tribal peoples
-
ఆదిలాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన భూమాఫియా
-
‘మా పొట్ట కొట్టకండి సారూ.. గంజాయి పండించుకుంటాం’
మల్కన్‌గిరి(భువనేశ్వర్): జిల్లాలోని చిత్రకొండ సమితి, ధూళిపూట్ పంచాయతీలో గిరిజనుల ప్రజా మేళా సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గత కొద్దిరోజులుగా పోలీసులు ధ్వంసం చేస్తున్న గంజాయి సాగుపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి సాగుతో తమకు ఎంతో కొంత ఉపాధి కలుగుతోందన్నారు. ఇప్పుడు వాటిని అధికారులు నాశనం చేసి, తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో వేరే పంటలు పండించేందుకు చాలా పెట్టుబడి అవుతుందని, అంత స్తోమత తమకు లేదన్నారు. దీంతో పెట్టుబడి అవసరం లేని గంజాయి సాగుపై ఆధారపడి బతుకుతున్నామన్నారు. ఉపాధి అవకాశాలైనా కల్పించాలని, లేకపోతే గంజాయి సాగుకి అనుమతి అయినా ఇవ్వాలని వారు కోరారు. అనంతరం చిత్రకొండ తహసీల్దారు టి.పద్మనాబ్ బెహరాకి వారు వినతిపత్రం అందజేశారు. 85 ఎకరాల గంజాయి సాగు ధ్వంసం మల్కన్‌గిరి జిల్లాలోని చిత్రకొండ సమితి, బోడపోదర్ పంచాయతీలో ఉన్న రేఖపల్లి, పల్సన్‌పోదర్, కుమార్‌గూడ ప్రాంతాల్లో అక్రమంగా 85 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయిని చిత్రకొండ పోలీసులు సోమవారం ధ్వంసం చేశారు. నాశనం చేసిన గంజాయి సాగు విలువ దాదాపు రూ.12 కోట్లు చేస్తుందని పోలీసులు తెలిపారు చదవండి: Karnataka: ఆ ప్రాంతం మరో గోవా కానుంది.. -
ఎట్టకేలకు ఐటీడీఏలో కదలిక
సాక్షి,ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది అడవులు.. గిరిజనులు.. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. అటవిని నమ్ముకుని జీవించే గిరిపుత్రుల అభ్యున్నతికి బాటలు వేయాల్సింది సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ. అటువంటి ఐటీడీఏ మూడేళ్లుగా గిరిజనుల అభ్యున్నతికి ప్రణాళిక రూపొందించలేక పోయింది. ప్రణాళిక రూపొందించినప్పుడే అమలు చేయలేకపోయిన అధికారులు ఇక ప్రణాళిక లేమి కారణంగా ఎంతవరకు అభివృద్ధి చేశారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ నెలలోనే.. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పాలకవర్గ సమావేశం ఈనెల చివరి వారంలో నిర్వహించాలని యోచిస్తున్నారు. చివరిసారిగా 2016 జూలైలో జిల్లాల విభజనకు ముందు ఈ సమావేశం నిర్వహించారు. ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన ఈ సమావేశం నిర్వహించక 36 నెలలు దాటింది. వివిధ దశలో ఆటంకాలు కూడా సమావేశ నిర్వహణకు అడ్డు తగిలాయి. 2016 అక్టోబర్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. ఆదిలాబాద్ జిల్లా విభజనలో కొత్తగా నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ మొత్తం నాలుగు జిల్లాలుగా ఏర్పడ్డాయి. జిల్లాల విభజన తర్వాత సమావేశం జరగలేదు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలో ఆదివాసీ, లంబాడాల మధ్య వివాదంతో కొద్ది నెలల పాటు శాంతిభద్రతల సమస్య ఏర్పడింది. 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు పోవడంతో అసెంబ్లీ రద్దయ్యింది. అప్పట్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీ, ఎమ్మెల్సీ, లోక్‌సభ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వరుసగా రావడంతో కోడ్ అమల్లోనే ఉంది. కోడ్ ముగిసిన తర్వాత ప్రస్తుతం పరిస్థితులు అన్ని అనువుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐటీడీఏ గవర్నింగ్‌బాడి సమావేశ నిర్వహణకు సమాయత్తం అవుతున్నారు. ఉట్నూర్ ఐటీడీఏకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. పీఓగా కృష్ణా ఆదిత్య వ్యవహరిస్తున్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీడీఏ పా లకవర్గ సమావేశ నిర్వహణ కోసం సన్నాహక సమావేశం నిర్వహించారు. నాలుగు జిల్లాల్లో గిరి జనుల కోసం గత 12 క్వార్టర్స్ (36 నెలలు)లో గిరిజనాభివృద్ధికి సంబంధించి నిధులు, ఖర్చులకు సంబంధించి నివేదికలు సమర్పించారు. త్వ రలో సమావేశం నిర్వహించనున్న దృష్ట్యా వీటికి స్పందించి స్పష్టమైన లెక్కలు ఉండాలని చైర్పర్సన్, పీఓ ఆదేశించారు. అయితే గడిచిన 36 నెలలకు సంబంధించి ఖర్చుల లెక్కలే జరగబోయే పాలకవర్గ సమావేశంలో పరిశీలన చేస్తారా.. లేనిపక్షంలో గిరిజనాభివృద్ధి భవిష్యత్ ప్రణాళిక కూడా రూపొందిస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఐటీడీఏనే ఒక ప్రత్యేకం.. ప్రస్తుతం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలుగా ఏర్పడినప్పటికీ ఐటీడీఏ మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ కేంద్రంగానే పనిచేస్తోంది. 2018 మేలో ఐటీడీఏ పీఓగా కృష్ణా ఆదిత్యను ప్రభుత్వం నియమించింది. గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎన్ని ప్రణాళికలు రూపొందించినా వాటిని పూర్తిస్థాయిలో అమలు చేసినప్పుడే వారికి ప్రయోజనం దక్కుతుంది. 1975 ఆగస్టు 1న మొదట ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే హెడ్‌క్వార్టర్‌తో ఐటీడీఏ ఏర్పాటు జరిగింది. 1979లో ఈ హెడ్‌క్వార్టర్‌ను ఉట్నూర్‌కు తరలించడం జరిగింది. దీని అధికార వికేంద్రీకరణ పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని 44 మండలాలతో ఉంది. స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ ఫండ్ దీనికి వస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జియోగ్రాఫికల్ ఏరియా ఆధారంగా 38.13 శాతం ట్రైబల్ సబ్‌ప్లాన్ ఏరియా కిందికే వస్తాయి. ఐటీడీఏ ద్వారా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమే ఈ ప్రత్యేక విభాగం ఏర్పాటు జరిగింది. తద్వారా జిల్లా యంత్రాంగానికి సరిసమానంగా ఇక్కడ ఒక యంత్రాంగం పనిచేస్తుంది. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పర్యవేక్షణలో ఇది పనిచేస్తుంది. విద్య, వైద్య, ఇంజనీరింగ్ ప్రత్యేక విభాగాలు పనిచేస్తాయి. డీఈఓ (ఏజెన్సీ), డిప్యూటీ డైరెక్టర్ (టీడబ్ల్యూ), డీటీడబ్ల్యూవో, అడిషనల్ డీఎంహెచ్ఓ (ట్రైబల్), జిల్లా మలేరియా అధికారి, ఏడీఎంఓ, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈఈ ఉట్నూర్ కేంద్రంగా పనిచేస్తారు. అదే విధంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బోథ్, జైనూర్, కాగజ్‌నగర్, మంచిర్యాల, నిర్మల్, ఉట్నూర్‌లలో ఏటీడబ్ల్యూవోలు క్షేత్రస్థాయిలో ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల నిర్వహణను పర్యవేక్షిస్తుంటారు. ఇంతటి విభాగాలు ఉన్నప్పటికీ మూడేళ్లుగా ప్రణాళిక లేమి కారణంగా గిరిజనాభివృద్ధి సమగ్రంగా జరగడం లేదనేది స్పష్టం. ప్రగతి జరిగేనా.. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా విద్య, వైద్యంలో గిరిజనులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ముఖ్య లక్ష్యం. ఇంజినీరింగ్ శాఖ ద్వారా ఏజెన్సీ మండలాల్లో రహదారుల నిర్మాణం, జీపీ భవనాలు, ఎంఎంఎస్ బిల్డింగ్‌ల నిర్మాణం, ఇతరత్ర విస్తృతంగా చేపట్టాలి. మూడేళ్లుగా ప్రణాళిక లేక సాగిపోతోంది. ప్రస్తుతం నాలుగు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం జరిగింది. అంతేకాకుండా పాలకవర్గ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు కలిసి ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చతో పాటు గిరిజనుల అభివృద్ధికి తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపిస్తారు. తద్వారా గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే వీలుంటుంది. ఎల్టీఆర్–1959 యాక్ట్, 1970 రెగ్యులరైజేషన్ ప్రకారం గిరిజనేతరుల నుంచి అటువంటి భూములను స్వాధీనం చేసుకొని తిరిగి గిరిజనులకే అప్పగించాలి. అలాంటి కేసులు ఏజెన్సీ మండలాల్లో అనేకంగా పెండింగ్ ఉన్నాయి. వీటికోసం ప్రత్యేకంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఐటీడీఏలో ఉందంటే ప్రాధాన్యత గ్రహించాలి. అదేవిధంగా గిరిజన ఉత్పత్తులకు సంబంధించి విక్రయించుకునేందుకు గిరిజన కోఆపరేటీవ్ కార్పొరేషన్ లిమిటెడ్ పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ లిమిటెడ్ ద్వారా గిరిజనులకు సరైన ఆదరణ లభించడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరింత చొరవ తీసుకొని గిరిజన ఉత్పత్తులకు ఆదరణ లభించేలా చూడాలి. తద్వారా గిరిజనులకు ఆదాయం లభిస్తుంది. సీసీడీపీ నిధులతో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది. వెంటాడుతున్న సమస్యలు.. గిరిజనులకు సమస్యలు వెంటాడుతున్నాయి. సీజనల్ వ్యాధులు, ప్రాణాంతక వ్యాధులు, రక్తహీనత గిరి జనాల ప్రాణాలను హరిస్తున్నాయి. సర్వేలో విద్యార్థులకు సికిల్సిల్, తలసేమియా వ్యాధులు బయటపడ్డాయి. అదేవిధంగా నేటికీ ఏజెన్సీ గ్రామాలకు సరైన రవాణ సదుపాయాలు లేవు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నార్నూర్ మండలంలో రోడ్లు తెగిపోయి అత్యవసర పరిస్థితుల్లో గిరిజనులు పడిన ఇబ్బందులు అవగతమే. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ విభాగం ద్వారా ఏజెన్సీ మండలాల్లో రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది. నివేదికలు సిద్ధం చేసుకోవాలి ట్రైబల్ సబ్‌ప్లాన్‌కు సంబంధించి వివిధ శాఖల ద్వారా ఈ మూడేళ్ల కేటాయింపులను వివరంగా తీసుకురావాలని సూచించడం జరిగింది. ట్రైకార్‌కు సంబంధించి ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో యూనిట్లను గ్రౌండింగ్ చేయడం జరుగుతుంది. ఎల్టీఆర్ కేసులకు సంబంధించి వివరాలను కూడా పాలకవర్గ సమావేశంలో చర్చిస్తాం. నాలుగు జిల్లాల అధికారులు పూర్తి సమాచారం సిద్ధం చేసుకోవాలి. – కృష్ణా ఆద్యిత, పీఓ, ఐటీడీఏ, ఉట్నూర్ -
లక్ష్యం సాధించకపోతే వేతనం కట్
భద్రాచలం : గిరిజనుల కోసం అమలు చేసే పథకాల్లో లక్ష్యాలు సాధించని అధికారులు, ఉద్యోగుల వేతనాలు నిలిపివేస్తామని ఐటీడీఏ పీవో దివ్య హెచ్చరించారు. ఇందిరా క్రాంతి పథ ం ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాల పురోగతిపై మంగళవారం స్థానిక సమక్క - సారక్క ఫంక్షన్ హాల్లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పీవో మాట్లాడుతూ ట్రైకార్ యూనిట్లను వెంటనే గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారికి రుణాలు అందేలా చూ డాల్సిన బాధ్యత ఐకేపీ సిబ్బందిపై ఉందని అన్నారు. ఏరియా కో ఆర్డినేటర్లు, ఏపీఎం, క్లస్టర్ కో ఆర్డినేటర్లు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. మహిళా సంఘాల ఇబ్బందులను తెలుసుకునేందుకు నిర్ధేశించిన రో జుల్లో తప్పని సరిగా గ్రామస్థాయిలో సమావేశాలునిర్వహించాలన్నారు. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాలను నమోదు చేసుకుని పరి ష్కారానికి శ్రద్ధ చూపాలన్నారు. రుణాలు ఇప్పించడంతో పాటు వాటిని సకాలంలో తిరిగి బ్యాంకులకు చెల్లించేలా వారిలో అవగాహన కల్పించాలన్నారు. రుణాల మంజూరులో మహి ళా సంఘాల వారు తెలిపే విషయాలను బ్యాం కు అధికారులతో చర్చించాలని పేర్కొన్నారు. రుణాలు మంజూరు, రికవరీ అంశాలపైనే ఉద్యోగులు పనితీరును బేరీజు వేస్తామన్నారు. లక్ష్య సాధనకు సంబంధించి నెలసరి నివేదికలను పరిశీలించి సాధించని ఉద్యోగులకు వేతనాలు నిలిపివేస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని 19 మండలాల్లో గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు మంజూరు చేసిన 711 యూనిట్లను వెంటనే అందజేయాలన్నారు. అర్హులైన వారికి వీటికి మంజూరు చేసి వారి పేర్లను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ‘బంగారుతల్లి’ వివరాలు సేకరించాలి.. బంగారు తల్లి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించాలని పీవో ఆదేశించారు. అర్హులైన వారికి తప్పని సరిగా బిడ్డ పుట్టిన 21 రోజుల్లోగా ఈ పథకం వర్తింపజేయాలన్నారు. బంగారు తల్లి పథకానికి అర్హులను నమోదు చేసుకోవడంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అమృత హస్తం పథకం అమలుకు ఐసీడీఎస్ అధికారులతో సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఇందుకోసం ఐకేపీ, ఐసీడీఎస్ శాఖల అధికారులు తరచూ సమావేశమై పథ కం సమర్థవంత ంగా అమలయ్యేలా చూడాలన్నారు. అర్హులైన వికలాంగులను పింఛన్ కోసం ఎంపిక చేయాలన్నారు. గిరిజన గ్రామాల్లో మహిళా సంఘాలకు సంబంధించిన భూ సమస్యలను పరిష్కరించేందుకు ఐకేపీ సిబ్బంది దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో ఇందిరాక్రాంతి పథం అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారిణి ఆర్ జయశ్రీ, స్త్రీనిధి ఏజీఎం వనిత, ఏపీఎం డైరీ లక్ష్మణ్‌రావు, బ్యాంకు లింకేజీ ఏపీఎం నాగార్జున, ఐబీ ఏపీఎం శ్రీగుణ, పీవోపీ ఏపీఎం అనూరాధ, ఎడ్యుకేషన్ ఏపీఎం శ్రీనివాస్, రామారావుతో పాటు 19 మండలాలకు చెందిన ఏరియా కో ఆర్డినేటర్లు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు. -
సమ్మక్క-సారక్క స్ఫూర్తితో ఉద్యమించాలి
ఏటూరునాగారం, న్యూస్‌లైన్ : ఆదివాసీలు స్వయం పాలనను సాధిం చుకునేందుకు సమ్మక్క-సారలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలని ఆదివాసీ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పశ్చిమగోదావరి జిల్లా బాధ్యుడు మడకం వెంకటేశ్వర్రావు పిలుపునిచ్చారు. ఆదివాసీ సేన ద్వితీయ మహాసభలు, బహిరంగ సభ ఏటూరునాగారంలోని కొమురంభీం మినీ స్టేడియంలో మంగళవారం ఆదివాసీ సేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మడి రాంచందర్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కణితి లక్ష్మణ్‌రావు, మండకం వెంకటేశ్వర్రావు హాజరయ్యారు. లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ ఆదివాసీల సమస్యలు పరిష్కరించడంతో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. అగ్రకులాలు, పెట్టుబడిదారులు ఆదివాసీ ప్రజానీకాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపంచారు. 