ఉద్యోగులకు వేతనాల చెల్లింపు నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాష్ట్రానికి శుక్రవారం రూ.2,400 కోట్ల కొత్త నోట్లను పంపించింది.
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు వేతనాల చెల్లింపు నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాష్ట్రానికి శుక్రవారం రూ.2,400 కోట్ల కొత్త నోట్లను పంపించింది. హైదరాబాద్ నుంచి ఈ డబ్బు రోడ్డు మార్గంలో విశాఖపట్టణం, తిరుపతిలకు చేరేందుకు సమయం పడుతుందనే భావనతో ఆర్థిక శాఖ ఈ రెండు పట్టణాలకు విమనాల్లో డబ్బులను తరలించింది.
హైదరాబాద్ నుంచి టర్బో విమానాల్లో శుక్రవారం విశాఖపట్టణానికి రూ. 240 కోట్లు, తిరుపతికి రూ. 200 కోట్లు చేరవేశారు. ఈ రెండు విమానాలకు చార్జీల రూపంలో ఆర్థిక శాఖ రూ.14 లక్షలు చెల్లించింది. అరుుతే ఆర్‌బీఐ కేటారుుంచిన 2,400 కోట్ల రూపాయలు మొత్తం కొత్త రెండు వేల నోట్లేనని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశారుు.