అతను ఐఐఎం, ఐఐటీలు వంటవి ఏం చెయ్యలేదు. కానీ వేతనంగా ఏకంగా కోటి రూపాయల వార్షిక ప్యాకేజిని అందుకుంటున్నాడు. మరీ అంత వేతనం ఎలా? అని అనుకుంటున్నారా!.. పనిచేసే అంకితభావం, మంచి నైపుణ్యం ఉంటే పెద్ద పెద్ద డిగ్రీలు చేయాల్సిన పని లేదు అని నిరూపించాడు ఈ భారతీయ విద్యార్థి.
వివరాల్లోకెళ్తే..భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండే బార్మర్ అనే చిన్న జిల్లాలో నివసించే మహిపాల్ సేజు అనే భారత విద్యార్థి ఓ జపాన్ కంపెనీ నుంచి కోటి రూపాయల వార్షిక ప్యాకేజీని అందుకుని రికార్డు సృష్టించాడు. అయితే అతను ఏమి ఐఐఎం, ఐఐటీ స్టూడెంట్ కాదు. అందరిలానే బీటెక్ డిగ్రీ పూర్తి చేసి ఇంత పెద్ద మొత్తంలో వేతనం అందుకుని ఆశ్చర్యపరిచాడు. కేవలం పట్టదల, అంకితభావం, మంచి నైపుణ్యం ఉంటే.. పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వారితో సమానంగా వేతనం తీసుకోవచ్చని ప్రూవ్ చేశాడు.
మహిపాల్ జోథ్‌పూర్‌లోని బార్మర్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఢిల్లీలో బీటెక్ పూర్తిచేశాడు. అయితే బీటెక్ చదువుతుండగానే 2019లో ఓ ప్లేస్‌మెంట్ ఏజెన్సీ ద్వారా జపాన్‌లో నగోయాలోని ఒక కంపెనీలో రూ. 30 లక్షల ప్యాకేజీతో మొదటి ఉద్యోగాన్ని సంపాదించాడు. మళ్లీ మూడేళ్ల తర్వాత జపాన్‌లోని టోక్యోలో మరో కంపెనీతో ఏకంగా రూ. 1 కోటి వార్షిక ప్యాకేజ్ ఆఫర్ అందుకుని రికార్డు సృష్టించాడు.
మహిపాల్ ప్రస్తుతం జపాన్‌లోని టోక్యోలో మెకానికా కార్పొరేషన్ అనే కంపెనీకి ఐటీ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. పెద్ద పెద చదువులు చదవలేదని బాధపడాల్సిన పనిలేదు ప్రస్తుత పరిస్థితులకు అవసరమయ్యే స్కిల్స్ సంపాదించుకుంటే పెద్ద మొత్తంలో వేతనాలు అందుకోవచ్చని మహిపాల్ చేసి చూపించాడు. నిజం చెప్పాలంటే ఫోకస్ కరెక్ట్‌గా ఉండి, పనిపై అంకితా భావం ఉంటే ఏ నేపథ్యం నుంచి వచ్చినా కోట్లలో వేతనం అందుకోగలమని చాటి చెప్పాడు, పైగా అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు మహిపాల్ సేజు.
(చదవండి: ఇందిరా గాంధీ బ్రేక్ ఫాస్ట్‌గా కోసం ఓ చెఫ్ పడ్డ పాట్లు! కానీ చివరికి..)
Comments
Please login to add a commentAdd a comment