ఏడాదికి కోటి సంపాదన.. ఎవరు మాత్రమే వద్దనుకుంటారు చెప్పండి. దీనికి పలు మార్గాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.. బిజినెస్ చేయొచ్చు. అయితే ఇలాంటి చేయడానికి పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెడితే.. తప్పకుండా లాభాలే వస్తాయని ఖచ్చితంగా చెప్పలేము. నష్టాలు కూడా రావచ్చు. కానీ ఉద్యోగం చేసి కూడా కోటి రూపాయలు సంపాదించడానికి అవకాశం ఉంది. అయితే సంవత్సరానికి కోటి రూపాయల జీతం పొందాలంటే ఎలాంటి కోర్స్ చదవాలి? ఎలాంటి కంపెనీలలో జాబ్స్ తెచ్చుకోవాలి.. అనే విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో ''నాకు తెలుసు ఐటీలో చాలామంది కోట్లలో జీతాలను పొందుతున్నారు. అలాంటి ఉద్యోగాలు వారికి ఎలా దొరుకుతున్నాయనేది నా ప్రశ్న?. నేను ఇంటర్వ్యూలకు గట్టిగా సిద్దమవుతున్నాను. అలాంటి జాబ్స్ కోసం ఎక్కడ వెతకాలి? జాబ్ మార్కెట్‌లో ఏడాది 40 లక్షల కంటే ఎక్కువ జీతం నాకు కనిపించలేదు'' అని ఉంది.
ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ కావడంతో.. పలువురు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంత అదృష్టం కూడా ఉండాలి. నేను కాలిఫోర్నియా బేస్డ్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే.. నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాను. రోజు ఉదయం 9:30 గంటలకు లాగిన్ అయ్యి.. సాయంత్రం 4 గంటలకు లాగవుట్ అవుతాను. ఇలాంటి జాబ్ నా స్నేహితుడు.. ఇండియాలో చేస్తున్నాడు. అతడి జీతం తక్కువ. కాబట్టి నాకు ఈ ఉద్యోగం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.. అని ఓ నెటిజన్ పేర్కొన్నారు.
ఉద్యోగంలో చేరాలి, పని చేయడంలో తనను తానూ నిరూపించుకోవాలి, తొందరగా పదోన్నతులు పొందాలి. అప్పుడే ఎక్కువ జీతం లభిస్తుందని మరో నెటిజన్ అన్నారు. నాకు ఏడాది 10 లక్షల రూపాయలు లభించే ఉద్యోగాలకు సంబంధించిన ఫోన్ కాల్స్ కూడా రావడం లేదని మరో నెటిజన్ వాపోయాడు. ఇలా ఎవరికి తోచిన రీతిలో.. వారు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.
ఎక్కువ జీతాలు అందించే కంపెనీలు
గూగుల్, మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్, అమెజాన్, అడోబ్, ఎన్వీడియా, సిస్కో, జునిపెర్, ఫేస్‌బుక్ మొదలైన కంపెనీలు అత్యధిక వేతనాలు అందించే కంపెనీల జాబితాలో అగ్రగామిగా ఉన్నాయి. ఈ కంపెనీలలో కూడా ఎవరికిపడితే వారికి అధిక వేతనాలు ఉండవు. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.
ఇదీ చదవండి: అలాంటి కార్లు టోల్ గేట్ దాటితే భారీ జరిమానా.. జైలు శిక్ష కూడా!
అర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో నైపుణ్యం ఉండేవారికి ప్రస్తుతం ఎక్కువ జీతాలు లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా ఎండీలు, ఫండ్ మేనేజర్లు, ఆర్కిటెక్చర్లు వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న వారు కూడా ఎక్కువ వేతనాలు పొందవచ్చు. కాబట్టి ఇలాంటి రంగాల్లో ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకునే ఎవరైనా.. రూ. కోటి కంటే ఎక్కువ వేతనం పొందవచ్చు. అమెరికాలో ఉద్యోగం చేసేవారిలో చాలామంది సులభంగా కోటి రూపాయల జీతం పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment