మనం పిల్లిని పొద్దుపొద్దున్నే చూసేందుకు కూడా ఇష్టపడం. కానీ విదేశీయులకు అవంటే వారికి అమితమైన ప్రేమ. వాటి కోసం కోట్ల కోట్ల ఆస్తులు కూడా రాస్తారు. అచ్చం అలానే ఒక మహిళ తను పెంచుకుంటున్న ఏడు పిల్లులకు ఓ రేంజ్‌లో ఆస్తి అప్పజెప్పింది. అవి చనిపోయేంత వరకు చూసుకునేలా కొన్ని షరతులు కూడా విధించింది. ఈ విచిత్ర ఘటన యూఎస్‌లోని ఫోరిడాలో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..ఫ్లోరిడాలోని టంపాకు చెందిన నాన్సీ సాయర్ ఏడు పిల్లులను ఎంతో ప్రేమగా పెంచుకుంటోంది. ఐతే ఆమె 84 ఏళ్ల వయసులో మరణించింది. చనిపోతూ తాను పెంచుకుంటున ఏడు పర్షియన్ పిల్లులకు సుమారు రూ. 2.4 కోట్ల ఆస్తిని రాసింది. అవి చనిపోయేంత వరకు తన ఇంట్లోనే నివశించేలా రూ. 2.4 కోట్ల విలువ చేసే తన ఎస్టేట్‌ని వాటి పేర రాసింది. వాటిని పర్యవేక్షించే సంరక్షకులు సరిగా విధులు నిర్వర్తించలేకపోవడంతో వాటిని చూసుకునేందుకు సిల్క్ హ్యూమన్ సోసైటీ ఆఫ్ టంపా బే ముందుకు వచ్చింది.
ఆ పిల్లుల పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. అవి వరుసగా మిడ్‌నైట్, స్నోబాల్, గోల్డ్ ఫింగర్, లియో, స్క్వీకీ, క్లియోపాత్రా,నెపోలియన్ అనే పిల్లులు. ఈ మేరకు హ్యుమన్ పొసైటీ ఆఫ్ టంపా బే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షెర్రీ సిల్క్ మాట్లాడుతూ..సాయర్ వాటి సంరక్షణ కోంస కోట్ల విలువ చేసే ఎస్టేట్‌ను రాసిచ్చారు. వాటి బాగోగులను ప్రస్తుతం తాము చూసుకుంటున్నామని. ప్రస్తుతం ఈ పిల్లులను మేం దత్తత తీసుకుంటాం అంటూ తమ సోసైటీకి దరఖాస్తులు వెల్లువలా వస్తున్నట్లు తెలిపారు. ఈ పిల్లుల దత్తత కోర్టు పర్యవేక్షణలో జరుగుతాయని. వాటి సంరక్షణకు సంబంధించిన నివేదికి ప్రతి రెండు నెలలకోసారి కోర్టుకి సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఈ పిల్లులను ఆయా వ్యక్తులకు అందిస్తామని చెప్పారు.
(చదవండి: ఎవ్వరూ మాట్లాడని కేరళ కథ! యావత్ సమాజం సేవ చేసేలా..!)
Comments
Please login to add a commentAdd a comment