జ్వరాలతో అల్లాడుతున్న గిరిజనం | tribal peoples faced problems with fever | Sakshi
Sakshi News home page

జ్వరాలతో అల్లాడుతున్న గిరిజనం

Published Wed, Nov 6 2013 4:30 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM

tribal peoples faced problems with fever

ఖానాపూర్, న్యూస్‌లైన్ :  జ్వరాలతో గిరిజనులు మంచం పట్టారు. మండలంలోని మారుమూల అటవీ గిరిజన గ్రామాలైన పస్పుల పంచాయతీ పరిధి పుల్గంపాండ్రి, కొలాంగూడ గ్రామాల్లోని గిరిజనులు జ్వరాలతో అల్లాడుతున్నారు. గ్రామంలో ఐదేళ్లలోపు ఉన్న ఆత్రం రజిత, ఆత్రం రమేశ్, ఆత్రం సంగీత, ఆత్రం రాధతోపాటు పెద్దలు ఆత్రం జంగు, రజితబాయి, కొమురం చిన్ను తదితరులు 20 మందికిపైగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. సమీపంలోని పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన వైద్యం అందించకపోవడం.. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేరుుంచుకునే ఆర్థిక స్థోమత లేక ఇళ్ల వద్దే జ్వరాలతో మంచం పట్టారు.

15 రోజుల క్రితం తీవ్ర జ్వరంతో ఇదే పంచాయతీ పరిధిలోని చింతగూడకు చెందిన శ్రీకాంత్(8) మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ గ్రామాల చుట్టూ అడవులుండడం.. గ్రామాల్లో పారిశుధ్యం లోపించడంతో దోమలు ఎక్కువై మలేరియూ, టైఫారుుడ్ తదితర జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించి జ్వరంతో బాధపడుతున్నవారికి చికిత్స అందించాలని కోరుతున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగునకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement