Jharkhand: మహిళలకు ఏటా రూ. 12,000 | Jharkhand Governments Special Gift To Women, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Jharkhand: మహిళలకు ఏటా రూ. 12,000

Aug 4 2024 6:52 AM | Updated on Aug 4 2024 7:21 PM

Jharkhand Governments Special Gift to Women

జార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ సర్కారు రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది. వారి సంక్షేమం కోసం నూతన పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 21 నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు ప్రతి సంవత్సరం రూ.12,000 అందజేస్తుంది. ఈ పథకానికి ‘మైయా సమ్మాన్ యోజన’ అని పేరు పెట్టారు. ఈ ఏడాది చివర్లో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు ప్రారంభించింది. అర్హులైన మహిళలను ఎంపిక చేసేందుకు రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి, సామాజిక భద్రత శాఖ పలు ప్రాంతాల్లో క్యాంపులను నిర్వహిస్తోంది. జార్ఖండ్ ఏజెన్సీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ పథకానికి సంబంధించిన పోర్టల్‌ను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని మహిళా, శిశు అభివృద్ధి, సామాజిక భద్రత శాఖ కార్యదర్శి మనోజ్ కుమార్ పేర్కొన్నారు.

రాష్ట్రంలోని సుమారు 50 లక్షల మంది మహిళలకు ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంకింద ప్రయోజనం పొందేందుకు  ఏ ఇతర పెన్షన్ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందని మహిళలు అర్హులు. జార్ఖండ్ నివాసితులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.  దరఖాస్తులను ఆగస్టు 21 నుంచి పోర్టల్ ద్వారా సమర్పించవచ్చని ప్రభుత్వం తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement