానికి రూ. కోటి రూపాయలు వసూలు చేస్తున్నారు? దీనిపై మీరేమంటారని ప్రశ్నించారు.  దీనికి బదులిస్తూ.. నాలాంటి సెల్ఫ్ మేడ్ నటులు ఎవరైనా సరే ఇలాంటి విజయాలు సాధించాలని కోరుకుంటున్నా అంటూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో చాలాసార్లు ఇందతా అబద్ధమంటూ నెటిజన్స్‌ ఆమెపై ట్రోల్స్ చేశారు.  

ఊర్వశి రౌతేలా సాబ్ ది గ్రేట్‌ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె సన్నీ డియోల్ సరసన నటించింది. ఆ తర్వాత సనమ్ రే, హేట్ స్టోరీ- 4, పాగల్‌పంటి వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం వినీత్ కుమార్ సింగ్, అక్షయ్ ఒబెరాయ్‌లతో కలిసి దిల్ హై గ్రేలో నటించనుంది. అలాగే మరో  తెలుగు సినిమాలో కూడా కనిపించనుంది. 

(ఇది చదవండి: కేవలం రూ.7 కోట్ల సినిమా.. బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది!)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement