ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌లో ఉద్యోగం అంటే మాటలా. పేరుకు పేరు. డబ్బుకు డబ్బు. కానీ అదే సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి మాత్రం విరక్తి. అందుకే శాలరీ రూ.8 కోట్లు (అంచనా) తీసుకుంటున్నా..ఆ జాబ్‌ను తృణ ప్రాయంగా వదిలేశాడు. నీ సంస్థ వద్దూ.. నువ్విచ్చే జీతం వద్దంటూ రిజైన్ చేశాడు. ప్రస్తుతం ఈ రిజిగ్నేషన్ అంశం యాపిల్‌తో పాటు ఇతర టెక్ సంస్థల్లో చర్చాంశనీయంగా మారింది.
సుధీర్ఘ కాలం తర్వాత ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలతో పాటు ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి చెబుతున్నారు. ఆఫీసుల్లో కంప్యూటర్లతో కుస్తీ పడుతున్నారు. అయితే ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడని ఉద్యోగులు కోట్లలో శాలరీ తీసుకుంటున్నా..ఉన్న ఫళంగా జాబ్ రిజైన్ చేస్తున్నారు. ఆఫీస్‌కు రావాలంటే కుదరదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటే చేస్తాం. లేదంటే జాబ్ రిజైన్ చేస్తామంటూ బాస్‌లకు మెయిల్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీలో మెషిన్ లెర్నింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఇయాన్ గుడ్‌ఫెలో ఆ సంస్థకు భారీ షాక్ ఇచ్చారు. ఆఫీస్ అమలు చేసిన కొత్త రూల్ కారణంగా తన జాబ్‌కు రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆఫీస్‌కు రావాల్సిందే
కరోనా కారణంగా యాపిల్ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేసే వారు. కానీ ఇటీవల సంస్థ తన ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలంటూ పిలుపునిచ్చింది. హైబ్రిడ్ వర్క్ మోడల్ పాలసీని అమలు చేసింది. యాపిల్ కొత్త వర్క్ పాలసీ ప్రకారం.. ఉద్యోగులు ఏప్రిల్ 11నుంచి వారానికి కనీసం ఒక రోజు, ఆఫీస్‌కు వచ్చి పనిచేయాల్సి ఉంటుంది. తర్వాత అది కాస్త మే 2 నుంచి వారానికి రెండు రోజులకు పెరిగింది. ఇప్పుడు, యాపిల్ తన ఉద్యోగులను కనీసం మూడు రోజుల పాటు ఆఫీసుకు తిరిగి రావాలని కోరింది. మే 23 నుంచి వారానికి 5రోజులు పనిచేయాలని కొత‍్త పాలసీలో స్పష్టం చేసింది.
టిమ్‌కుక్‌కు గుడ్‌ఫెలో మెయిల్
ఈ నిర్ణయంపై గుడ్‌ఫెలో అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతుందని, తన టీం సభ్యుల వర్క్ ఫ్లెక్సిబులిటీ తనకు ముఖ్యమని, వాళ్లకి బాగుంటే వర్క్ రిజల్ట్ బాగుంటుందని యాపిల్ సీఈవో టిమ్ కుక్ రాసిన మెయిల్స్ తాను తన జాబ్‌కు ఎందుకు రిజైన్ చేస్తున్నాడో వివరించాడు.
శాలరీ ఎంతంటే!
వెలుగులోకి వచ్చిన ఓ నివేదిక ప్రకారం, గతంలో ఇయాన్ గుడ్‌ఫెలో జీతం సంవత్సరానికి రూ. 6 కోట్ల నుండి రూ. 8 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2016 నుంచి టెస్లాలో పని చేసిన అతని శాలరీ సంవత్సరానికి కనీసం రూ.6 కోట్లుగా ఉందని, టెస్లాకు రిజైన్ చేసిన గూగుల్‌లోకి వెళ్లడంతో అతని శాలరీ పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ఇక 2019లో యాపిల్‌లో చేరిన గుడ్ ఫెలో శాలరీ రూ.6 కోట్ల నుంచి రూ.8కోట్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ వెలుగులోకి వచ్చిన నివేదిక హైలెట్ చేసింది.
చదవండి👉యాపిల్ ఉద్యోగుల సంచలన నిర్ణయం, సీఈఓ టిమ్‌కుక్‌కు భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment