estate
-
టీ తోట నుంచి చైతన్యం
పోష్ (ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సెక్సువల్ హెరాస్మెంట్) యాక్ట్ 2013 ప్రకారం వ్యవస్థీకృతమైన రంగాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపులను నివారించడానికి ఇంటర్నల్ సెల్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. కానీ అసంఘటిత రంగాల్లో పని చేసే మహిళలకు ఇలాంటి ఒక చట్టం ఉందనే సంగతి కూడా తెలియదు. ఇలాంటి స్థితిలో అస్సాంలోని టీ తోటల్లో పని చేసే మహిళలు సంఘటితమై తమ హక్కును కాపాడుకోవడానికి ఉద్యమించారు. ఒకరికొకరు అండగా మనదేశంలో వ్యవసాయరంగం తర్వాత మహిళలు అతిపెద్ద సంఖ్యలో పని చేస్తున్నది టీ తోటల్లోనే. ఈ తోటల్లో పని చేసే కార్మికుల్లో ఎనభైశాతం మహిళలే. అస్సాం, వెస్ట్‌బెంగాల్, కేరళ, తమిళనాడులన్నీ కలిపి దేశంలో 350కి పైగా టీ తోటలున్నాయి. దాదాపుగా ఒక్కో తోటలో వెయ్యికి పైగా మహిళలు పనిచేస్తుంటారు. దేశవ్యాప్తంగా మూడు లక్షల అరవైవేలకు పైగా మహిళలు టీ తోటల్లో పని చేస్తున్నారు. ఈ మహిళల పరిస్థితి ఒకప్పుడు అత్యంత దయనీయంగా ఉండేది. వాళ్ల మాటకు ఇంట్లో విలువ ఉండేది కాదు, పని చేసే చోట లైంగిక వేధింపులు, వివక్ష తప్పేది కాదు. ఒకరి కష్టాన్ని మరొకరికి చెప్పుకుని ఓదార్పు పొందడమే తప్ప, ఆ కష్టాల నుంచి బయటపడవచ్చని తెలియని రోజులవి. ఒకసారి తెలిసిన తరవాత ఇక వాళ్లు ఆలస్యం చేయలేదు. ఉమెన్స్ సేఫ్టీ యాక్సెలరేటర్ ఫండ్ (డబ్లు్యఎస్ఏఎఫ్) స్వచ్ఛంద సంస్థ అండతో ముందుకురికారు. అస్సాం నుంచి కేరళ వరకు తమకు భద్రత కల్పించడానికి పోష్ అనే చట్టం ఉందని తెలిసిన తర్వాత ఆ చట్టం ద్వారా ఎన్ని రకాలుగా రక్షణకవచంగా ఉపయోగించుకోవచ్చనే వివరాలు కూడా తెలుసుకున్నారు. ‘సమాజ్’ పేరుతో వాళ్లలో వాళ్లు కమిటీలుగా ఏర్పడ్డారు. బృందంగా వెళ్లి ప్రభుత్వ అధికారులను కలుస్తూ... ప్రతి తోటలో ఇంటర్నల్ సెల్ ఏర్పాటయ్యే వరకు తమ ఉద్యమాన్ని ఆపలేదు. లైంగిక వేధింపులకు గురయినప్పుడు ఎలా ప్రతిఘటించాలో, ఎలాంటి ఆధారాలతో ఇంటర్నల్ సెల్‌కు ఎలా తెలియచేయాలో కళ్లకు కడుతూ చిన్నచిన్న నాటికలు ప్రదర్శించారు. అస్సాం, బెంగాల్ నుంచి కొంతమంది చురుకైన మహిళలు కేరళ, తమిళనాడులకు వచ్చి ఇక్కడి వారిని చైతన్యవంతం చేసే పని మొదలుపెట్టారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ చాలు! పోష్ చట్టం ప్రకారం సెక్సువల్ హెరాస్మెంట్ రిడ్రసల్ కమిటీలు భవన నిర్మాణ రంగంలో కూడా ఉండాలి. అయితే టీ తోటల్లో మహిళల్లాగ భవన నిర్మాణంలో పని చేసే మహిళలు సంఘటితం అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఎక్కువ కాలం ఒకే చోట నివసిస్తున్న వాళ్లు మాత్రమే వేధింపులకు గురవుతున్న విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకోగలుగుతారు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని కలిసికట్టుగా పోరాటానికి సిద్ధమవుతారు. టీ తోటల్లో పని చేసే వాళ్లు సుదీర్ఘకాలం ఒకే చోట నివసిస్తూ, అదే తోటల్లో కలిసి పనిచేస్తూ ఉంటారు. భవన నిర్మాణ కార్మికులు అలా కాదు. ఒక భవనం పూర్తి కాగానే మరోభవనం కోసం వెళ్లిపోతుంటారు. తమ సమస్యకు పరిష్కారం కోసం సంఘటితం కాగలిగినంత సమయం కూడా ఒకేచోట ఉండరు. కాబట్టి పని చేసే ప్రదేశంలో కంప్లయింట్ ఇవ్వాల్సిన వివరాలతోపాటు ఫోన్ నంబరు రాయడమే వారిలో చైతన్యాన్ని కలిగిస్తుంది. అలాగే రైతుబజార్లు, కూరగాయల మార్కెట్లలో కూడా మహిళలు ఎక్కువగా ఉంటారు. అధికారులు సమావేశం ఏర్పాటు చేసి లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు కంప్లయింట్ ఇవ్వవచ్చని తెలియచేయాలి. కంప్లయింట్ విభాగానికి చెందిన ఫోన్ నంబర్‌ను ఆ మార్కెట్లో కూరగాయల ధరల పట్టిక కనిపించినట్లు బాగా కనిపించేటట్లు రాయాలని సూచించారు మహిళల హక్కుల యాక్టివిస్టు కొండవీటి సత్యవతి. ఒక నోడల్ పాయింట్ లైంగిక వివక్ష, వేధింపు, హింస, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, ప్రసవ సమయంలో మరణాలు దేశంలో అస్సాం మొదటిస్థానంలో ఉంటుంది. అస్సాం, బెంగాల్లో మహిళల కోసం ప్రాతినిధ్యం వహించేవాళ్లు లేరు. టీ ఎస్టేట్లలో పనిచేసే బాలికలు, మహిళల భద్రత, హింస నిరోధం కోసం ఏర్పడిన కన్షార్షియం డబ్లు్యఎస్ఏఎఫ్... మహిళలను చైతన్యవంతం చేయడంతోపాటు లీగల్ సర్వీసెస్ అథారిటీ, హెల్త్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు, పోలీస్, గ్రామీణ ఉపాధి కార్యక్రమాలన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకువచ్చింది. ఆ ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. అస్సాం టీ తోటల్లో పని చేసే మహిళలు దేశానికి దిక్సూచి అయ్యారు. – వాకా మంజులారెడ్డి చట్టం... కమిటీలే కాదు... ప్రభుత్వం ఇంకా చేయాలి! వ్యవస్థీకృత రంగంలో పనిచేసే మహిళల కోసం ఇంటర్నల్ కమిటీలున్నట్లే అసంఘటితరంగంలో కూడా కమిటీలుండాలి. ఇళ్లలో పని చేయడం, వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పండ్లు అమ్ముకోవడం వంటి ఇతర పనుల్లో ఉండే మహిళల కోసం లోకల్ కంప్లయింట్స్ కమిటీలుండాలి. కమిటీలు వేయడంతో సమస్య పరిష్కారం కాదు. ఇలాంటి కమిటీలున్నాయనే విషయం మహిళలకు తెలియాలి. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ఆయా కమిటీలకు కంప్లయింట్ ఎలా ఇవ్వాలో తెలియచేయాలి. ఫోన్ నంబర్ లేదా హెల్ప్‌లైన్ నంబర్లను పని ప్రదేశంలోనూ ఇతర కమ్యూనిటీ సెంటర్లలోనూ బాగా కనిపించేటట్లు బోర్డు మీద రాయాలి. అందుకు ప్రభుత్వమే పూనుకోవాలి. చట్టం చేసి తన బాధ్యత అయిపోయిందనుకుంటే సరిపోదు. చట్టాన్ని అమలు చేయడం, అమలయ్యే పరిస్థితులు కల్పించడం, చట్టం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, తమ హక్కుల ఉల్లంఘన కలిగినప్పుడు గళమెత్తగలిగేటట్లు భరోసా కల్పించడం కూడా ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యతలే. – కొండవీటి సత్యవతి,భూమిక ఉమెన్స్ కలెక్టివ్, మెంబర్, లోకల్ కంప్లయింట్ కమిటీ, రంగారెడ్డి జిల్లా -
మాములు 'పిల్లులు' కావు! తీసుకునేందుకు ఎగబడుతున్న జనం!
మనం పిల్లిని పొద్దుపొద్దున్నే చూసేందుకు కూడా ఇష్టపడం. కానీ విదేశీయులకు అవంటే వారికి అమితమైన ప్రేమ. వాటి కోసం కోట్ల కోట్ల ఆస్తులు కూడా రాస్తారు. అచ్చం అలానే ఒక మహిళ తను పెంచుకుంటున్న ఏడు పిల్లులకు ఓ రేంజ్లో ఆస్తి అప్పజెప్పింది. అవి చనిపోయేంత వరకు చూసుకునేలా కొన్ని షరతులు కూడా విధించింది. ఈ విచిత్ర ఘటన యూఎస్‌లోని ఫోరిడాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఫ్లోరిడాలోని టంపాకు చెందిన నాన్సీ సాయర్ ఏడు పిల్లులను ఎంతో ప్రేమగా పెంచుకుంటోంది. ఐతే ఆమె 84 ఏళ్ల వయసులో మరణించింది. చనిపోతూ తాను పెంచుకుంటున ఏడు పర్షియన్ పిల్లులకు సుమారు రూ. 2.4 కోట్ల ఆస్తిని రాసింది. అవి చనిపోయేంత వరకు తన ఇంట్లోనే నివశించేలా రూ. 2.4 కోట్ల విలువ చేసే తన ఎస్టేట్ని వాటి పేర రాసింది. వాటిని పర్యవేక్షించే సంరక్షకులు సరిగా విధులు నిర్వర్తించలేకపోవడంతో వాటిని చూసుకునేందుకు సిల్క్ హ్యూమన్ సోసైటీ ఆఫ్ టంపా బే ముందుకు వచ్చింది. ఆ పిల్లుల పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. అవి వరుసగా మిడ్నైట్, స్నోబాల్, గోల్డ్ ఫింగర్, లియో, స్క్వీకీ, క్లియోపాత్రా,నెపోలియన్ అనే పిల్లులు. ఈ మేరకు హ్యుమన్ పొసైటీ ఆఫ్ టంపా బే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షెర్రీ సిల్క్ మాట్లాడుతూ..సాయర్ వాటి సంరక్షణ కోంస కోట్ల విలువ చేసే ఎస్టేట్‌ను రాసిచ్చారు. వాటి బాగోగులను ప్రస్తుతం తాము చూసుకుంటున్నామని. ప్రస్తుతం ఈ పిల్లులను మేం దత్తత తీసుకుంటాం అంటూ తమ సోసైటీకి దరఖాస్తులు వెల్లువలా వస్తున్నట్లు తెలిపారు. ఈ పిల్లుల దత్తత కోర్టు పర్యవేక్షణలో జరుగుతాయని. వాటి సంరక్షణకు సంబంధించిన నివేదికి ప్రతి రెండు నెలలకోసారి కోర్టుకి సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఈ పిల్లులను ఆయా వ్యక్తులకు అందిస్తామని చెప్పారు. (చదవండి: ఎవ్వరూ మాట్లాడని కేరళ కథ! యావత్ సమాజం సేవ చేసేలా..!) -
మహిళా.. ఇక భయమేల! నీ ఆలోచన ఇలా అమలు చేసేయ్..
మహిళలకు జీవనకాలం పెరిగింది. సంరక్షణ బాధ్యతలు దీర్ఘకాలం పాటు నిర్వహించాల్సి వస్తోంది. ఒంటరి మహిళలు లేదా వితంతువులకూ బాధ్యతలు ఉంటాయి. ఉన్నట్టుండి అమ్మకు ఏదైనా జరగరానిది జరిగితే, ఆమె ఆకాంక్షల మేరకు పిల్లలకు ఆస్తుల బదిలీ ఎలా..? పిల్లల సంరక్షణ ఎలా..? తాను జీవించి ఉండగానే తీవ్ర అనారోగ్యం బారిన పడితే ఆమె సంరక్షణ ఎవరు చూడాలి..? ఆమె తరఫున ఎవరు నిర్ణయాలు తీసుకోవాలి..? ఇక్కడే ఎస్టేట్ ప్లానింగ్ కీలకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మహిళలు కోరుకున్నట్టు, వారి ఇష్టం మేరకు, ఆకాంక్షల మేరకు ఆస్తుల బదిలీ సహా ఎన్నో అంశాలకు చట్టబద్ధమైన రక్షణతో ఎస్టేట్ ప్లానింగ్ హామీ ఇస్తుంది. ఈ ఎస్టేట్ ప్లానింగ్ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుందన్నది? ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. ఎస్టేట్ ప్లానింగ్ డాక్యుమెంట్లో ఆస్తులు, అప్పులు ఇలా సమగ్ర వివరాలు ఉంటాయి. స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, పీపీఎఫ్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇలా సమగ్ర ఆస్తులు, బాధ్యతలు (చెల్లించాల్సిన రుణాలు) అన్నీ వస్తాయి. వారసుల మధ్య వివాదాలను ఇది నివారిస్తుంది. మహిళ కోరినట్టుగా ఆస్తుల పంపిణీ, పన్ను చెల్లింపులతోపాటు, అప్పులను కూడా తీరుస్తుంది. పిల్లలకు అంతగా సామర్థ్యాలు లేవని భావించినప్పుడు, అవసరమైన సందర్భాల్లో ఆర్ధిక, వైద్య అవసరాలను చూసేందుకు నమ్మకమైన ఒక వ్యక్తిని కూడా నియమించుకోవచ్చు. ఎస్టేట్ ప్లానింగ్ మహిళలను ఆర్థికంగానే కాకుండా బాధ్యతల పరంగా స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. తమకు ప్రియమైన వారు ఇబ్బంది పడకుండా దీర్ఘకాలం పాటు సంరక్షణ బాధ్యతలను కోరిన విధంగా నిర్వహిస్తుంది. మహిళలకు తమ పిల్లల సంరక్షణకు సంబంధించి ప్రత్యేకమైన లక్ష్యాలతోపాటు.. ఆందోళన కూడా ఉంటుంది. పిల్లల ఎదుగుదలలో వారు ఎంతో కీలక పాత్ర పోషిస్తారు. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి వారి మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. పిల్లల భవిష్యత్తు ప్రాధాన్యతలను నిర్ణయించే అమ్మలూ ఉన్నారు. ఒకవేళ తాము అకాల మరణానికి గురైతే పిల్లలు ఆర్థికంగా భద్రంగా ఉండేలా ఎస్టేట్ ప్లానింగ్ భరోసానిస్తుంది. ఒంటరి మహిళ లేదా వితంతు మహిళ వీలునామాలో గార్డియన్ పేరు రాస్తే సరిపోతుంది. అదే ఎస్టేట్ ప్లాన్ అయితే అర్హత లేని వ్యక్తి సంరక్షకుడిగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆకాంక్షలు నెరవేరేందుకు.. మహిళలు తమ పేరిట ఉన్న ఆస్తులను కాపాడుకునేందుకు, వాటి సక్రమ బదిలీకి, సరైన వారసులకు తాము కోరుకున్నట్టుగా బదిలీ చేసుకునేందుకు ఎస్టేట్ ప్లాన్ వీలు కల్పిస్తుంది. వారసులు తేల్చుకోలేకపోతే ఆస్తులపై ప్రయోజనం ఎవరు పొందాలో కూడా ఓ పట్టాన తేలదు. దీంతో కోర్టు కేసులు, ఎన్నో ఏళ్ల కాల హరణం, విపరీతమైన ఖర్చులకు దారితీస్తుంది. మన దేశంలో వారసత్వ చట్టాలు పురుషులకే మొగ్గు చూపిస్తున్నాయి. మరణించిన మహిళ ఆస్తులు ఆమె భర్త తరఫు వారికే వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఎస్టేట్ ప్లానింగ్ ఎంతో అవసరం. ఇది లేకపోతే ఆమె ఆకాంక్షలకు భిన్నంగా ఆస్తుల పంపకాలు జరగొచ్చు. అందుకని వివాహిత మహిళలు అయినా, వితంతువులు అయినా, పెళ్లి కాని మహిళలు అయినా అందరికీ ఎస్టేట్ ప్లానింగ్ అవసరం. అప్పుడే వారు కోరుకున్నట్టుగా, కోరుకున్న వారికి ఆస్తులు బదిలీ అవుతాయి. వీలునామా - ఎస్టేట్ ప్లానింగ్ ఎస్టేట్ ప్లానింగ్ అంటే వీలునామా అనుకునేరు. వీలునామా, ఎస్టేట్ ప్లానింగ్ వేర్వేరు. అలాగే, ఎస్టేట్ ప్లానింగ్ అంటే ధనవంతులకు, వీలునామా (విల్లు) సామాన్యులకు అనుకునేవారూ ఉన్నారు. కానీ, ఇవి ఫలానా వారికే అని ఏమీ లేదు. వీటి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. ఎస్టేట్ అంటే.. ఒక వ్యక్తికి సంబంధించి అన్ని ఆస్తులు, అప్పులు. ఆస్తులు అంటే బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, షేర్లు, బీమా పాలసీలు, పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, కాపీ రైట్లు, రియల్ ఎస్టేట్, ఆర్ట్‌లు, కళాఖండాలు, వాహనాలు, ఆభరణాలు ఇలా విలువైనవన్నీ వస్తాయి. బాధ్యతలు అంటే వ్యక్తిగత రుణాలు, మార్ట్గేజ్ రుణాలు, క్రెడిట్ కార్డులు, పన్నులు వస్తాయి. ఉదాహరణకు.. ఏ అనే వ్యక్తికి కొన్ని పెట్టుబడులు, రూ.కోటి విలువైన ప్రాపర్టీ ఉంది. అలాగే, బీ అనే వ్యక్తి పేరిట ఆరి్థక పెట్టుబడులు, పలు చోట్ల ప్రాపర్టీలు, వ్యాపారాల్లో వాటాలు మొత్తం మీద రూ.500 కోట్ల విలువ చేసేవి ఉన్నాయి. ఇక్కడ ఏ, బీ ఇద్దరికీ ఎస్టేట్ ప్లానింగ్ ఉపయోగపడుతుంది. ఎస్టేట్ ప్లానింగ్ అనేది రాసిన వ్యక్తి మరణం తర్వాత వారి పేరిట ఉన్న సంపదను బదిలీ చేయడానికే పరిమితం కాదు. జీవించిన ఉన్న సమయంలోనూ వాటిని రక్షించడం, కాపాడుకోవడం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను నిర్వహించలేని పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో కూడా ఎస్టేట్ ప్లానింగ్‌లో ఉంటుంది. విల్లు అనేది సంపదను ఎవరికి, ఎలా పంచాలో సూచించే చట్టబద్ధమైన పత్రం. మరణానంతరం కోరుకున్న విధంగా ఆస్తులను బదిలీ చేసేందుకు ఈ పత్రం ఉపయోగపడుతుంది. విల్లులోని అంశాలను అమలు చేసే బాధ్యతను ఎవరు నిర్వహించాలో కూడా సూచించొచ్చు. విల్లుతో పోలిస్తే ఎస్టేట్ ప్లానింగ్ మరింత విస్తృతంగా ఉంటుంది. విల్లు ఒక్కటే సాధనం అయితే, ఎస్టేట్ ప్లానింగ్ ఒకటికి మించిన సాధనాలతో ఉంటుంది. ఉద్దేశాలు ఊహించని రిస్క్‌లు ఎదురైతే సంపదకు రక్షణ కవచంలా ఎస్టేట్ ప్లానింగ్ సాయపడుతుంది. మైనర్లు, ప్రత్యేక అవసరాల పిల్లలు ఉంటే, ఆర్ధిక విషయాల గురించి ఏ మాత్రం అవగాహన లేని కుటుంబ సభ్యులు ఉంటే వారికి సంబంధించిన నిర్ణయాలకు ఎస్టేట్ ప్లానింగ్ హామీ ఇస్తుంది. మహిళ నిర్ణయాలు తీసుకోలేని స్థితికి వెళితే, ఆ బాధ్యతలు నిర్వహించే యంత్రాంగం ఏర్పాటు, కుటుంబ వివాదాలను పరిష్కరించే సమాచార వాహకం ఏర్పాటు ఇలా ఎన్నో అంశాలకు ఎస్టేట్ ప్లానింగ్ వేదిక కాగలదు. తీవ్ర అనారోగ్యం బారిన పడినప్పుడు, ఆసుపత్రుల్లో విషమ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆమె తరఫున ఎవరు నిర్ణయం తీసుకోవాలో ఎస్టేట్ ప్లానింగ్ స్పష్టం చేస్తుంది. ఎస్టేట్ ప్లానింగ్‌తో ఉన్న ప్రయోజనం వారసత్వ పన్ను తప్పించుకోవచ్చు. అయితే, ప్రస్తుతం మన దేశంలో వారసత్వ పన్ను లేదు. కానీ, అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో ఉంది. తాము ప్రేమించే వారు విదేశాల్లోనూ ఉండి, తమ తర్వాత వారికి కూడా ఆస్తుల బదలాయింపు కోరుకుంటే అప్పుడు ఎస్టేట్ ప్లానింగ్ మెరుగైనది. విదేశాల్లో ఆస్తులు ఉన్నవారికి కూడా ఎస్టేట్ ప్లానింగ్ అవసరం. చివరి వీలునామా, ప్రైవేటు ఫ్యామిలీ ట్రస్ట్, పవర్ ఆఫ్ అటార్నీ, గిఫ్ట్ డీడ్స్, అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్, లైఫ్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ చార్టర్లు ఎస్టేట్ ప్లానింగ్‌లో ఉంటాయి. పరిధి చాలా విస్తృతం కనుక నిపుణుల సాయంతో దీన్ని రూపొందించుకోవడం అవసరం. మహిళలకు ప్రయోజనం ఒంటరి మహిళలకు ఎస్టేట్ ప్లానింగ్ ఎంతో సాయంగా ఉంటుంది. ఎందుకంటే వారి సంరక్షణ బాధ్యతలతోపాటు, వారి తదనంతరం అన్ని అప్పులు తీర్చేసి, మిగిలిన ఆస్తులను వారు కోరిన మేరకు వారికి ఎంతో ఇష్టమైన వారికి సాఫీగా పంపిణీ అవుతాయి. రెండు రకాల ప్రయోజనాలకు ఇది భరోసా ఇస్తుంది. అందుకే ఇక్కడ మహిళలను ప్రధానాంశంగా తీసుకోవడం జరిగింది. అంతేకాదు, ఎస్టేట్ ప్లానింగ్ రూపొందించడం వల్ల మహిళలకు అన్ని అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. అన్ని ఆస్తులు, అప్పులు, అవసరాలపై స్పష్టత వస్తుంది. ఒక విధంగా అన్ని వైపులా ఆమెకు, ఆమె కుటుంబానికి రక్షణనిస్తుంది. పన్నుల భారం ఆస్తులపై పన్నుల భారాన్ని ఎస్టేట్ ప్లానింగ్ తప్పిస్తుంది. అంతేకాదు, ఒకరి మరణానంతరం ఎస్టేట్ ప్లానింగ్‌లో పేర్కొన్న మాదిరి ఆస్తులను పింపిణీ చేసుకున్నప్పుడు వాటిపై వ్యయాలు కూడా తగ్గుతాయి. ఉదాహరణకు ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఆస్తులపై పన్ను తగ్గుతుంది. విచారణ లేకుండానే (చట్టపరమైన ప్రక్రియ) లబి్ధదారులు ఆస్తులు పొందగలరు. ఎస్టేట్ ప్లానింగ్‌లో సూచనల మేరకు ఆస్తులను వేగంగా బదిలీ చేయవచ్చు. ప్రయోజనాలు.. పరిమితులు.. వ్యత్యాసాలు తమ ఆస్తులు తమ తదనంతరం ఎవరికి చెందాలో విల్లులో రాసుకోవచ్చు. విల్లు లేకుండా మరణిస్తే.. అనుభవించే హక్కులు మారొచ్చు. ఉదాహరణకు హిందూ పురుషుడు విల్లు లేకుండా మరణిస్తే అతడి పేరిట ఉన్న సంపదను అతడి తల్లి, భార్య, పిల్లలు ఇలా మూడు సమాన వాటాలుగా పొందొచ్చని చట్టం చెబుతోంది. కానీ, విల్లు రాస్తే సంబంధిత వ్యక్తి కోరుకున్న విధంగా ఆస్తుల బదిలీకి అవకాశం ఏర్పడుతుంది. విల్లు వ్యక్తి మరణానంతరమే అమల్లోకి వస్తుంది. అంతేకాదు, ఈ విల్లును వారసులు సవాల్ చేయవచ్చు. ఎస్టేట్ ప్లానింగ్ సమగ్ర రూపంతో ఉంటుంది. మరణానంతరమే కాకుండా జీవించిన కాలంలోనూ లక్ష్యాలకు రూపం ఇస్తుంది. ఎస్టేట్ ప్లానింగ్ మీ సంపదకు, మీ వారసులు లేదా మీకు ఇష్టమైన వారి ఆరి్థక భద్రతకు ఎక్కువ రక్షణనిస్తుంది. కేవలం చట్టబద్ధమైన డాక్యుమెంట్లకే పరిమితం కాకుండా, అన్ని రకాల బాధ్యతలు, సంరక్షణ, సంపద బదిలీ యంత్రాంగం ఏర్పాటు ఇందులో ఉంటాయి. కనుక విల్లుతో పోలిస్తే ఎస్టేట్ ప్లానింగ్ అదనపు ఖర్చు భరించాల్సిందే. ఎస్టేట్ ప్లానింగ్ మహిళల కోసమనే కాదు. పురుషులకూ, ఇంటి బాధ్యతలు చూసే, ఆస్తులు, బాధ్యతలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే డాక్యుమెంట్ అవుతుంది. -
శిల్ప ఎస్టేట్‌లోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం
-
ఇక్కడ పెళ్లిళ్లు వద్దే వద్దు.. ఏకమైన గ్రామస్తులు..!
వివాహాలు లేదా పలు వేడుకలను మంచి ప్రదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది సర్వ సాధారణం. ఐతే మరికొంతమంది పచ్చదనం పరుచుకున్న ప్రదేశాల్లో ఆహ్లాదంగా ఇలాంటి వేడుకులను జరుపుకునేందుకు ఇష్టపడతారు. అలానే యూకేలో ఒక ఆక్స్‌నీడ్ హాల్ అనే గ్రాండ్ ఎస్టేట్ ఇలాంటి వేడుకలకు పెట్టింది పేరు. బ్రిటన్‌లోని చాలా మంది ధనవంతుల కుటుంబాలు ఈ ప్రదేశంలోనే పెళ్లిళు, పార్టీలు వంటి వేడుకలను చేసుకుంటారు. అదీగాక ఈ మహమ్మారి సమయంలో ఈ ప్రదేశంలో ఈ వివాహ వేడుకలు, పార్టీలు మరింత అధికమయ్యాయి. అంతకుముందు ఉన్నత స్థాయి కుటుంబాలకు మాత్రమే అనుమతిచ్చేవారు. అయితే ఈ వేడుకలు అక్కడ ఉండే స్థానికులను ఇబ్బందులకు గురి చేశాయి. దీంతో అక్కడ ఉండే గ్రామస్తులంతా ఈ గార్డెన్‌లోకి వధువరులకు ఎంట్రీ లేదు, ఇక్కడ వివాహలు చేసుకునేందుకు అనుమతి లేదు అనే బోర్డులు పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. బ్రిటన్‌లో ఈ ఎస్టేట్ 16వ శతాబ్ద కాలంనాటి చారిత్రక ఎస్టేట్‌గా పేరుగాంచింది. ఐతే వివాహానికి విచ్చేసిన అతిధులు ఆ వెడ్డింగ్ హాల్ గ్రాండ్ ఎస్టేట్ చుట్టూ ఉన్న 500 ఎకరాల పోలాలను నాశనం చేస్తున్నారు. పైగా విపరీతమై మ్యూజిక్ పెట్టి చుట్టుపక్కలవాళ్లను ఇబ్బందులకు గురిచేయడంతో అక్కడ ఉండే గ్రామస్తులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వధువరులకు, జంటలకు ఆహ్వానం లేదు అని ఆ ఎస్టేట్ ముందు బోర్డులు పెట్టారు. (చదవండి: ఛేజింగ్ సమయంలో అనుహ్య ఘటన.... మంటల్లో చిక్కుక్కున్న వాహనదారుడు) -
ప్రపంచంలో ఎక్కడా చేయనట్లు మేమేదో కొత్తగా చేస్తున్నట్లు చేస్తారేం!!
ప్రపంచంలో ఎక్కడా చేయనట్లు మేమేదో కొత్తగా చేస్తున్నట్లు చేస్తారేం!! -
తల్లి గుండె బద్ధలైంది.. బిడ్డ శవాన్ని మోసుకుంటూ వెళ్లింది!
వైరల్: అప్పటిదాకా తల్లి చాటుగా పెరిగిన బిడ్డ.. ఆ తల్లి కళ్ల ముందే మరణిస్తే ఎలా ఉంటుంది?. మనిషి అయినా నోరు లేని జీవి అయినా అమ్మ ప్రేమ ఒక్కటే కదా!. అందుకే ఆ తల్లి ఏనుగు తల్లడిల్లింది. బరువెక్కిన గుండెతోనే బిడ్డను మోసుకుంటూ బయలుదేరింది. హృదయ విదారకమైన ఘటన.. వైరల్ అవుతూ ఎంతో మందిని కంటతడి పెట్టిస్తోంది. తన కళ్ల ముందే మరణించిన ఓ గున్న ఏనుగును మోసుకుంటూ ముందుకెళ్లింది ఓ ఏనుగు. ఆ నడక ఆగిపోకుండా.. చాలా దూరం అలా ముందుకు సాగింది. హఠాత్తుగా ఏమైందో తెలియదు.. ఆ తల్లి ఏనుగు, గున్నేనుగు శవంతో కనిపించకుండా పోయింది. బెంగాల్ జలపైగురిలో టీ ఎస్టేట్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అంబరీ టీ ఎస్టేట్‌లో ఓ ఏనుగు.. తన కళ్ల ఎదురుగా చనిపోయిన గున్న ఏనుగు దేహాన్ని ఎత్తే ప్రయత్నం చేసింది. ఇబ్బంది పడుతూనే తొండంతో ఆ శవాన్ని పైకి ఎత్తి దంతాల మధ్య పట్టుకుని ముందుకు ప్రయాణం మొదలుపెట్టింది. పచ్చి నీళ్లు, ఆహారం ముట్టకుండా ముందుకు సాగింది. బిడ్డ కిందపడిపోయిన శక్తినంతా కూడదీసుకుని మళ్లీ పైకి ఎత్తి ముందుకు సాగింది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. A mother elephant seen carrying carcass of her dead calf in Ambari Tea Estate, Jalpaiguri, West Bengal, India! 🙁🙁pic.twitter.com/9YBachPy8M — Aman Verma (@amanverm_a) May 29, 2022 బనారహత్ బ్లాక్ దూవార్స్ రీజియన్‌లోని చునాభటి టీ గార్డెన్ సమీపంలోని అడవిలో శుక్రవారం ఉదయం ఆ గున్నేనుగు మరణించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అది ఎలా చనిపోయింది కారణం మాత్రం నిర్ధారించుకోలేకపోయారు. అయితే చనిపోయిన తన బిడ్డను మోసుకుంటూ మరో 30-35 ఏనుగులతో కూడిన మందతో ఆ తల్లి ఏనుగు ముందుకు ప్రయాణం మొదలుపెట్టింది. దాదాపు కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి.. చునాభటి నుంచి అంబరి టీగార్డెన్లోకి ప్రవేశించింది. అక్కడి నుంచి డయానా టీ గార్డెన్ నుంచి న్యూదువార్స్ టీ గార్డెన్ వైపు వెళ్లింది. చివరకు రెడ్బంక్ టీ గార్డెన్‌లోని పొదల్లో బిడ్డ శవాన్ని ఉంచింది. మిగతా ఏనుగులన్నీ అడవి వైపు మళ్లాయి. కానీ.. ఆ ఏనుగుల కదలికలను పరిశీలించిన అధికారులకు ఆ గున్నేనుగు శవం దొరకలేదు.. సరికదా ఆ తల్లి ఏనుగు మంద నుంచి కనిపించకుండా పోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ తల్లి ఏనుగును ఎలాగైనా కనిపెట్టి.. అడవుల్లోకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
జనధనంతో.. ప్రైవేటుకు ప్రయోజనం..
నిబంధనలకు నీళ్లొదిలిన తుని మున్సిపల్ అధికారులు పట్టణంలో అనేక ప్రాంతాల్లో కచ్చా డ్రెయిన్లూ కరువే.. టీడీపీ వారి లేఅవుట్‌కు రూ.28 లక్షలతో కాలువ నిర్మాణం ఎగువ నుంచి నీరు పోవడానికేనని సాకులు తుని : వడ్డించే వాడు మనవాడైతే చాలు.. బంతి చివర కూర్చున్నా నష్టం లేదన్నది సామెత. దీన్ని తుని పురపాలకసంఘం అధికారులు కొంచెం మార్చి ‘మనవాడైతే అసలు బంతిలో కూర్చోకపోయినా విందుకు లోటు లేదు’ అంటున్నారు. ప్రజాధనాన్ని ప్రజల కోసం కాక రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ధారాదత్తం చేస్తున్నారు. తుని పట్టణంలోని అనేక ప్రాంతాల్లో కనీసం రోడ్లు, కాలువలు లేవు. వీటికి సంబంధించి ప్రతిపక్షానికి చెందిన కౌన్సిలర్లు విజ్ఞాపనలిచ్చినా నిధులు లేవని చెప్పి మున్సిపల్ అధికారులు కాలయాపన చేస్తున్నారు. అదే అధికారులు ప్రైవేటు లే అవుట్ కోసం ప్రజాధనంతో అధికారికంగా కాలువ నిర్మాణం చేపట్టారు . అది అధికార పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్‌కు సంబంధించిన వారి లే అవుట్ కావడంతో నిబంధనలు సడలించారు. రూ.28 లక్షలతో యుద్ధప్రాతిపదికన కాలువ పనులు చేపట్టారు. నిబంధనలు ఇలా.. ఏదైనా వ్యవసాయ భూమిని లే అవుట్ వేయాలంటే మార్కెట్ విలువలో పది శాతం భూమి మార్పిడి ఫీజు చెల్లించాలి. కాలువలు, రోడ్లు, విద్యుత్ సదుపాయం లే అవుట్ వేసినవారే సమకూర్చాలి. మొత్తం స్థలంలో పది శాతాన్ని ప్రజావసరాలకు మార్ట్గేజ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే డీటీపీసీ లేదా ఉడా అనుమతులు ఇస్తాయి. గతంలో తుని పరిసర ప్రాంతాల్లో సుమారు 270 ఎకరాల్లో అనధికార లే అవుట్లు వేశారు. ఇందుకు సంబంధించి రూ.30 కోట్ల మేర చెల్లించాలని ఉడా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు తాజాగా పట్టణానికి ఆనుకుని ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్ కుటుంబసభ్యులకు చెందిన 15 ఎకరాల్లో ఉడా లే అవుట్ వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం దాఖలు చేసిన దరఖాస్తుల్లో రోడ్లు, కాలువలు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను కల్పిస్తామని పేర్కొన్నారు. 60 అడుగుల రోడ్లు, మేజర్ డ్రెయిన్లను ఏర్పాట చేయాల్సిన బాధ్యత లే అవుట్ వేసే వారిదే. ఇందుకు భిన్నంగా మున్సిపల్ అధికారులు ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్ముతో అధికార పార్టీకి చెందిన రియల్ఎ స్టేట్ వ్యాపారికి చెందిన లే అవుట్ లో కాలువ నిర్మిస్తున్నారు. విశేషమేమిటంటే అదే లే అవుట్‌కు అనుకుని మరో లే అవుట్ వ్యాపారి పక్కా రోడ్లు, కాలువలు, విద్యుత్ లైను ఏర్పాటు చేశారు. ఇక్కడ మాత్రం విరుద్ధంగా జరుగుతోంది. కనీస సదుపాయాలకు నోచని 18కి పైగా మురికివాడలు పట్టణంలోని 18కి పైగా మురికివాడల్లో కనీస సదుపాయాలు లేవు. రోడ్లు, కాలువలు ఏర్పాటు చేయాలని ఏళ్ల తరబడి ప్రజలు అడుగుతున్నా నిధుల కొరత ఉందని చెప్పి అధికారులు తప్పించుకుంటన్నారు. కొండవారిపేట, డ్రైవర్స్ కాలనీ, బ్రహ్మాల కాలనీ, సాయినగర్, వారదరపు పేట, రామకృష్ణా కాలనీ, ఇసుకలపేట, ఉప్పరగూడెం తదితర ప్రాంతాల్లో కచ్చా కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు తమ ప్రాంతాల్లో పరిస్ధితిని వివరించినా స్పందన లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తుల వ్యాపారానికి మేలు చేకూర్చేందుకు రూ.28 లక్షలను ధారపోయడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటి అనుచితాలు మాని, ప్రజాధనాన్ని ప్రజోపయోగానికే ఖర్చు పెట్టాలంటున్నారు. కాగా ఎగువ ప్రాంతంలో నీరు పోవడానికి దారి లేకపోవడంతో సదరు లే అవుట్ యజమానిని అభ్యర్థించి అటుగా కాలువను ప్రజల కోసం కాలువను నిర్మిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ ఎస్.వెంకటరమణ చెప్పారు. ఇందులో ఎవరి ఒత్తిళ్లూ లేవని, నిబంధనల ప్రకారం లే అవుట్ యజమాని రోడ్లు, కాలువలు నిర్మించాల్సే ఉంటుందని అన్నారు. -
ఐదు నిమిషాల్లో లక్షాధికారి
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 11 రాబిన్సన్ తన మేనల్లుడితో కోపంగా చెప్పాడు. ‘‘థామస్! నీ గురించే నేను మాట్లాడేది. నీ ప్రవర్తన, నీ మిత్రులు, నీ జీవితం విధానం నాకు నచ్చలేదు. మీ నాన్న నీ ఎస్టేట్‌కి నన్ను ధర్మకర్తగా నియమించాడు. విల్లు రాయబోయే ముందు మనం ముగ్గురం ఈ విషయం స్పష్టంగా మాట్లాడుకున్నాం. నీకు ఏడాదికి పదివేల డాలర్లు సరిపోతుంది. నీకు ముప్ఫై ఐదో యేడు వచ్చేదాకా నువ్వు ఆ ఆస్తిని ముట్టుకోలేవు.’’ ‘‘సారీ అంకుల్. నేను చాలా మారాను’’ థామస్ తనలోని కోపాన్ని బయటికి కనపడనివ్వకుండా జవాబు చెప్పాడు. ‘‘కాని నీలో నాకామార్పు కనపడడం లేదు. ఇంకో ఏడేళ్లదాకా నీకు ఏటా పదివేల డాలర్లు మించి అదనంగా ఏం ఇవ్వను. నీకు ఏడాదికి పదివేలు చాలలేదంటే, ఖర్చు చేయడానికి నీకు చాలా తీరిక ఉందని అర్థం. కాబట్టి ఉద్యోగంలో చేరు. కొంత ఆదాయం రావడమే కాక, ఖర్చు చేయడానికి సమయం కూడా బాగా తగ్గుతుంది’’ రాబిన్సన్ కోపంగా చెప్పాడు. తన అంకుల్ని హత్య చేయాలన్న ఆలోచన థామస్‌కి ఆ క్షణంలో కలిగింది. రెండు వారాలపాటు రాబిన్సన్ రొటీన్‌ని పరిశీలిస్తూ ఆయన్ని ఎలా చంపాలా అని ఆలోచించాడు. ఇంట్లో ఆయన ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. పనివాళ్లు ఇద్దరైనా ఆయనతో ఉంటారు. అరవై ఏళ్లొచ్చినా ఇంకా బ్రహ్మచారే కాబట్టి బయటి క్లబ్లో, రెస్టారెంట్లో, పార్టీల్లో ప్రతి చోటా ఒకరిద్దరు మిత్రులు తప్పనిసరిగా ఆయన వెంట ఉంటారు. రాత్రి పడకగదిలో ఒంటరిగా ఉంటాడు. కాని తొమ్మిది దాటాక తను ఆ ఇంట్లో ఉండకూడదనే నియమాన్ని విధించాడు. బహుశ తనకి ఇప్పుడు కలిగిన ఈ ఆలోచన ఆయనకి ఎప్పుడో తట్టి, తన జాగ్రత్త కోసం ఆ నియమం విధించాడని థామస్‌కి అనిపించింది. రెండు వారాల తర్వాత తన అంకుల్ సహజ మరణం పొందాలి తప్ప చంపడం కష్టం అనుకున్నాడు. ఒకవేళ విజయవంతంగా చంపినా అనుమానం ముందుగా తనమీదకే మళ్లుతుందని కూడా థామస్‌కి తెలుసు. ఆయన మరణం వల్ల లాభం పొందేది ప్రపంచంలో తనొక్కడే అని అందరికీ తెలుసు. ఓ సాయంత్రం అతని సమస్యని థామస్ ప్రియురాలు ఫిలిన్ శ్రద్ధగా విన్నది. ఆమెది ఆకర్షణీయమైన పర్సనాలిటీ. సైకాలజీలో కాలేజీ డిగ్రీ ఉంది. థామస్ చేసిన ప్రతిపాదనకి ఆమె షాక్ అవలేదు. రాబిన్సన్ని చంపడం తమ సమస్యకి పరిష్కారం అని అంగీకరించింది. ‘‘లేదా నేను ఆఫీసులో గుమస్తాగా ఇంకో ఏడేళ్లు జీవించాలి. చంపటం దారుణం. కాని భావి జీవితం ఆనందకరంగా సాగాలంటే ఒకటి, రెండు తప్పులు చేయక తప్పదు. కాబట్టి నీ సహాయం కావాలి’’ కోరాడు. ‘‘అలాగే. తన మిత్రుల శవపేటికలని మోయడం మీ అంకుల్ హాబీ. ఓ తెలివైన అమ్మాయి ఆయన్ని తన శవపేటికలోకి పంపగలదు’’ ఫిలిన్ చెప్పింది. ‘‘ఎవరు?’’ ‘‘నాలాంటిది. నేను మూడు నెలల్లో ఆ పని చేయగలను. ఈ ముసలి బ్రహ్మచారుల గురించి నాకు బాగా తెలుసు. కాని అందువల్ల నాకు అదనపు లాభం ఏమిటి?’’ ‘‘నువ్వు ధనవంతురాలివైన విధవరాలివి అవుతావు. ఆయన పేరగల ఇన్స్యూరెన్స్ నామినేషన్లో నా పేరు కొట్టేసి మీ పెళ్లవగానే నీ పేరుని పెడతాడు అని హామీ.’’ ‘‘ఏడాదికి ఏభైవేల డాలర్లతో ఎలా జీవించగలను? అది షాంపేన్కి మాత్రమే సరిపోతుంది. ఆయన పోతే నీకెంత లాభం వస్తుంది?’’ ‘‘ఏభై లక్షల డాలర్లు. కాని అది మా నాన్న ఆస్తి తప్ప ఆయనది కాదని నీకు తెలుసు.’’ ‘‘ఆయన పోయిన ఆరు నెలలకి నువ్వు నన్ను పెళ్లిచేసుకుంటానని మాట ఇస్తావా మరి?’’ ఫిలిన్ కోరింది. ‘‘నువ్వు లేకుండా నేను జీవించలేను. జీసస్మీద ఒట్టు. నేను ప్రతీ ఆదివారం చర్చికి వెళ్తూంటాను’’ థామస్ అబద్ధం ఆడాడు. ఆ తర్వాతి సంఘటనలు థామస్ ఎదురు చూసిన దానికన్నా వేగంగా జరిగిపోయాయి. ఓ రోజు థామస్ సెంట్రల్ పార్క్‌లో రాబిన్సన్కి ఫిలిన్ని పరిచయం చేశాడు. కొద్దినిమిషాల తర్వాత సెల్‌ఫోన్ మోగింది. మాట్లాడి అర్జెంట్ పనిమీద వెళ్లాలని చెప్పి థామస్ వెళ్లిపోయాడు. ఫిలిన్ ఆయన్ని తన మాటలతో కూడా ఆకర్షించింది. వారంలో రాబిన్సన్ ఆమెని నాటకశాలకి తీసుకెళ్లాడు. రెండు వారాల తర్వాత ఒంటరిగా నివసించే ఆమె అపార్ట్మెంట్కి వెళ్లాడు. నెలన్నర తర్వాత వారి పెళ్లి నిశ్చయం అయింది. ఈ నెలన్నర థామస్‌కి ఫోన్ ద్వారా ఫిలిన్ తను సాధించే అభివృద్ధిని వివరిస్తూనే ఉంది. పెళ్లయ్యాక నూతన దంపతులు యూరప్‌కి హనీమూన్‌కి వెళ్లివచ్చారు. పెళ్లయిన రాబిన్సన్ నిత్యం షేర్ బ్రోకర్ల ఆఫీసులకి వెళ్లడం, క్లబ్‌కి, రెస్టారెంట్లకి వెళ్లడం ఆగిపోయాయి. మంచి భర్తలా ఆయన తన సమయాన్ని తన భార్యతోనే ఇంట్లో గడుపుతున్నాడు. ఆయన థామస్‌ని తన ఇంటికి పెళ్లయ్యాక మొదటిసారి ఆహ్వానించాడు. అంకుల్ని చూసి థామస్ ఆశ్చర్యపోయాడు. ఆయనలో కొత్త శక్తి కనిపించింది. ఇదివరకటి కంటే ఉత్సాహంగా ఉన్నాడు. ఓ పదిహేనేళ్లు వయసు తగ్గినట్లుగా, ఇంకో పాతికేళ్లు జీవించేట్లుగా కూడా కనిపించాడు. కాని ఫిలిన్కి పదేళ్లు పెరిగినట్లుగా కనిపించింది. కళ్లకింద వలయాలు. గోళ్లకి రంగు వేసుకోలేదు. ఐనా ఉత్సాహంగానే కనిపించింది. ఏభై లక్షల డాలర్లకి తను వారసుడైతే తన భార్యగా ఆమె పనికిరాదని థామస్ ఆరోజే నిర్ణయించు కున్నాడు. వారిద్దరి మధ్య కొన్ని నిమిషాల ఏకాంతమే దొరికింది. ‘‘మనం ఆ పని త్వరగా చేయాలి థామస్. నేను మీ అంకుల్ని ఎక్కువ కాలం భరించలేను. లేదా నేను సహజ మరణాన్ని పొందుతాను. నేను వంట నేర్చుకోవాల్సి వచ్చింది. అంట్లు తోమాలి’’ ఆవేదనగా చెప్పింది. తన పథకాన్ని వివరించింది. కార్ పార్క్‌లో దొంగిలించిన లెసైన్స్ ప్లేట్లని తన కారుకి అమర్చుకుని థామస్ గురువారం రాత్రి పదకొండున్నరకి తన అంకుల్ ఇంటికి కొద్దిదూరంలో కారు ఆపాడు. కారు దిగి వంటగది వెనక తలుపులోంచి లోపలికి వెళ్లాడు. ఫిలిన్ చెప్పినట్లుగానే లోపల గడియ పెట్టలేదు. ‘‘లేవండి. కింద చప్పుడైంది’’ ఫిలిన్ భర్తని నిద్రలేపింది. ఆయనకీ చప్పుడు వినిపించడంతో డ్రాయర్లోని రివాల్వర్ని అందుకుని తలుపు తెరుచుకుని బయటికి వచ్చాడు. ఆయన మొదటి మెట్టుమీద ఉండగా చీకట్లో దాక్కున్న థామస్ వెనక నుంచి ఆయన తలమీద సుత్తితో బలంగా మోదాడు. ఆయన పెద్దగా మూలుగుతూ మెట్లమీంచి కిందికి దొర్లిపోయాడు. మూలుగు సన్నగా వినిపిస్తోంది. తర్వాతి పథకం అంతా థామస్ అనుకున్నట్లుగానే జరిగింది- కొంతదాకా. థామస్ కొంత విలువైన సామానుని తీసుకుని, కిటికీ అద్దం బయటినుంచి పగలగొట్టి పారిపోవాలి. తద్వారా దొంగమీదకి అనుమానం మళ్లుతుంది. ఫిలిన్ వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తుంది. కాని ఏభై లక్షల వారసుడయ్యాక మళ్లీ ఫిలిన్ మరణిస్తే పోలీసులకి తనమీద అనుమానం కలగచ్చు. దొంగ కేవలం భర్తనే చంపి భార్యని ఎందుకు చంపకుండా వెళ్తాడు? తనామెని పెళ్లి చేసుకోకపోతే జీవితాంతం తనని బ్లాక్ మెయిల్ చేయచ్చు. అతని పథకం కొంతదాకానే జరిగింది. ఫిలిన్ చేతిలోని తనకి గురిపెట్టబడ్డ రివాల్వర్ని చూసి ఆశ్చర్యపోయాడు. ‘‘నన్ను చంపి ఏమిటి ప్రయోజనం?’’ అడిగాడు. ‘‘ఏభై లక్షల డాలర్లు.’’ ‘‘కాని మా నాన్న ఆ ట్రస్ట్‌ని నాకు రాశాడు. నీకు కాదు.’’ ‘‘కావచ్చు. నీ తర్వాత ఎవరికి వెళ్తుంది? నీ అంకులే నీ వారసుడు. ఆయన తర్వాత? ఆయన వారసురాలైన నాకు.’’ ‘‘నా అంకుల్ ముందు చచ్చాడు. తర్వాత నేను చస్తే, ఇక ఆయన నా ఆస్తికి వారసుడు ఎలా అవుతాడు?’’ ‘‘ఆయన కన్నా ముందుగా నువ్వు చస్తావు. తర్వాత ఆయన. పది క్షణాల తర్వాత చచ్చినా సరే, నీ ఆస్తికి నీ అంకుల్ వారసుడై చస్తాడు.’’ ‘‘మూర్ఖురాలా! కాని అది ఎలా ఋజువు చేయగలవు?’’ ‘‘మావారి అరుపు విని వస్తే, చేతిలో సుత్తితో చీకట్లో కనపడ్డ వ్యక్తిని రెండుసార్లు కాల్చి చంపాను. తర్వాత మావారి దగ్గరికి వెళ్తే డాక్టర్‌కి ఫోన్ చేయమని చెప్పారు. ఫోన్ చేసి, ఆయన ఇంకా జీవించే ఉన్నారని, వెంటనే రమ్మని చెప్తాను. వారు రావడానికి పది క్షణాల ముందే పోయారని చెప్తాను.’’ ‘‘ఇదన్యాయం ఫిలిన్.’’ థామస్ దీనంగా అర్థించాడు. ‘‘నువ్వు నీ అంకుల్‌కి ఏభై లక్షలకోసం ఏం చేశావో అదే పాఠాన్ని నేను నేర్చుకున్నాను థామస్ గుర్తుందా? ‘చంపటం దారుణం. కాని భావి జీవితం ఆనందకరంగా సాగాలంటే ఒకటి, రెండు తప్పులు చేయక తప్పదు’ అని నువ్వే బోధించావు. గుడ్ బై!’’ ఫిలిన్ చేతిలోని రివాల్వర్ రెండుసార్లు పేలింది. గురి తప్పకుండా రెండూ అతని గుండెని ఛేదించాయి. తర్వాత ఆమె టెలిఫోన్ వైపు నడిచింది. - (జేమ్స్ క్రాన్ కథకి స్వేచ్ఛానువాదం) -
కలకలం
మడకశిర : మడకశిర పోలీస్ స్టేషన్ లాకప్‌లో షేక్ బషీర్ (36) అనే నిందితుడు మృతి చెందడం కలకలం రేపింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. మడకశిరలో గత నెల 12వ తేదీన 20 టన్నుల ఐరన్ రాడ్లు చోరీ అయ్యాయని బాధితులు ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సోమవారం రాత్రి మండలంలోని కల్లుమర్రికి చెందిన బషీర్‌ను నిందితునిగా భావిస్తూ స్టేషన్‌కు తీసుకొచ్చారు. దీంతో అవమాన భారం భరించలేక లాకప్‌లోనే ఇనుప కడ్డీలకు సమైక్యాంధ్ర పార్టీ జెండాతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. అక్కడి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. లాకప్‌లో ఇనుప కడ్డీలు ఎత్తులో లేవు. దాన్నిబట్టి అక్కడ ఉరి వేసుకునే ందుకు ఏమాత్రమూ అవకాశం లేదు. పోలీసులే ప్రాణం తీశారు! ‘కల్లుమర్రి సమీపంలోని పంజాబ్‌కు చెందిన వ్యక్తుల ఎస్టేట్‌లో బషీర్ చాలాకాలంగా కూలీగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఎస్టేట్‌లో ట్రాక్టర్ ట్రాలీ అపహరణకు గురైంది. ఇది బషీర్ చేశాడంటూ ఎస్టేట్ యజమానులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గత శుక్రవారమే అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలంటూ విచక్షణారహితంగా చావబాదారు. మా కుమారుడు అమాయకుడని, వదిలి పెట్టాలని ప్రాధేయపడినా పోలీసులు కనికరించలేదు. పైగా డబ్బు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మరోసారి పోలీసులు కొట్టిన దెబ్బలకు బషీర్ ప్రాణాలు విడిచాడ’ని తల్లిదండ్రులు దష్కర్సాబ్, జానద్బీ ఆరోపించారు. సెంట్రీల నిర్లక్ష్యం పోలీస్‌స్టేషన్‌లో రాత్రి పూట ఇద్దరు సెంట్రీలు విధులు నిర్వర్తిస్తారు. సోమవారం రాత్రి ఒక సెంట్రీ, మరొక సపోర్ట్ సెంట్రీ డ్యూటీలో ఉన్నారు. నిందితులు లాకప్‌లో ఉంటే నలుగురు సెంట్రీలను విధు ల్లో పెట్టాల్సి ఉంటుంది. ఈ నిబంధనను పోలీసులు పాటించకుండా ఇద్దరినే ఉంచారు. సెంట్రీ డ్యూటీలో ఉన్న సిబ్బంది.. బషీర్ ఆత్మహత్యను ఎందుకు నివారించలేదు? వీరు విధుల్లో నిద్రపోవడం వల్లే నిందితుడు అఘాయిత్యం చేసుకున్నాడా? లేక పోలీసులు కొట్టిన దెబ్బలకు చనిపోయాడా? అన్నది విచారణలో తేలాల్సి వుంది. కల్లుమర్రిలో విషాదం బషీర్ మృతితో కల్లుమర్రిలో విషాదం అలుముకుంది. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పోలీసుల వల్లే తన భర్త మృతి చెందాడని, నలుగురు పిల్లలను తానెలా పోషించుకోవాలని బషీర్ భార్య రోదించింది. పోలీస్‌స్టేషన్ వద్ద మృతదేహంపై పడి భార్యా పిల్లలు విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ప్రజా ప్రతినిధుల పంచాయితీ! మడకశిర పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే ఈరన్న, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తదితరులు పెనుకొండ డీఎస్పీ సుబ్బారావుతో సమావేశమై మృతుడి కుటుంబాన్ని ఆదుకునే విషయమై చర్చించారు. అనధికారికంగా అందిన సమాచారం మేరకు... ఈ సంఘటనకు కారకులైన ఎస్టేట్ యాజమాన్యం, ఇతరుల నుంచి నగదుతో పాటు మృతుడి భార్యకు పోలీస్ శాఖలో హోంగార్డు ఉద్యోగం, ప్రభుత్వం తరఫున రెండెకరాల భూమి ఇప్పించే విధంగా తీర్మానించినట్లు తెలిసింది. అమానుషం బషీర్ లాకప్‌డెత్ ఘటనను మాజీ ఎమ్మెల్యేలు వైటీ ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి, స్థానిక నాయకులు రవిశేఖర్‌రెడ్డి, ఆనందరంగారెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రీరాములు, కాంగ్రెస్ నాయకులు అశ్వర్థనారాయణ, మంజునాథ్, అక్రం, ఎస్.ప్రభాకర్‌రెడ్డి, సీపీఎం నాయకులు రామాంజినేయులు, మీరాన్‌సాబ్, ముస్తాక్, జుబేర్ తదితరులు ఖండించారు. బషీర్ కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం, 10 ఎకరాల భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా.. రాష్ట్రంలో ఎన్కౌంటర్లు, లాకప్డెత్లతో చంద్రబాబు పాలన ప్రారంభమైందంటూ ఓపీడీఆర్ ఏపీ, టీఎస్ అధ్యక్షుడు ఎం.శ్రీనివాసులు విమర్శించారు. బషీర్ లాకప్‌డెత్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో బహిరంగ న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇది రెండో లాకప్‌డెత్ బషీర్ (35) లాకప్‌డెత్ ఘటన మడకశిర నియోజకవర్గంలో రెండవది. 22 ఏళ్ల క్రితం అమరాపురం పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్ జరగ్గా.. అందుకు బాధ్యుడైన ఎస్ఐకి జైలుశిక్ష పడింది. అలాగే 1994లో గుడిబండ మండలం మందలపల్లికి చెందిన హనుమంతరాయప్ప ఓ కేసుకు సంబంధించి మడకశిర సబ్‌జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెజిస్టీరియల్ విచారణకు కలెక్టర్ ఆదేశం అనంతపురం కలెక్టరేట్: మడకశిరలో జరిగిన లాకప్‌డెత్ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు కలెక్టర్ లోకేష్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెనుకొండ ఆర్డీఓ ఎగ్గిడి వెంకటేశును విచారణ అధికారిగా నియమించినట్లు పేర్కొన్నారు. తక్షణ సహాయంగా మృతుడు బషీర్ భార్య హర్ఫతున్నీసాకు రూ.20వేలు అందజేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై మానవహక్కుల సంఘానికి కూడా నివేదిక పంపించినట్లు వివరించారు. ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లపై వేటు అనంతపురం క్రైం : మడకశిర పోలీసు స్టేషన్లో మంగళవారం జరిగి న బషీర్ లాకప్‌డెత్ ఘటన లో ఎస్ఐ సద్గురుడుతో పాటు ముగ్గురు కానిస్టెబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. పోలీసుల తీరును నిరసిస్తూ మృతుని కుటుంబ సభ్యులు పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. సమాచారం అందుకున్న ఎస్పీ సెంథిల్‌కుమార్, అడిషనల్ ఎస్పీ రాంప్రసాద్, పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అనంతరం ముగ్గురు కానిస్టేబుళ్ల నిర్లక్ష్యం కారణంగా బషీర్ మృతిచెందాడని అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. దీంతో విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒకరి మృతికి కారణమైన ఎస్ఐతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురంలో ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ లాకప్‌డెత్ ఘటనపైడీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపించడమే కాకుండా, మెజిస్టీరియల్ విచారణ చేయిస్తున్నామన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన నిందితుల్లో ప్రతి ఒక్కరూ నేరస్తులు కాదని న్యాయస్థానాలు స్పష్టం చేస్తున్నా నేరస్తులను కనిపెట్టాల్సిన పోలీసులు తమకు చేతనైన లాఠీ ప్రయోగంతో మానవ హక్కులను కాలరాస్తున్నారు. విచారణ పేరుతో వారాల తరబడి అనధికారికంగా లాకప్‌లో ఉంచి చితకబాదుతున్నారు. థర్డ డిగ్రీ వంటి కఠిన చర్యలకు పాల్పడిన పోలీసు అధికారులు, సిబ్బందిపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాల్సిన ఉన్నతాధికారులు సస్పెన్షన్లతో సరిపెడుతున్నారు. పోలీసులకు మిగిలిన శాఖలు కూడా తమ వంతు సహకారం అందించడంతో కస్టోడియల్ డెత్‌లు అనారోగ్య మరణాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘం నేతలు ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేసి ఖాకీల తీరును నిరసిస్తున్నా పోలీసుల్లో మార్పురావడం లేదు. ఇదీ లాకప్ డెత్‌ల జాబితా... 1989లో కళ్యాణదుర్గం స్టేషన్లో ఒకరు, 1993లో ధర్మవరం స్టేషన్లో ఒకరు , 1995లో ముదిగుబ్బ స్టేషన్లో ఒకరు, 1997లో ఎరుకల జయమ్మ, ఎరుకల లక్ష్మి అనంతపురం పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్‌కు గురయ్యారు. 2001లో గాడ్లపెంట స్టేషన్లో ఒకరు, ధర్మవరం స్టేషన్లో ఒకరు, 2002లో విడపనకల్లు ఎక్సైజ్ స్టేషన్లో ఒకరు, అనంతపురం టూటౌన్ స్టేషన్లో ఒకరు, 2003లో కళ్యాణదుర్గం స్టేషన్లో ఒకరు, యాడికి స్టేషన్లో ఈశ్వరయ్య లాకప్‌డెత్‌కు గురయ్యారు. 2005, జనవరి 28న ఆకుతోటపల్లికి చెందిన తాడిపత్రి ఈశ్వరయ్య ఇటుకలపల్లి స్టేషన్లో, 2007లో నల్లచెరువు స్టేషన్లో ఒకరు, 2008లో హిందూపురం రూరల్ స్టేషన్లో ఒకరు, 2010లో ముదిగుబ్బ పోలీస్ స్టేషన్లో తమిళనాడుకు చెందిన మురుగేష్ అనే వ్యక్తి లాకప్‌డెత్‌కు గురయ్యారు. తాజాగా మంగళవారం తెల్లవారుజామున మడకశిర పోలీసు స్టేషన్లో బషీర్ అనే నిందితుడు లాక్ప్డెత్కు గురైన తీరు పోలీసుల అమానుషానికి అద్దం పడుతోంది. మహిళలపై లాఠిన్యం! ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలిని ఏమార్చి బంగారు, నగదును కాజేశారన్న ఆరోపణపై ఉరవకొండ పోలీసులు తాజాగా సోమవారం మధ్యాహ్నం సుమిత్ర, రాణి, మంజుల , దుర్గాలక్ష్మి అనే మహిళలను అదుపులోకి తీసుకుని విచక్షణారహితంగా లాఠీలతో కుళ్లబొడిచినట్లు సమాచారం. అపస్మారక స్థితికి చేరుకోవడంతో వారిని గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి అనంతపురానికి తరలించార ని తెలిసింది.