ఇందూరు : పేదింటి ఆడ బిడ్డ పెళ్లి తల్లి దండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. మొదట్లో వివిధ కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న పథకం సజావుగానే సాగిన ఇటీవల ఫ్రీజింగ్ గ్రహణం పట్టింది. నిధుల లేమితో ఈ రెండు పథకాలపై 20 రోజుల క్రితం ప్రభుత్వం అంక్షలు విధించింది. దీంతో జిల్లాలో చాలా మంది పెళ్లి చేసుకున్న యువతులకు పెళ్లి సమయానికి రూ.51,000 అందలేదు. పెళ్లి చేసుకున్నాకరుునా వస్తాయకుంటే నిరాశే ఎదురవుతోంది. జిల్లాలో 669 మంది లబ్ధిదారులు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. కార్యాలయూలకు వచ్చే వారికి మాత్రం ఓపిక పట్టాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో కల్యాణలక్ష్మి పథకం కింద ఎస్సీ యువతులు 960 మంది దరఖాస్తులు చేసుకోగా 716 మందికి నిధులు మంజురవగా, కొన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 189 మందికి చెల్లిం చాల్సి ఉంది. ఎస్టీలు 466 మంది దరఖాస్తు చేసుకో గా 348 మందికి మంజూరు చేశారు. 166 మంది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. షాదీ ముభారక్ పథకానికి 1304 మంది దరఖాస్తు చేసుకోగా 990 మందికి నిధులు చేయగా, 314 మంది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే గాని వీరి బిల్లులకు మోక్షం లభించనుంది.
మిగతా బిల్లులకూ ఫ్రీజింగ్...
కళ్యాణ లక్ష్మి, షాదీముభారక్‌తో పాటు ప్రభుత్వ శా ఖల బిల్లులన్నింటి మంజూరుకు ప్రభుత్వం బ్రేక్ వేసింది. ఉద్యోగుల వేతనాలు, జీపీఎఫ్, పండుగ అడ్వాన్స్ బిల్లులకు మాత్రమే అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, సరెండర్, ఏరియర్స్, పీఆర్‌సీ, మెడికల్ రీయింబర్స్, ఇతర బిల్లులకు ఫ్రీజింగ్ విధించింది. దీంతో అన్ని శాఖలకు సంబంధించిన బిల్లులు ఏవీ ట్రెజరీలో పాస్ కావడం లేదు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి..
ఉద్యోగుల వేతనాలు, జీపీఎఫ్, పండుగ అడ్వా న్స్ బిల్లులు తప్ప మరే బిల్లులు చేయొద్దని 20 రోజుల క్రితం ప్రభుత్వం నుంచి ఆదేశాలు అం దాయి. వాటి ప్రకారం అనుమతులున్న బిల్లుల ను మాత్రమే మంజూరు చేస్తున్నాం. కల్యాణల క్ష్మి, షాదీముబారక్ బిల్లులు మంజూరు చేయొద్దని సూచించింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే వరకూ బిల్లులు పాస్ చేయం.
మాథ్యూస్, ట్రెజరీ ఇన్‌చార్జ్ డీడీ
పేదోళ్ల పెళ్లి ఇక భారమే
Published Mon, Jul 27 2015 4:35 AM | Last Updated on Sun, Sep 3 2017 6:13 AM
Advertisement
Advertisement