లక్ష్యం సాధించకపోతే వేతనం కట్
భద్రాచలం : గిరిజనుల కోసం అమలు చేసే పథకాల్లో లక్ష్యాలు సాధించని అధికారులు, ఉద్యోగుల వేతనాలు నిలిపివేస్తామని ఐటీడీఏ పీవో దివ్య హెచ్చరించారు. ఇందిరా క్రాంతి పథ ం ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాల పురోగతిపై మంగళవారం స్థానిక సమక్క - సారక్క ఫంక్షన్ హాల్‌లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పీవో మాట్లాడుతూ ట్రైకార్ యూనిట్లను వెంటనే గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారికి రుణాలు అందేలా చూ డాల్సిన బాధ్యత ఐకేపీ సిబ్బందిపై ఉందని అన్నారు.
ఏరియా కో ఆర్డినేటర్‌లు, ఏపీఎం, క్లస్టర్ కో ఆర్డినేటర్‌లు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. మహిళా సంఘాల ఇబ్బందులను తెలుసుకునేందుకు నిర్ధేశించిన రో జుల్లో తప్పని సరిగా గ్రామస్థాయిలో సమావేశాలునిర్వహించాలన్నారు. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాలను నమోదు చేసుకుని పరి ష్కారానికి శ్రద్ధ చూపాలన్నారు. రుణాలు ఇప్పించడంతో పాటు వాటిని సకాలంలో తిరిగి బ్యాంకులకు చెల్లించేలా వారిలో అవగాహన కల్పించాలన్నారు. రుణాల మంజూరులో మహి ళా సంఘాల వారు తెలిపే విషయాలను బ్యాం కు అధికారులతో చర్చించాలని పేర్కొన్నారు.
రుణాలు మంజూరు, రికవరీ అంశాలపైనే ఉద్యోగులు పనితీరును బేరీజు వేస్తామన్నారు. లక్ష్య సాధనకు సంబంధించి నెలసరి నివేదికలను పరిశీలించి సాధించని ఉద్యోగులకు వేతనాలు నిలిపివేస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని 19 మండలాల్లో గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు మంజూరు చేసిన 711 యూనిట్లను వెంటనే అందజేయాలన్నారు. అర్హులైన వారికి వీటికి మంజూరు చేసి వారి పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.
‘బంగారుతల్లి’ వివరాలు సేకరించాలి..
బంగారు తల్లి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించాలని పీవో ఆదేశించారు. అర్హులైన వారికి తప్పని సరిగా బిడ్డ పుట్టిన 21 రోజుల్లోగా ఈ పథకం వర్తింపజేయాలన్నారు. బంగారు తల్లి పథకానికి అర్హులను నమోదు చేసుకోవడంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అమృత హస్తం పథకం అమలుకు ఐసీడీఎస్ అధికారులతో సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఇందుకోసం ఐకేపీ, ఐసీడీఎస్ శాఖల అధికారులు తరచూ సమావేశమై పథ కం సమర్థవంత ంగా అమలయ్యేలా చూడాలన్నారు.
అర్హులైన వికలాంగులను పింఛన్ కోసం ఎంపిక చేయాలన్నారు. గిరిజన గ్రామాల్లో మహిళా సంఘాలకు సంబంధించిన భూ సమస్యలను పరిష్కరించేందుకు ఐకేపీ సిబ్బంది దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో ఇందిరాక్రాంతి పథం అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారిణి ఆర్ జయశ్రీ, స్త్రీనిధి ఏజీఎం వనిత, ఏపీఎం డైరీ లక్ష్మణ్‌రావు, బ్యాంకు లింకేజీ ఏపీఎం నాగార్జున, ఐబీ ఏపీఎం శ్రీగుణ, పీవోపీ ఏపీఎం అనూరాధ, ఎడ్యుకేషన్ ఏపీఎం శ్రీనివాస్, రామారావుతో పాటు 19 మండలాలకు చెందిన ఏరియా కో ఆర్డినేటర్‌లు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.