సోనాకు రూ.కోటివ్వండి | Venkat Prabhu to give Rs 1 crore to Sona | Sakshi
Sakshi News home page

సోనాకు రూ.కోటివ్వండి

Published Sun, Apr 19 2015 2:24 AM | Last Updated on Wed, Apr 3 2019 9:16 PM

సోనాకు రూ.కోటివ్వండి - Sakshi

సోనాకు రూ.కోటివ్వండి

 మే లోపు నటి సోనాకు కోటి రూపాయలు చెల్లించాలని దర్శకుడు వెంక ట్ ప్రభును తమిళ నిర్మాతల మండలి ఆదేశించింది. వివరాల్లో కెళితే.. కుశలన్, అళగర్ మలై, పత్తుపత్తు మొదలగు పలు చిత్రాల్లోవివిధ రకాల పాత్రలు పోషించిన సోనా యూనిక్ ప్రొడక్షన్ అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో చిత్రం నిర్మించతలపెట్టారు. 2009లో చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దర్శకుడు వెంకట్ ప్రభుకు పారితోషికంగా సోనా కోటిన్నర ఇచ్చారు. అయితే ఆ తరువాత వెంకట్ ప్రభు ఆ చిత్రం చేయలేదు. చెల్లించిన పారితోషికం తిరిగి చెల్లించలేదు.
 
 దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. సోనా ఈ విషయమై నడిగర్ సంఘం, తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై సంఘం నేతలు ఇటీవల చర్చిం చారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను నడిగర్ సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, ఇతర నిర్వాహకులతోపాటు సోనా, వెంకట్ ప్రభు ఈ చర్చల్లో పాల్గొన్నట్టు తెలిసింది. సుదీర్ఘ చర్చలానంతరం మే లోపు సోనాకు కోటి రూపాయలు చెల్లించాలని సంఘం నేతలు వెంకట్ ప్రభును ఆదేశించినట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement