Rs 1 crore
-
ఏడాదికి కోటి జీతం: ఇలాంటి జాబ్స్ చేస్తే మీ సొంతం
ఏడాదికి కోటి సంపాదన.. ఎవరు మాత్రమే వద్దనుకుంటారు చెప్పండి. దీనికి పలు మార్గాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.. బిజినెస్ చేయొచ్చు. అయితే ఇలాంటి చేయడానికి పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెడితే.. తప్పకుండా లాభాలే వస్తాయని ఖచ్చితంగా చెప్పలేము. నష్టాలు కూడా రావచ్చు. కానీ ఉద్యోగం చేసి కూడా కోటి రూపాయలు సంపాదించడానికి అవకాశం ఉంది. అయితే సంవత్సరానికి కోటి రూపాయల జీతం పొందాలంటే ఎలాంటి కోర్స్ చదవాలి? ఎలాంటి కంపెనీలలో జాబ్స్ తెచ్చుకోవాలి.. అనే విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో ''నాకు తెలుసు ఐటీలో చాలామంది కోట్లలో జీతాలను పొందుతున్నారు. అలాంటి ఉద్యోగాలు వారికి ఎలా దొరుకుతున్నాయనేది నా ప్రశ్న?. నేను ఇంటర్వ్యూలకు గట్టిగా సిద్దమవుతున్నాను. అలాంటి జాబ్స్ కోసం ఎక్కడ వెతకాలి? జాబ్ మార్కెట్లో ఏడాది 40 లక్షల కంటే ఎక్కువ జీతం నాకు కనిపించలేదు'' అని ఉంది.ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ కావడంతో.. పలువురు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంత అదృష్టం కూడా ఉండాలి. నేను కాలిఫోర్నియా బేస్డ్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే.. నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాను. రోజు ఉదయం 9:30 గంటలకు లాగిన్ అయ్యి.. సాయంత్రం 4 గంటలకు లాగవుట్ అవుతాను. ఇలాంటి జాబ్ నా స్నేహితుడు.. ఇండియాలో చేస్తున్నాడు. అతడి జీతం తక్కువ. కాబట్టి నాకు ఈ ఉద్యోగం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.. అని ఓ నెటిజన్ పేర్కొన్నారు.ఉద్యోగంలో చేరాలి, పని చేయడంలో తనను తానూ నిరూపించుకోవాలి, తొందరగా పదోన్నతులు పొందాలి. అప్పుడే ఎక్కువ జీతం లభిస్తుందని మరో నెటిజన్ అన్నారు. నాకు ఏడాది 10 లక్షల రూపాయలు లభించే ఉద్యోగాలకు సంబంధించిన ఫోన్ కాల్స్ కూడా రావడం లేదని మరో నెటిజన్ వాపోయాడు. ఇలా ఎవరికి తోచిన రీతిలో.. వారు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.ఎక్కువ జీతాలు అందించే కంపెనీలుగూగుల్, మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్, అమెజాన్, అడోబ్, ఎన్వీడియా, సిస్కో, జునిపెర్, ఫేస్బుక్ మొదలైన కంపెనీలు అత్యధిక వేతనాలు అందించే కంపెనీల జాబితాలో అగ్రగామిగా ఉన్నాయి. ఈ కంపెనీలలో కూడా ఎవరికిపడితే వారికి అధిక వేతనాలు ఉండవు. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: అలాంటి కార్లు టోల్ గేట్ దాటితే భారీ జరిమానా.. జైలు శిక్ష కూడా!అర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో నైపుణ్యం ఉండేవారికి ప్రస్తుతం ఎక్కువ జీతాలు లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా ఎండీలు, ఫండ్ మేనేజర్లు, ఆర్కిటెక్చర్లు వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న వారు కూడా ఎక్కువ వేతనాలు పొందవచ్చు. కాబట్టి ఇలాంటి రంగాల్లో ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకునే ఎవరైనా.. రూ. కోటి కంటే ఎక్కువ వేతనం పొందవచ్చు. అమెరికాలో ఉద్యోగం చేసేవారిలో చాలామంది సులభంగా కోటి రూపాయల జీతం పొందుతున్నారు. -
రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటి
ఒక్కో నీటి బిందువే.. మహా సముద్రమైనట్లు, ఒక్కో రూపాయి పోగేస్తేనే కోటీశ్వరులవుతారు. కాబట్టి రోజుకు కేవలం రూ.50 ఆదా చేయడం ద్వారా.. కోటి రూపాయలు సొంతం చేసుకోవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఇదెలా సాధ్యం? దీని గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.రోజుకి 50 రూపాయలు ఆదా చేస్తే.. నెలకు రూ.1,500, సంవత్సరానికి రూ.18,000 అవుతాయి. అయితే కోటి రూపాయలు కావాలంటే మాత్రం దీనిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతే కంటే ముందు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అయితే కోటి రూపాయల కోసం దీర్ఘకాలిక పెట్టుబడి అవసరం.రోజుకు రూ.50 పొదుపు చేస్తూ.. రూ.1 కోటి సొంతం చేసుకోవాలంటే, ముందుగానే పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. కనీసం 30 ఏళ్ల వరకు ఇన్వెస్ట్మెంట్లలను కొనసాగించాలి. ఇలా చేస్తూ ఉండటం వల్ల 10 నుంచి 20 శాతం వరకు రాబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కంపౌండింగ్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.మీరు 25 సంవత్సరాల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, మీరు కోటి రూపాయలు ఎలా పొందుతారో ఇక్కడ చూడండి.➤రోజుకి 50 రూపాయలు కాబట్టి.. 10 సంవత్సరాలలో మీ పెట్టుబడి రూ.1,80,000 అవుతుంది. దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.2,13,137 వస్తాయి. కాబట్టి ఈ మొత్తం రూ. 3,93,137.➤ఇదే విధంగా 20 సంవత్సరాలలో, మీ పెట్టుబడి రూ.3,60,000. దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.16,14,519. కాబట్టి మొత్తం రూ.19,74,519.➤30 సంవత్సరాలలో.. పెట్టుబడి రూ.5,40,000 అయితే.. దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.77,95,583 వస్తాయి. వీటి మొత్తం రూ.83,35,583.➤32 సంవత్సరాలలో, మీ పెట్టుబడి రూ.5,76,000, దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.1,04,76,949 అవుతుంది. కాబట్టి మీరు పొందే మొత్తం రూ.1,10,52,949.పైన చెప్పిన విధానం ప్రకారం, మీరు పెట్టే పెట్టుబడి, దానికి ఎంత లాభం వస్తుంది. చివరగా చేతికి ఎంత వస్తుందనే వివరాలు స్పష్టంగా అవగతం అవుతాయి.ఇదీ చదవండి: 15X15X15 ఫార్ములా.. కోటీశ్వరులు అవ్వడానికి ఉత్తమ మార్గం!గమనిక: పెట్టుబడి పెట్టేవారు, ముందుగా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే పెట్టుబడి అనేది ఒకరు ఇచ్చే సలహా కాదు. అది పూర్తిగా మీ వ్యక్తిగతం. కాబట్టి మీ ఆర్థిక ప్రణాళిక కోసం తప్పకుండా నిపుణులను సంప్రదించండి. ఆ తరువాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోండి. -
TTD: శ్రీవారి అన్నదానం ట్రస్ట్‌కు కోటి రూపాయలు విరాళం
తిరుపతి, సాక్షి: బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన సుమధుర గ్రూప్ సీఎండీ శ్రీ మధుసూధన్ టిటిడి అన్న ప్రసాదం ట్రస్టుకు ఒక కోటి రూపాయలు విరాళంగా అందించారు.ఈ మేరకు విరాళం డీడీని తిరుమలలోని గోకులం అతిథి భవనంలోని టిటిడి అదనపు ఈవో కార్యాలయంలోదాత టీటీడీ అదనపు ఈఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు శ్రీ భరత్ కుమార్, శ్రీనవీన్కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
లాటరీ ఏజెంట్ జాక్‌పాట్.. అమ్ముడుపోని ఆ టికెట్‌తోనే..
అదృష్టం ఎప్పుడు, ఎలా వరిస్తుందో చెప్పలేం. అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతాయి. కేరళకు చెందిన ఎన్కే గంగాధరన్, బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ జీవితాలు అలాగే మారిపోయాయి. కోటీశ్వరులయ్యారు. కేరళలో లాటరీ (Kerala Lottery) ఏజెంట్ అయిన ఎన్‌కె గంగాధరన్, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఫిఫ్టీ ఫిఫ్టీ లాటరీలో అమ్ముడుపోని లాటరీ టికెట్ విజేత నంబర్‌గా మారడంతో అతనికి అదృష్టవశాత్తూ కోటి రూపాయలు వచ్చాయి. ఈ విజయం ఆయన లాటరీ స్టోర్‌కు మొదటిది కావడంతో పాటు మరింత ప్రత్యేకమైనదిగా నిలిచింది. 33 సంవత్సరాలు బస్ కండక్టర్‌గా పని చేసిన గంగాధరన్ ఆ తర్వాత కోజీకోడ్‌లో లాటరీ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న తన దుకాణంలో మొదటి విజేత ఆయనే కావడం గమనార్హం. అమ్ముడుపోకుండా తన మిగిపోయిన లాటరీ టికెట్టే ఆయనకు కోటి రూపాయలను తెచ్చింది. మరో ట్విస్ట్ ఏంటంటే అదే డ్రాలో గంగాధరన్ స్టోర్ నుంచి టిక్కెట్లు కొనుగోలు చేసిన మరో ఆరుగురు కూడా ఒక్కొక్కరూ రూ.5,000 గెలుచుకున్నారు. దీంతో లాటరీ ఏజెంట్‌కి, ఆయన కస్టమర్లకు ఆనందాశ్చర్యాలను కలిగించింది. ఆఫర్లో వచ్చిన టికెట్‌కి రూ. 44 కోట్లు బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ వాటక్కే కోరోత్, అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో 20 మిలియన్ దిర్హామ్‌ల (సుమారు రూ. 44 కోట్లు) గ్రాండ్ ప్రైజ్‌ని గెలుచుకున్నాడు. అయితే మొదట్లో ఇది స్కామ్‌గా భావించిన అరుణ్ నంబర్‌ను కూడా బ్లాక్ చేస్తూ కాల్‌ను డిస్కనెక్ట్ చేశాడు. అరుణ్ కుమార్ 'బై టు గెట్ వన్ ఫ్రీ' ఆఫర్లో ఈ లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. ఆఫర్ కింద వచ్చిన ఆ టికెట్‌కే జాక్‌పాక్ తగిలింది. -
ఈ స్పందన... ఆ బాధను దూరం చేసింది!
♦ ఇంతటి అభిమానాన్ని ఎప్పుడూ చూడలేదు ♦ ‘సాక్షి’తో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ మిథాలీ రాజ్ క్రికెట్‌కు కొత్త కాదు... ఆమె అంతర్జాతీయ కెరీర్‌కే ఇప్పుడు ఓటు హక్కుకున్నంత వయస్సుంది. రికార్డులు, ఘనతలు కూడా ఆమెకు కొత్త కాదు... కానీ ఇన్నేళ్లలో ఎన్నడూ లేనిది అంతా కొత్తగా మారిపోయింది. ఆత్మీయ పలకరింపులు, స్వాగతాలు, అభినందనలు... ఇలా గతంలో ఎన్నడూ మిథాలీకి పెద్దగా పరిచయం లేనివి అన్నీ ఇప్పుడు ఒకేసారి కనిపిస్తున్నాయి. ఇదంతా వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు ప్రదర్శన వల్లే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లండన్ నుంచి మొదలు పెట్టి వయా ముంబై, ఢిల్లీ మీదుగా హైదరాబాద్ చేరిన భారత కెప్టెన్‌కు అన్ని చోట్లా అపూర్వ సత్కారం దక్కింది. నాయకురాలిగా ముందుండి జట్టును ఫైనల్ వరకు నడిపించిన ఈ హైదరాబాదీ, గత వారం రోజులుగా సాగుతున్న సంబరాలను సంతోషంగా ఆస్వాదిస్తోంది. ఒక్క టోర్నీకే కాకుండా ఈ ఆదరణను మున్ముందూ కొనసాగించాలని, మహిళా క్రికెట్‌కు పట్టం కట్టాలని కోరుకుంటోంది. సాక్షి, హైదరాబాద్ ప్రపంచకప్ ఫైనల్ తర్వాత తమ జట్టుకు లభిస్తోన్న ప్రోత్సాహం, ఆదరణను అసలు ఏమాత్రం ఊహించలేదని భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ వ్యాఖ్యానించింది. తమ జట్టు టైటిల్ నెగ్గకపోయినా దేశమంతటా అభిమానులు మద్దతు పలకడం నిజంగా విశేషమని ఆమె అభిప్రాయపడింది. స్వస్థలం చేరుకున్న అనంతరం మిథాలీ శనివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడింది. వరల్డ్ కప్‌లోని కొన్ని ప్రత్యేక క్షణాలు, అనంతర పరిణామాలపై తన మనోభావాలు పంచుకుంది. విశేషాలు ఆమె మాటల్లోనే... ఫైనల్ అనంతరం దక్కుతున్న అభినందనలపై... చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది. దీనిని అసలు ఏమాత్రం ఊహించలేదు. నిజానికి ఫైనల్లో అంత దగ్గరగా వచ్చి ఓడిపోవడంతో నేను ఎంతగానో బాధ పడ్డాను. గుండె పగిలినట్లు అనిపించింది. అంతా కోల్పోయినట్లు పరధ్యానంలో ఉండిపోయాను. కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. అయితే ముంబైలో దిగే సమయంలో విమానాశ్రయంలో మాకు దక్కిన స్వాగతం, పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులను దాటుతూ 3 నిమిషాల ప్రయాణానికి కూడా గంట పట్టడం మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇలాంటి స్పందన మా బాధను దూరం చేసింది. ఫలితంతో సంబంధం లేకుండా దేశమంతా మా వైపు నిలబడటం నా జీవితంలో ఇదే మొదటిసారి. ఓడినా దేశం గర్వపడేలా ప్రదర్శన ఇచ్చామని అంతా చెప్పారు. మా అమ్మాయిలు అందరూ ఆ సమయంలో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. 2005లో కూడా మేం ఇలాగే ఫైనల్ చేరాం. కానీ అప్పుడు ఎలా తిరిగొచ్చామో, అసలు మమ్మల్ని ఎవరు పలకరించారో కూడా గుర్తు లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించడంపై... హైదరాబాద్‌లో కూడా నాకు మొదటిసారి ఈ తరహాలో స్వాగతం దక్కింది. ప్రభుత్వ అధికారులే నేరుగా విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు తీసుకువెళ్లారు. ఆయన చాలా ఆత్మీయంగా పలకరించి నువ్వు హైదరాబాద్ బిడ్డవు అనడం చాలా గర్వంగా అనిపించింది. ఇక నగదు ప్రోత్సాహకం, ఇంటి స్థలం నేను ఊహించలేదు. నిజానికి నాకు గతంలో హామీ ఇచ్చిన ఇంటి స్థలం గురించి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ సమయంలోనే ప్రయత్నాలు చేసీ చేసీ ఇక నా వల్ల కాదని వదిలేశాను. మా అమ్మను కూడా అడగడం మానేయమని చెప్పేశా. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ మూడేళ్లలో దాని గురించి మళ్లీ నా అంతట నేను ఒక్కసారి కూడా ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు సీఎం దానిని ప్రకటించడం ఆనందకరం. ఫైనల్లో పరాజయంపై... పూనమ్, వేద ఆడుతున్నప్పుడు ఇక గెలుపు మాదే అనిపించింది. నిజానికి వేద సహజశైలిలో షాట్లు ఆడుతుంటే కాస్త జాగ్రత్తగా ఆడమని సూచనలు ఇవ్వాలని అనుకున్నా. అయితే ఆ సమయంలో బయటి నుంచి చెప్పడం సులభం. కానీ వరల్డ్ కప్ ఫైనల్లో దానిని అమలు చేయడం కష్టం కాబట్టి అది ఆమెకే వదిలేశా. ఆ ఒత్తిడిలో ఆడటం అంత సులువు కాదు. దురదృష్టవశాత్తూ ఆమె ఈ సవాల్‌ను అధిగమించలేకపోయింది. మున్ముందు అనుభవంతో నేర్చుకుంటుంది. వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డుపై... నేను క్రికెట్ మొదలు పెట్టినప్పుడు ఇంత ముందుకు వెళతానని ఏనాడూ ఊహించలేదు. 18 ఏళ్ల కెరీర్‌ను చూస్తే చాలా గర్వంగా అనిపిస్తోంది. అత్యధిక పరుగుల రికార్డు, 6 వేల పరుగులు దాటిన తొలి క్రీడాకారిణి కావడం, వరుసగా 7 అర్ధ సెంచరీలు చాలా సంతోషాన్ని కలిగించాయి. మరో వరల్డ్ కప్ ఆడటంపై... ఇంత మంచి ప్రదర్శన తర్వాత ప్రపంచకప్ గెలిచి ఉంటే బాగుండేది. ఈ టోర్నీ ప్రారంభమైన నాటి నుంచి ఇదే నా చివరి ప్రపంచ కప్ అని పదే పదే చెబుతూ వచ్చాను. కానీ ఇప్పుడు మళ్లీ ఆలోచించాను. ఈ విషయంలో నేనే తొందరపడి వ్యాఖ్యానించానేమో అనిపిస్తోంది. ఫామ్, ఫిట్నెస్ చూస్తే నేను కనీసం 2–3 ఏళ్లు సునాయాసంగా ఆడగలను. ఇప్పుడే వచ్చే ప్రపంచ కప్‌పై చెప్పలేను గానీ నన్ను నేను ఆశ్చర్యపరిచే నిర్ణయం కూడా తీసుకోవచ్చు! మహిళలకు ఐపీఎల్ నిర్వహించడంపై... నా ఉద్దేశం ఇప్పటికిప్పుడు ఐపీఎల్ పెట్టమని కాదు. ఇప్పుడు మహిళల క్రికెట్‌పై కూడా అందరి దృష్టి నిలిచింది. ఆటగాళ్లను అంతా పేర్లతో సహా గుర్తు పడుతున్నారు. ఇకపై జరిగే మ్యాచ్‌లు చూసేందుకు, స్కోర్లు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే దురదృష్టవశాత్తూ మహిళల క్రికెట్లో దేశవాళీ టోర్నీలు పెద్దగా లేవు. కాబట్టి ప్రపంచకప్‌కు కొనసాగింపుగా వెంటనే ఒక టోర్నీ ఉంటే అది మేలు చేస్తుందనేది నా సూచన. ఐపీఎల్‌లాంటి టోర్నీ ఉంటే నిజంగా బాగుంటుంది. అయితే తుది నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐనే. ♦ గెలిచినా, ఓడినా జట్టుగా మేమంతా ఎంతో ఉత్సాహంగా గడిపాం. హర్మన్ సెంచరీ చేసిన సమయంలో మైదానంలో వినిపిస్తున్న పాటకు అనుగుణంగా నేను, వేద డ్యాన్స్ వేయడం కూడా అలాంటిదే. ♦ నాకు అన్ని రకాల పుస్తకాలు చదివే అలవాటు మొదటి నుంచీ ఉంది. మైదానంలో ఒత్తిడికి లోను కాకుండా, ప్రశాంతంగా స్థితప్రజ్ఞతతో ఉండేందుకు నాకు పుస్తక పఠనం తోడ్పడుతుంది. కెమెరాలు దృష్టి పెట్టడంతో నేను బౌండరీ బయట కూర్చొని చదవడం అందరికీ కనిపించింది. వాటిలో కొన్ని అంశాలు క్రికెట్ పరిజ్ఞానాన్ని కూడా పెంచేవే. -
నిమిషాల్లో కోటి రూపాయలు పోగైంది
ఉడీ ఉగ్రదాడి దేశ ప్రజలకు తీవ్ర ఆగ్రహం, ఆవేశాన్ని కలిగించింది. ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్థాన్ వైఖరిని ఖండిస్తూ.. దాయాదికి తగిన గుణపాఠం చెప్పాలంటూ యావత్ భారతీయులు రగిలిపోయారు. సామాన్యుల నుంచి రాష్ట్రపతి, ప్రధాని వరకు మన జవాన్లకు అండగా నిలిచారు. ఉడీ దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు దేశ ప్రజలు నివాళులు అర్పించి.. వారి కుటుంబాలకు అండగా నిలిచారు. వీర జవాన్లకు నివాళులు అర్పించడానికి గుజరాత్‌లోని సూరత్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. వేదికపై కళాకారులు వీర జవాన్ల సేవలను కీర్తిస్తూ దేశ భక్తి గీతాలు పాడారు. స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై వీర జవాన్ల సేవలను స్మరించుకున్నారు. భారీ మొత్తంలో డబ్బును కళాకారులకు ఇచ్చారు. మొత్తం కోటి రూపాయలకు పైగా డబ్బు పోగైంది. ఈ డబ్బును కళాకారులు, నిర్వాహకులు తీసుకోకుండా ఉదారత చాటుకున్నారు. ఉడీ దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు ఈ డబ్బును అందజేస్తామని కార్యక్రమ నిర్వాహకులు చెప్పారు. త్వరలో వారి కుటుంబాలను కలసి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. సూరత్ ప్రజలు, కళాకారులు, నిర్వాహకుల ఉదారత అందరికీ స్ఫూర్తిదాయకం. -
నిమిషాల్లో కోటి రూపాయలు పోగైంది
-
ఒవైసీ దేశద్రోహి.. నాలుక కట్ చేస్తే కోటి ఇనాం
న్యూఢిల్లీ: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఆయన నాలుక కట్ చేస్తే రివార్డు ఇస్తామని ప్రకటించిన ఏబీవీపీ నేతకు.. మరో బీజీపీ నేత తోడయ్యారు. భారతమాతకు జై అని పలకడానికి నిరాకరించిన అసద్ నాలుకను ఎవరైనా కట్ చేస్తే వారికి కోటి రూపాయల ఇనాం ఇస్తానని ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత శ్యామ ప్రకాష్ ద్వివేది ప్రకటించారు. భారతమాతకు జై పలకడానికి అభ్యంతరమున్న ఒవైసీ ఒక దేశద్రోహి అని అభిప్రాయపడ్డారు. ఆయనకు ఈ దేశంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. భారతమాతను అవమానించిన ఒవైసీ నాలుకను తెగ్గొయ్యాలంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ పని చేసినవారికి ఏకంగా కోటి రూపాయల రివార్డ్ ఇస్తానంటూ వ్యాఖ్యానించి మరో సంచలనం సృష్టించారు. మరోవైపు ఢిల్లీ అశోకా రోడ్డులో ఉన్న ఒవైసీ నివాసం దగ్గర 'దేశద్రోహి' అనే పోస్టర్లు వెలిశాయి. 'నా పీకపై కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనను' అన్న ఒవైసీ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రాజేశాయి. లాతూర్ లో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగించిన ఆయన కొత్త తరానికి భారతమాతను కీర్తిస్తూ నినాదాలు చేయడం నేర్పాలన్న ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భాగవత్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మాటలు అన్నారు. అటు 'భారత్ మాతాకీ జై' అనేందుకు నిరాకరించిన మజ్లిస్ ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌ను మహారాష్ట్ర అసెంబ్లీ సస్పెండ్ చేసింది. -
కోటి రూపాయల ఆఫర్‌ను తిరస్కరించారు!
న్యూఢిల్లీ: ఏడాదికి కోటి రూపాయల జీతమంటే ఐఐటీ విద్యార్థులు ఎగిరిగంతేసేవారు. విదేశాలకు వెళ్లాలనే మోజుతో ఈ ఆఫర్ కోసం వేయి కళ్లతో ఎదురుచూసేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. విదేశాల్లో పనిచేయడం కోసం ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు ఏడాదికి దాదాపు కోటి రూపాయలకు పైగా జీతాన్ని ఆఫర్ చేయగా.. ఢిల్లీ ఐఐటీకి చెందిన నలుగురు విద్యార్థులు తిరస్కరించారు. జీతం కాస్త తక్కువయినా స్వదేశంలో పనిచేసేందుకు మొగ్గుచూపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా' ఈ మార్పునకు కారణమని భావిస్తున్నారు. గూగుల్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రతిష్టాతక కంపెనీలు ప్రతి ఏడాది ఢిల్లీలో ఐఐటీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటాయి. ప్రతిభావంతులైన ఉద్యోగులకు భారీ జీతాన్ని ఆఫర్ చేస్తుంటాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది ఢిల్లీ ఐఐటీకి చెందిన ఎనిమిదిమంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఒక్కొక్కరి జీతం ఏడాదికి దాదాపు కోటి రూపాయలకు పైనే. అయితే నలుగురు విద్యార్థులు ఈ భారీ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్టు ప్లేస్మెంట్ సెల్లో చెప్పారు. అంతర్జాతీయ కంపెనీల్లోనే భారత్‌లో కాస్త తక్కువ జీతంతో పనిచేస్తామని చెప్పారు. విదేశీ కంపెనీలు 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో ఉత్పత్తులు ప్రారంభించడం దేశంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నది దీని లక్ష్యం. -
చెత్త ఏరుకునే మహిళ.. కోట్ల టర్నోవర్ సంస్థకు యజమాని!
కృషి ఉంటే మనుషులు రుషులౌతారన్న మాటలను ఆమె అక్షరాలా నిజం చేసింది. ఆత్మ విశ్వాసంతో సాధించలేనిది లేదన్న సూత్రాన్నీ ఆచరణలో పెట్టింది... ఒకప్పుడు ఐదు రూపాయల సంపాదనకోసం అహ్మదాబాద్ వీధుల్లో చెత్తను ఏరుకుంది. నేడు సంవత్సరానికి కోటి రూపాయల టర్నోవర్ కలిగిన కంపెనీని నిర్వహించే స్థాయికి చేరి... తనవంటి ఎందరికో ఆసరా కల్పిస్తోంది. అహ్మదాబాద్ కు చెందిన అరవై ఏళ్ళ మంజులా వాఘేలా.. కోటిరూపాయల టర్నోవర్ తో నడుస్తున్న క్లీనర్స్ కో ఆపరేటివ్ సంస్థ యజమానిగా మారింది. సౌందర్య సఫాయీ ఉత్కర్ష్ మహిళా సేవా సహకారి మండలి లిమిటెడ్ పేరున ప్రస్తుతం అహ్మదాబాద్ లోని 45 సంస్థలకు ఆమె వర్కర్లను సప్లై చేయడంతోపాటు... క్లీనింగ్, మరియు హౌస్ కీపింగ్ సేవలు అందిస్తోంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థ.. క్లీనర్స్ కో ఆపరేటివ్ సంస్థకు భారత దేశంలో మొట్ట మొదటి అధికారిక ఖాతాదారిగా మారడం ఆమెకు ఎంతగానో కలసి వచ్చింది. అక్కడి నుంచి మంజులా వెనక్కు తిరిగి చూడలేదు. ఇంతింతై.. వటుడింతై అన్న చందంగా ఒక్కో మెట్టూ ఎగబాకుతూ నేడు 45 సంస్థలకు నాలుగు వందల మంది సభ్యులతో తమ సేవలు అందిస్తూ.. కోటి రూపాయల టర్నోవర్ కు చేరుకుంది. ఆ తర్వాత ప్రారంభమైన ఫిజికల్ రీసెర్చ్ లేబొరెటరీ ( పీఆర్ ఎల్ సంస్థ) వాఘేలా సంస్థలోని 15 మంది మహిళలను పనికోసం నియమించుకుంది. తమ సంస్థ నలభైమంది మహిళలతో కొనాసాగుతున్నసమయంలో ఒక్క పీఆర్ ఎల్ సంస్థ 15 మందిని నియమించుకుందని... ఇప్పుడు తమ సంస్థలో నాలుగు వందల మంది సభ్యులున్నారని వాఘేలా చెప్తోంది. ఒకప్పడు చెత్త ఏరుకునే తనవంటి మహిళలను ఇప్పుడు తనద్వారా పలు సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచే వర్కర్లు గా చేర్పించి సేవలు అందిస్తోంది. ఆయా సంస్థల్లో రహదారులు ఊడ్వడం, వాక్యూమ్ క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్, కార్పెట్లను శుభ్రపరిచే మెషీన్లను నడపడం వంటి పనులను వారంతా నిర్వహిస్తున్నట్లు చెప్తున్న వాఘేలా ... నిరాశా నిస్పృహలతో కాలం వెళ్ళదీసే పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. -
సోనాకు రూ.కోటివ్వండి
మే లోపు నటి సోనాకు కోటి రూపాయలు చెల్లించాలని దర్శకుడు వెంక ట్ ప్రభును తమిళ నిర్మాతల మండలి ఆదేశించింది. వివరాల్లో కెళితే.. కుశలన్, అళగర్ మలై, పత్తుపత్తు మొదలగు పలు చిత్రాల్లోవివిధ రకాల పాత్రలు పోషించిన సోనా యూనిక్ ప్రొడక్షన్ అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో చిత్రం నిర్మించతలపెట్టారు. 2009లో చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దర్శకుడు వెంకట్ ప్రభుకు పారితోషికంగా సోనా కోటిన్నర ఇచ్చారు. అయితే ఆ తరువాత వెంకట్ ప్రభు ఆ చిత్రం చేయలేదు. చెల్లించిన పారితోషికం తిరిగి చెల్లించలేదు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. సోనా ఈ విషయమై నడిగర్ సంఘం, తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై సంఘం నేతలు ఇటీవల చర్చిం చారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను నడిగర్ సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, ఇతర నిర్వాహకులతోపాటు సోనా, వెంకట్ ప్రభు ఈ చర్చల్లో పాల్గొన్నట్టు తెలిసింది. సుదీర్ఘ చర్చలానంతరం మే లోపు సోనాకు కోటి రూపాయలు చెల్లించాలని సంఘం నేతలు వెంకట్ ప్రభును ఆదేశించినట్లు తెలిసింది. -
చిట్టిల పేరుతో ఘరానా మోసం
చిట్టిల పేరుతో ఓ మహిళ జనానికి రూ. కోటి కుచ్చు టోపి పెట్టి.... అర్థరాత్రి తట్టా బుట్టా సర్ధుకుని ఉడాయించింది. ఆ ఘటన గుంటూరు జిల్లా బాపట్లలోని రెల్లి కాలనీలో చోటు చేసుకుంది. రెల్లి కాలనీలో నివసిస్తున్న నాంచరమ్మ అనే మహిళ స్థానిక మహిళలతో ఎంతో చనువు, నమ్మకంగా ఉంటూ వారితో చీటీలు కట్టించుకుంటుంది.ఆ క్రమంలో కొంత కాలం వరకు సక్రమంగా చిట్టిల డబ్బులు చెల్లించేది. కొంతకాలం తర్వాత నగదు చెల్లించాలంటూ చిట్టిల కట్టిన సదరు మహిళలు వస్తుండటంతో తర్వాత ఇస్తానంటూ చెబుతు వస్తుంది. దాంతో చిట్టి వేసిన మహిళలు తమకు డబ్బు చెల్లించాలంటూ ఆమెపై ఒత్తిడి చేశారు. దాంతో గత అర్థరాత్రి ఆమె ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది. శుక్రవారం ఆ విషయాన్ని గమనించిన బాధితులు లబోదిబోమంటూ బాపట్ల పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కానిస్టేబుల్ కుటుంబానికి రూ. కోటి పరిహారం