2008లో స్థాపించిన ఆదివాసీ సేన ఉద్యమ ఫలితంగానే కొన్ని చట్టాలు అమలవుతున్నాయన్నారు. పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. కేసులకు వెనకాడేది లేదు.. ఆదివాసీల హక్కుల సాధన కోసం పోరాడినందుకు తనపై ప్రభుత్వం 150 కేసులు పెట్టి, ఆరేళ్లు జైలు పాలు చేసిందని, అయినా ఆదివాసీల కోసం పోరాడుతూనే ఉంటానని వెంకటేశ్వర్రావు స్పష్టం చేశారు. ఈ పోరాటం ఫలితంగానే పశ్చిమగోదావరి జిల్లాలో 20 వేల ఎకరాల భూమిని ఆదివాసీలకు పంచారన్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మల త్యాగ ఫలాలు ఆదివాసీలకే చెందాలన్నారు. ఈ సందర్భంగా వనదేవతల పోరాట స్ఫూర్తిని కొనియాడారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు కాదని.. ఆదివాసీల హక్కన్నారు. దాన్ని ప్రభుత్వం అడ్డగోలుగా పెట్టుబడిదారులకు కట్టబెట్టాలని చూస్తోందని ఆరోపించారు. పుస్తకాల్లో కనిపించని ఆదివాసీల చరిత్ర పుస్తకాల్లో ఆదివాసీలు, కొమురంభీం లాంటి మహానేతల చరిత్రను ఎందుకు ప్రచురించడం లేదని వెంకటేశ్వర్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించా రు. దేశ దోహ్రుల చరిత్రను మాత్రం పుస్తకాల్లో అచ్చు వేయిస్తున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ఆదివాసీ ప్రాంతాలను ఏకం చేస్తూ స్వయం పరిపాలన ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, బాక్సైట్ వెలికితీత, కవ్వాల టైగర్ జోన్, ఓపెన్ కాస్టులు, ఎలిఫెంట్ జోన్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు.. ఇవన్నీ ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసకాండ అని ధ్వజమెత్తారు. ఆదివాసీలకు భూమి, అడవికి మధ్య విడదీయరాని బంధం ఉందన్నారు. స్వయం పాలన సాధించే వరకూ పోరాటాలను వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వరంగల్ బహుజన సంస్కృతిక సమాఖ్య సంఘం కళాకారులు ఉద్యమ గీతాలను ఆలపించారు. మం డలంలోని చింతలపాడుకు చెందిన గొత్తికోయ మహిళలు వారి భాషలో పాటలు ఆలపిం చారు. సభలో ఆదివాసీ సేన ఆదిలాబాద్ బాధ్యతులు తొడసం ప్రభాకర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కల్మి సంపత్, విశాఖ బాధ్యులు మండే గురుస్వామి, ఆదివాసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు మడి సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శి ముక్తి సాంబశివరావు, వరంగల్ జిల్లా కార్యదర్శి వాసం లింగయ్య, నాయకులు గొం ది కిరణ్, మైపతి సంతోష్ పాల్గొన్నారు. -
జ్వరాలతో అల్లాడుతున్న గిరిజనం
ఖానాపూర్, న్యూస్‌లైన్ : జ్వరాలతో గిరిజనులు మంచం పట్టారు. మండలంలోని మారుమూల అటవీ గిరిజన గ్రామాలైన పస్పుల పంచాయతీ పరిధి పుల్గంపాండ్రి, కొలాంగూడ గ్రామాల్లోని గిరిజనులు జ్వరాలతో అల్లాడుతున్నారు. గ్రామంలో ఐదేళ్లలోపు ఉన్న ఆత్రం రజిత, ఆత్రం రమేశ్, ఆత్రం సంగీత, ఆత్రం రాధతోపాటు పెద్దలు ఆత్రం జంగు, రజితబాయి, కొమురం చిన్ను తదితరులు 20 మందికిపైగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. సమీపంలోని పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన వైద్యం అందించకపోవడం.. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేరుుంచుకునే ఆర్థిక స్థోమత లేక ఇళ్ల వద్దే జ్వరాలతో మంచం పట్టారు. 15 రోజుల క్రితం తీవ్ర జ్వరంతో ఇదే పంచాయతీ పరిధిలోని చింతగూడకు చెందిన శ్రీకాంత్(8) మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ గ్రామాల చుట్టూ అడవులుండడం.. గ్రామాల్లో పారిశుధ్యం లోపించడంతో దోమలు ఎక్కువై మలేరియూ, టైఫారుుడ్ తదితర జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించి జ్వరంతో బాధపడుతున్నవారికి చికిత్స అందించాలని కోరుతున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగునకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.