
:మాట్లాడుతున్న కలెక్టర్ లోకేష్‌కుమార్,ఎస్పీ షానవాజ్‌ఖాసీం , జేసీ దివ్య
- వీసీలో జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్
ఖమ్మం జెడ్పీసెంటర్:
హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1.14 కోట్ల మొక్కలు నాటామని కలెక్టర్ లోకేష్‌కుమార్ తెలిపారు. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ‘హరితహారం’ పథకం అమలుపై జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏయే ప్రభుత్వశాఖ ఎన్ని మొక్కలు వేయాలో ముందుగానే నిర్దేశించామని తెలిపారు. లక్ష్యాన్ని సాధించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్‌అండ్‌బీ రహదారులకు ఇరువైపులా క్రమపద్ధతిలో మొక్కలు నాటేలా సోషల్ ఫారెస్ట్ అధికారులకు బాధ్యత ఇచ్చామన్నారు. జిల్లాలో అదనంగా 3.50 లక్షల మామిడి మొక్కలు అవసరం ఉన్నాయన్నారు. ఈ మేరకు సీఎస్ మామిడి మొక్కలను సరఫరా చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. 22వ తేదీన బండ్ ప్లాంటేషన్ నిర్వహిస్తామన్నారు. పోలీసుశాఖ ద్వారా 3 లక్షల మొక్కలు నాటాలని ప్రణాళికలు రూపొందించామని ఎస్పీ షానవాజ్‌ఖాసీం తెలిపారు. నిర్దేశించిన లక్ష్యానికి మించి 2 లక్షల మొక్కలు అదనంగా నాటేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా హోంగార్డు నుంచి ఇతర అధికారుల వరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఈ వీసీలో హరితహారం ప్రత్యేక అధికారి రఘువీర్, జేసీ దివ్య, అటవీశాఖ అధికారి నర్సయ్య, సీఈఓ నాగేశ్ పాల్గొన్నారు.