నెలకు ₹10 వేలు.. రూ.7 కోట్ల ఆదాయం - ఎలాగంటే? | How To Get Rs 7 Crore For 10000 Rupees Investment Monthly in Sip | Sakshi
Sakshi News home page

నెలకు ₹10 వేలు.. రూ.7 కోట్ల ఆదాయం - ఎలాగంటే?

Published Sat, Dec 21 2024 2:57 PM | Last Updated on Sat, Dec 21 2024 3:54 PM

How To Get Rs 7 Crore For 10000 Rupees Investment Monthly in Sip

డబ్బు ఆదా చేయాలనుకుంటే.. అనేక మార్గాలు కనిపిస్తాయి. కొందరు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తే, మరికొందరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకొందరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జిస్తారు. ఈ కథనంలో నెలకు 10,000 రూపాయలు పెట్టుబడి పెడుతూ రూ. 7కోట్లు సంపాదించడం ఎలా? అనే విషయాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక వ్యక్తి సిప్‌లో నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే.. సంవత్సరానికి అతని పెట్టుబడి రూ.1.2 లక్షలు అవుతుంది. ఇలా 30 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మొత్తం రూ.36 లక్షలు అవుతాయి. మార్కెట్ ఆధారంగా 15 శాతం వార్షిక రాబడి వస్తే.. పెట్టుబడులు భారీగా పెరుగుతాయి. దీంతో ఆ వ్యక్తి ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి అదనంగా రూ. 66 లక్షల కంటే ఎక్కువ డబ్బు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్, అదనంగా వచ్చిన మొత్తం డబ్బు కలిపితే రూ.7 కోట్ల కంటే ఎక్కువ డబ్బు వస్తుంది.

ఇన్వెస్ట్ చేయాలనుకునే వ్యక్తి ముందుగానే పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాలి. ఉదాహరణకు 20 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే.. 50 ఏళ్ల నాటికి రూ.7 కోట్లు పొందవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే దీర్ఘకాలిక పెట్టుబడులలో మాత్రమే భారీ లాభాలు వచ్చే అవకాశం ఉండ్తుంది.

ఇదీ చదవండి: రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటి

నోట్: పెట్టుబడి పెట్టేవారు, ముందుగా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే పెట్టుబడి అనేది ఒకరు ఇచ్చే సలహా కాదు. అది పూర్తిగా మీ వ్యక్తిగతం. కాబట్టి మీ ఆర్థిక ప్రణాళిక కోసం తప్పకుండా నిపుణులను సంప్రదించండి. ఆ తరువాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోండి. అంతే కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఖచ్చితంగా ఇంత డబ్బు వస్తుందని చెప్పలేము. ఎందుకంటే వచ్చే డబ్బు రాబడుల మీద ఆధారపడి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement