ది గోట్‌ని ఎంజాయ్‌ చేస్తారు: దర్శకుడు వెంకట్‌ ప్రభు | director Venkat Prabhu about Thalapathy Vijay GOAT movie | Sakshi
Sakshi News home page

ది గోట్‌ని ఎంజాయ్‌ చేస్తారు: దర్శకుడు వెంకట్‌ ప్రభు

Sep 3 2024 1:11 AM | Updated on Sep 3 2024 1:11 AM

director Venkat Prabhu about Thalapathy Vijay GOAT movie

‘‘ది గోట్‌: ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’ సినిమా చిత్రీకరణ ఏడాదిలోపే పూర్తయింది. హాలీవుడ్‌లో అయితే ఈ తరహా సినిమా తీయడానికి ఇంకాస్త ఎక్కువ సమయమే పట్టేది. ఇది పొలిటికల్‌ సినిమా కాదు... పొలిటికల్‌ డైలాగ్స్‌ లేవు. అలాంటి డైలాగ్స్‌ పెట్టమని విజయ్‌ అడగరు’’ అన్నారు దర్శకుడు వెంకట్‌ ప్రభు. విజయ్‌ ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం ‘ది గోట్‌: ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్  గా నటించగా, స్నేహా, ప్రశాంత్, లైలా, ప్రభుదేవా కీలక పాత్రల్లో నటించారు.

వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న రిలీజ్‌ కానుంది. తెలుగు వెర్షన్  ను మైత్రీ మూవీ మేకర్స్‌ రిలీజ్‌ చేస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో బిగ్‌ టికెట్‌ను మైత్రీ నిర్మాత రవిశంకర్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్‌ శశిలకు అందించారు ఏజీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ అర్చనా. అనంతరం దర్శకుడు వెంకట్‌ ప్రభు మాట్లాడుతూ– ‘‘ఏజీఎస్‌ సంస్థలో నా తొలి సినిమా ఇది. సపోర్ట్‌ చేసిన నిర్మాత అర్చనగారికి, ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తున్న మైత్రీవారికి ధన్యవాదాలు. 

ఈ  మూవీని ఆడియన్  ్స ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు. ‘‘గోట్‌’ రిలీజ్‌ కోసం ఏజీఎస్‌తో అసోసియేట్‌ అయిన మైత్రీ మూవీస్‌వారికి థ్యాంక్స్‌. మా ‘గోట్‌’ విజయ్‌గారు’’ అని వెల్లడించారు ఏజీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ అర్చనా కల్పాతి. ‘‘వెంకట్‌ ప్రభుగారు మంచి విజన్   ఉన్న దర్శకుడు. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీగా ‘ది గోట్‌’ రాబోతోంది’’ అని పేర్కొన్నారు ప్రశాంత్‌. మెత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్   శశి మాట్లాడుతూ– ‘‘విజయ్‌గారి ఫ్యాన్  ్స కోసం ఎర్లీ మార్నింగ్‌ షోలను ప్లాన్   చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటులు వైభవ్, ప్రేమ్‌ జీ, నటి లైలా, నిర్మాత అర్చనా కల్పాతి, ఈ సినిమా అసోసియేట్‌ ప్రోడ్యూసర్‌ ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement