
Tomato Tukaram Bhagoji Gayakar earns 1.5 crore: ఇపుడు ఏ నలుగురు కలిసినా ఒకటే టాపిక్.. టొమాటో ధరల మంట. అయితే ఈ డిమాండ్ -సప్లయ్ సంక్షోభంలో సాధారణంగా రైతులకు జరిగే మేలు జరిగే సందర్బాలు చాలా తక్కువ. కానీ మహారాష్ట్రలోని పూణె జిల్లాకు చెందిన రైతు తుకారాం భాగోజీ గయాకర్ అలాంటి అదృష్టం వరించింది. 30 రోజుల్లో కోటిన్నర రూపాయలు సంపాదించడం విశేషంగా నిలిచింది. (Koushik Chatterjee: కంపెనీ సీఈవో కాదు, అయినా రోజుకు నాలుగు లక్షల జీతం)
దేశంలోని పలు ప్రాంతాల్లో టొమాటో ధర మండిపోతున్న సంగతి తెలిసిందే. 12 ఎకరాల భూమిలో టొమాటో సాగు చేస్తున్న సమయంలో తనకు ఇంత అదృష్టం క లిసి వస్తుందని బహుశా తుకారాం అసలు ఊహించి ఉండరు.ఇండియా టుడే నివేదిక ప్రకారం తుకారాం భాగోజీ గయాకర్ టొమాటో సాగు చేశాడు. మంచి దిగుబడి వచ్చింది. నారాయణగంజ్‌లో తన పంటను విక్రయించడం ద్వారా రైతు రోజుకి రూ.2,100 సంపాదించాడు. దీనికితోడు శుక్రవారం ఒక్కరోజే 900 డబ్బాలను విక్రయించి ఒక్కరోజులోనే రూ.18 లక్షలు సంపాదించాడు. మొత్తంగా నెల రోజుల్లో అతని సంపాదన 1.5 కోట్ల రూపాయలకు చేరింది. (తక్కువ ధరలో సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్)
తుకారాం తన కుమారుడు ఈశ్వర్ గయాకర్, కోడలు సోనాలి సహాయంతో నెలలో 13,000 టమోటా డబ్బాలను విక్రయించాడు. 18 ఎకరాల వ్యవసాయ భూమిలో 12 ఎకరాల్లో టమాట సాగు చేశాడు. ఎరువులు , పురుగుమందులపై అవగాహన, సస్యరక్షణపై అవగాహనతో నాణ్యమైన టమోటాలు పండించామని తుకారాం కుటుంబం చెబుతోంది.
ముఖ్యంగా తుకారాం కోడలు సోనాలి మొక్కలు నాటడం, పంట కోయడం, ప్యాకింగ్ చేయడం వంటి పనులను నిర్వహిస్తుండగా, కుమారుడు ఈశ్వర్ సేల్స్, మేనేజ్‌మెంట్ , ఫైనాన్షియల్ ప్లానింగ్‌ను నిర్వహిస్తుండగా. గత మూడు నెలలుగా పడిన కష్టానికి తగిన ఫలితం దక్కిందని తుకారం కుటుంబం సంబరపడుతోంది. అంతేకాదు ఈ ప్రాంతంలో తుకారం కుటుంబం మాత్రమే కాకుండా చాలామంది రైతులు కోటీశ్వరులైనట్టు తెలుస్తోంది. జున్నార్ వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ కమిటీ ద్వారా 100 మంది మహిళలు, 2 నెలల్లో 80 కోట్ల రూపాయల టొమాటో విక్రయించారట.
కాగా నారాయణగంజ్‌లో, జున్ను వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ మార్కెట్‌లో, నాణ్యమైన (20 కిలోలు)టొమాటో గరిష్టంగా రూ.2,500 పలుకుతోంది. అంటే కిలో రూ.125. ఇది ఇలా ఉంటే కేంద్రం శుక్రవారం టొమాటో కిలో రూ. 90 చొప్పున ప్రజలకు విక్రయించడం ప్రారంభించింది, వాటిని వ్యవసాయ కేంద్రాల నుండి ఢిల్లీ-ఎన్‌సిఆర్ , లక్నో వంటి నగరాలకు రవాణా చేసింది.