employee wages
-
ఖజానాకు తాళం
అన్ని బిల్లుల చెల్లింపులను నిలిపివేసిన ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు మినహాయింపు సాక్షి, రంగారెడ్డి జిల్లా: బిల్లుల చెల్లింపులపై ఆంక్షలు విధించారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు అవసరమైన డబ్బులకు మాత్రమే మినహాయింపునిచ్చారు. ఇవిగాక ఇతర ఏ బిల్లులనైనా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. ఆర్థిక సంవత్సరం చివర దశకు చేరుకున్న క్రమంలో కార్యాలయాల నిర్వహణ బిల్లులు వివిధ శాఖలు డ్రా చేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఫ్రీజింగ్ నెలకొనండంతో కొన్ని రోజుల వరకు డబ్బులు పొందే పరిస్థితి కనిపించడం లేదు. మరోపక్క కీలకమైన మధ్యాహ్న భోజన పథకం, వసతి గృహాలకు డైట్ బిల్లులు, ఉద్యో గుల మెడికల్ రియింబర్స్‌మెంట్ తదితర బిల్లుల చెల్లింపుల ప్రక్రియ స్తంభించిపోయినట్లేనని తెలుస్తోంది. నెలన్నరలో 2016–17 ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. ఫ్రీజింగ్ నెలకొనడం అన్ని శాఖలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. తరచూ ఫ్రీజింగ్... గతంలో ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఫ్రీజింగ్ విధించేవారు. కొంతకాలంగా ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. రెండు మూడు నెలలకోసారి ఫ్రీజింగ్ పెట్టడంతో.. బిల్లుల చెల్లింపులు నిలిచిపోతున్నాయి. ఫలితంగా పలు అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతోంది. దీంతో కొన్ని శాఖలు నిర్దిష్ట సమయాల్లోనే బిల్లులు డ్రా చేసుకుంటూ ఫ్రీజింగ్ నుంచి ఊరట పొందుతున్నాయి. తాజాగా మళ్లీ ఫ్రీజింగ్ ఏర్పడడంతో.. చెల్లింపులు ఆగిపోతున్నాయి. ముఖ్యంగా నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు పూర్తిగా స్తంభించిపోతున్నాయి. తద్వారా నిధులు మురిగిపోనున్నాయి. గ్రామ పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనులు, తాగునీటి పథకాలు తదితర బిల్లులు డ్రా చేయాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదని తెలుస్తోంది. -
విశాఖ, తిరుపతికి విమానాల్లో డబ్బులు
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు వేతనాల చెల్లింపు నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాష్ట్రానికి శుక్రవారం రూ.2,400 కోట్ల కొత్త నోట్లను పంపించింది. హైదరాబాద్ నుంచి ఈ డబ్బు రోడ్డు మార్గంలో విశాఖపట్టణం, తిరుపతిలకు చేరేందుకు సమయం పడుతుందనే భావనతో ఆర్థిక శాఖ ఈ రెండు పట్టణాలకు విమనాల్లో డబ్బులను తరలించింది. హైదరాబాద్ నుంచి టర్బో విమానాల్లో శుక్రవారం విశాఖపట్టణానికి రూ. 240 కోట్లు, తిరుపతికి రూ. 200 కోట్లు చేరవేశారు. ఈ రెండు విమానాలకు చార్జీల రూపంలో ఆర్థిక శాఖ రూ.14 లక్షలు చెల్లించింది. అరుుతే ఆర్బీఐ కేటారుుంచిన 2,400 కోట్ల రూపాయలు మొత్తం కొత్త రెండు వేల నోట్లేనని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశారుు. -
మిగులు రూ. 2,076 కోట్లు!
♦ ఉద్యోగుల వేతన నిధులపై రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా ♦ 1.42 లక్షల ఉద్యోగ ఖాళీలు ప్రభుత్వం భర్తీ చేయకపోవడమే కారణం ♦ {పస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల వ్యయంపై సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల వేతనాల కోసం రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో రూ.2,076 కోట్ల మిగులు ఏర్పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలల కాలంలో ఏ రంగానికి ఎంత వ్యయం చేశారు...వచ్చే ఏడాది మార్చి వరకు ఎంత వ్యయం చేయనున్నారనే దానిపై సీఎం చంద్రబాబు ఇటీవల ఆర్థిక శాఖ ఉన్నతాధికారులో సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ 15 పేజీలతో ప్రజెంటేషన్ ఇచ్చింది. ఉద్యోగుల వేతనాల కోసం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.11,827 కోట్లు వ్యయం చేసినట్లు స్పష్టం చేసింది. అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు మరో రూ.16,500 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోసం రూ.30,403 కోట్లు కేటాయించగా ఇందులో రూ.28,327 కోట్లే వ్యయం అవుతుందని, రూ.2,076 కోట్ల మిగులు ఏర్పడుతుందని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ మిగులుకు ప్రధాన కారణం.. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల స్థానంలో కొత్తవారిని నియమించకపోవడంతోపాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న 1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా వేల సంఖ్యలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తొల గించింది. దీంతో వేతనాల కేటాయింపుల్లో ఖర్చులుపోగా మిగులు ఏర్పడుతోంది. జీతాలేతర వ్యయంలోనూ మిగులే జీతాలేతర వ్యయంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.225 కోట్లు మిగులుతాయని ఆర్థికశాఖ అంచనా వేసింది. జీతాలేతర వ్యయానికి బడ్జెట్లో రూ.2,839 కోట్లు కేటాయించారు. దీంట్లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.1,009 కోట్లు ఖరుచ చేయగా, అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు రూ.1,605 కోట్లు ఖర్చవుతుందని అంచనా. -
పేదోళ్ల పెళ్లి ఇక భారమే
ఇందూరు : పేదింటి ఆడ బిడ్డ పెళ్లి తల్లి దండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. మొదట్లో వివిధ కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న పథకం సజావుగానే సాగిన ఇటీవల ఫ్రీజింగ్ గ్రహణం పట్టింది. నిధుల లేమితో ఈ రెండు పథకాలపై 20 రోజుల క్రితం ప్రభుత్వం అంక్షలు విధించింది. దీంతో జిల్లాలో చాలా మంది పెళ్లి చేసుకున్న యువతులకు పెళ్లి సమయానికి రూ.51,000 అందలేదు. పెళ్లి చేసుకున్నాకరుునా వస్తాయకుంటే నిరాశే ఎదురవుతోంది. జిల్లాలో 669 మంది లబ్ధిదారులు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. కార్యాలయూలకు వచ్చే వారికి మాత్రం ఓపిక పట్టాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో కల్యాణలక్ష్మి పథకం కింద ఎస్సీ యువతులు 960 మంది దరఖాస్తులు చేసుకోగా 716 మందికి నిధులు మంజురవగా, కొన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 189 మందికి చెల్లిం చాల్సి ఉంది. ఎస్టీలు 466 మంది దరఖాస్తు చేసుకో గా 348 మందికి మంజూరు చేశారు. 166 మంది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. షాదీ ముభారక్ పథకానికి 1304 మంది దరఖాస్తు చేసుకోగా 990 మందికి నిధులు చేయగా, 314 మంది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే గాని వీరి బిల్లులకు మోక్షం లభించనుంది. మిగతా బిల్లులకూ ఫ్రీజింగ్... కళ్యాణ లక్ష్మి, షాదీముభారక్తో పాటు ప్రభుత్వ శా ఖల బిల్లులన్నింటి మంజూరుకు ప్రభుత్వం బ్రేక్ వేసింది. ఉద్యోగుల వేతనాలు, జీపీఎఫ్, పండుగ అడ్వాన్స్ బిల్లులకు మాత్రమే అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, సరెండర్, ఏరియర్స్, పీఆర్సీ, మెడికల్ రీయింబర్స్, ఇతర బిల్లులకు ఫ్రీజింగ్ విధించింది. దీంతో అన్ని శాఖలకు సంబంధించిన బిల్లులు ఏవీ ట్రెజరీలో పాస్ కావడం లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.. ఉద్యోగుల వేతనాలు, జీపీఎఫ్, పండుగ అడ్వా న్స్ బిల్లులు తప్ప మరే బిల్లులు చేయొద్దని 20 రోజుల క్రితం ప్రభుత్వం నుంచి ఆదేశాలు అం దాయి. వాటి ప్రకారం అనుమతులున్న బిల్లుల ను మాత్రమే మంజూరు చేస్తున్నాం. కల్యాణల క్ష్మి, షాదీముబారక్ బిల్లులు మంజూరు చేయొద్దని సూచించింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే వరకూ బిల్లులు పాస్ చేయం. మాథ్యూస్, ట్రెజరీ ఇన్చార్జ్ డీడీ -
చెల్లింపులకు కళ్లెం!
ప్రభుత్వ ఖజానాపై ఆంక్షలు - ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లే చెల్లింపు - మిగతావి నిలిపివేయాలని స్పష్టీకరణ - జిల్లాలో నిలిచిన అభివృద్ధి పనులు - గ్రామపంచాయతీల్లో గందరగోళం ప్రభుత్వ ఖజానాకు కళ్లెం పడింది. ఉద్యోగుల వేతనాలు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ల పంపిణీ మినహా.. మిగతా చెల్లింపులన్నీ నిలిపివేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు సంబంధించిన చెల్లింపులన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఖజానాపై ఆంక్షలు విధించడం గమనార్హం. గతంలో ఆర్థిక సంవత్సరం చివరలోనో.. లేదా అర్ధవార్షికం ముగింపు సమయాల్లోనే ఇలా ఖజానాపై ఆంక్షలు విధించేవారు. అయితే కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత సకాలంలో బిల్లులు చెల్లిస్తామంటూ చెప్పుకొచ్చిన సర్కారు.. అర్ధంతరంగా ఖజానాపై ఫ్రీజింగ్ విధించడం విశేషం. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా: 2015-16 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలే కావస్తోంది. ఈ సమయంలో కార్యాలయ నిర్వహణతోపాటు ఇతరత్రా చెల్లింపుల్లో కొంత వేగం పెరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖజానాపై ఆంక్షలు పెట్టడంతో వీటన్నింటిపై తీవ్ర ప్రభావమే పడుతోంది. మరోవైపు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉద్యోగులు ముందస్తు చెల్లింపులకోసం బిల్లు పెట్టుకుంటారు. ఇలా దాదాపు వందకుపైగా ఫైళ్లు జిల్లా ఖజానా కార్యాల యంలో ఉన్నాయి. అదేవిధంగా విద్యాసంవత్సరం ప్రారంభంతో స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులుండడంతో ఉద్యోగుల భవిష్యనిధి నుంచి రుణా లు తీసుకునే సమయం కూడా ఇదే. ఇలాంటివి కూడా డీటీఓ వద్ద పెద్ద సంఖ్యలో ఫైళ్లు ఉన్నాయి. తాజాగా ఫ్రీజింగ్ విధించడంతో ఈ చెల్లింపులన్నీ నిలిచిపోయాయి. పనులపై ప్రభావం.. గత వార్షిక సంవత్సరం చివరలో పంచాయతీ శాఖ భారీగా ఆస్తిపన్ను వసూళ్ల డ్రైవ్ చేపట్టింది. ఉద్యోగులు పూర్తిస్థాయి కసరత్తు చేయడంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్లు వసూలయ్యాయి. తాజాగా ఈ నిధులనుంచి పంచాయతీలు పలు కేటగిరీల్లో పనులు చేపట్టగా.. ఖజానాపై ఆంక్షలు విధించడంతో ఈ పనులకు సంబంధించిన చెల్లింపులకు బ్రేకు పడింది. దీంతో గ్రామ పంచాయతీల్లో అయోమయం నెలకొంది. ముక్కుపిండిమరీ ఆస్తి పన్ను వసూలు చేసిన అధికారులు.. స్థానికంగా సమస్యలు పరిష్కరించడంలో తాత్సారం చేస్తున్నారంటూ పలుచోట్ల ప్రజాప్రతినిధులకు నిలదీతలు ఎదురవుతున్నాయి. మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. గత వార్షిక సంవత్సరం పనులు ఇప్పుడిప్పుడే ముగుస్తుండగా.. ప్రస్తుత ఏడాదికి సంబంధించి పనులు ప్రారంభమవుతున్నాయి. బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడంతో ఈ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అదేవిధంగా ప్రభుత్వ వసతిగృహాలకు సంబంధించిన నిర్వహణ, డైట్ చార్టీలు, విద్యార్థుల కాస్మోటిక్ చార్జీలు తదితర కార్యక్రమాలపైనా ఆంక్షల ప్రభావం పడింది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కనిష్టంగా రూ.50కోట్ల చెల్లింపులు నిలిచిపోయినట్లు అంచనా. -
వీరి వేతనాలు ఎంత ఎక్కువో...!
న్యూఢిల్లీ : ఒక కంపెనీ మధ్య స్థాయి ఉద్యోగి పొందే వేతనానికి ఎన్నో రెట్లు ఎక్కువగా ఆ కంపెనీ సీఈఓ వేతనం ఉంటోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వేతనం గత ఏడేళ్లుగా పెరగలేదు. కానీ ఆ కంపెనీలోని మధ్య స్థాయి ఉద్యోగికంటే ఆయనవేతనం 205 రెట్లు అధికం. ఇదే విధమైన తేడాలు పలు కంపెనీల్లో ఉన్నాయి. అయితే కొన్ని కంపెనీల్లో వార్షికంగా ఉద్యోగుల వేతనాలు, కీలకమైన పదవుల్లో ఉండే వ్యక్తుల కంటే బాగా పెరిగాయి. కొన్ని కంపెనీల్లో ఈ వేతనాల పెరుగుదల కీలకమైన పదవుల్లో ఉన్నవారికే అధికంగా ఉంటోంది. కాగా వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ బోనస్‌ను 28 శాతం(రూ.8.85 కోట్లు) పెంచాలని వేదాంత రిసోర్సెస్ ప్రతిపాదిస్తోంది. -
జీతాలు పెరిగాయ్...అవినీతిని తగ్గించండి
ట్రాన్స్‌కో సీఎండీ రఘుమారెడ్డి నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలు భారీగా పెంచింది. పీఆర్సీ 43 శాతం పెంపుతో ఉద్యోగుల జీతాలు రెట్టింపయ్యా యి. గతంలో కంటే మెరుగ్గా ఉద్యోగుల ఆదా యం పెరిగింది. విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అవినీతిని వదిలిపెట్టి బాధ్యత ఎరిగి పనిచేయండి అని ట్రాన్స్‌కో సీఎండీ రఘుమారెడ్డి ఉద్బోధించారు. విద్యుత్ శాఖ నెల వారీ సమీక్షలో భాగంగా శుక్రవారం నల్లగొం డలోని విద్యుత్ శాఖ అతిథి గృహంలో నిర్వహించిన సమావేశానికి ట్రాన్స్‌కో డైరక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భ ంగా సీఎండీ మాట్లాడుతూ...శాఖా పరం గా చోటుచేసుకుంటున్న అవినీతిని తగ్గించాలని ఆదేశించారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో రైతులకు ఇబ్బంది కలగకుండా అం దుబాటులో సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు. మరమ్మతులకు వచ్చిన ట్రాన్స్ఫార్మర్లను 24 గంటల్లో రిపేరు చేసి పంపాలని తెలిపారు. రబీలో చాలా చోట్ల పంటలు సాగుచేశారు కాబట్టి పంటలకు నష్టం కలగకుండా విద్యుత్ సరఫరాలో తగు జాగ్రత్తలు పాటించలన్నారు. వేసవి పరిస్థితి గురించి రై తులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కలి గించాలన్నారు. మున్సిపాలిటీల్లో విద్ద్యుద్ధీకరణ పను లు వేగవంతం చేయాలని, బిల్లుల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ వసూళ్లు మరింత పెంచాలని సీఎండీ ఆదేశించారు. స్టోర్స్ అగ్నిప్రమాదం ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించాలని, స్థానిక పోలీసుల సహకారంతో కేసు విచారణ చేపట్టాలన్నారు. సమావేశంలో ట్రాన్స్ కో ఎస్ఈ బాలస్వామి, డైరక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, విజిలెన్స్ డీఎస్పీ రామచంద్రుడు పాల్గొన్నారు. -
లక్ష్యం సాధించకపోతే వేతనం కట్
భద్రాచలం : గిరిజనుల కోసం అమలు చేసే పథకాల్లో లక్ష్యాలు సాధించని అధికారులు, ఉద్యోగుల వేతనాలు నిలిపివేస్తామని ఐటీడీఏ పీవో దివ్య హెచ్చరించారు. ఇందిరా క్రాంతి పథ ం ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాల పురోగతిపై మంగళవారం స్థానిక సమక్క - సారక్క ఫంక్షన్ హాల్లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పీవో మాట్లాడుతూ ట్రైకార్ యూనిట్లను వెంటనే గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారికి రుణాలు అందేలా చూ డాల్సిన బాధ్యత ఐకేపీ సిబ్బందిపై ఉందని అన్నారు. ఏరియా కో ఆర్డినేటర్లు, ఏపీఎం, క్లస్టర్ కో ఆర్డినేటర్లు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. మహిళా సంఘాల ఇబ్బందులను తెలుసుకునేందుకు నిర్ధేశించిన రో జుల్లో తప్పని సరిగా గ్రామస్థాయిలో సమావేశాలునిర్వహించాలన్నారు. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాలను నమోదు చేసుకుని పరి ష్కారానికి శ్రద్ధ చూపాలన్నారు. రుణాలు ఇప్పించడంతో పాటు వాటిని సకాలంలో తిరిగి బ్యాంకులకు చెల్లించేలా వారిలో అవగాహన కల్పించాలన్నారు. రుణాల మంజూరులో మహి ళా సంఘాల వారు తెలిపే విషయాలను బ్యాం కు అధికారులతో చర్చించాలని పేర్కొన్నారు. రుణాలు మంజూరు, రికవరీ అంశాలపైనే ఉద్యోగులు పనితీరును బేరీజు వేస్తామన్నారు. లక్ష్య సాధనకు సంబంధించి నెలసరి నివేదికలను పరిశీలించి సాధించని ఉద్యోగులకు వేతనాలు నిలిపివేస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని 19 మండలాల్లో గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు మంజూరు చేసిన 711 యూనిట్లను వెంటనే అందజేయాలన్నారు. అర్హులైన వారికి వీటికి మంజూరు చేసి వారి పేర్లను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ‘బంగారుతల్లి’ వివరాలు సేకరించాలి.. బంగారు తల్లి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించాలని పీవో ఆదేశించారు. అర్హులైన వారికి తప్పని సరిగా బిడ్డ పుట్టిన 21 రోజుల్లోగా ఈ పథకం వర్తింపజేయాలన్నారు. బంగారు తల్లి పథకానికి అర్హులను నమోదు చేసుకోవడంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అమృత హస్తం పథకం అమలుకు ఐసీడీఎస్ అధికారులతో సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఇందుకోసం ఐకేపీ, ఐసీడీఎస్ శాఖల అధికారులు తరచూ సమావేశమై పథ కం సమర్థవంత ంగా అమలయ్యేలా చూడాలన్నారు. అర్హులైన వికలాంగులను పింఛన్ కోసం ఎంపిక చేయాలన్నారు. గిరిజన గ్రామాల్లో మహిళా సంఘాలకు సంబంధించిన భూ సమస్యలను పరిష్కరించేందుకు ఐకేపీ సిబ్బంది దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో ఇందిరాక్రాంతి పథం అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారిణి ఆర్ జయశ్రీ, స్త్రీనిధి ఏజీఎం వనిత, ఏపీఎం డైరీ లక్ష్మణ్‌రావు, బ్యాంకు లింకేజీ ఏపీఎం నాగార్జున, ఐబీ ఏపీఎం శ్రీగుణ, పీవోపీ ఏపీఎం అనూరాధ, ఎడ్యుకేషన్ ఏపీఎం శ్రీనివాస్, రామారావుతో పాటు 19 మండలాలకు చెందిన ఏరియా కో ఆర్డినేటర్లు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.