sreekanth
-
కరెంటుపై కరోనా ఎఫెక్ట్
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగంపైనా కరోనా ప్రభావం పడింది. గృహ విద్యుత్ వినియోగంలోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. శీతల ప్రాంతాల్లో ఉంటే వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుందనే ప్రచారం నేపథ్యంలో ఏసీల వాడకం చాలా వరకూ తగ్గించారు. గ్రామీణ ప్రజలైతే మిట్ట మధ్యాహ్నం తప్ప మిగిలిన సమయాల్లో ఇంటి ఆవరణలో చెట్ల కిందే ఉంటున్నారని అనంతపురం జిల్లా ఎలక్ట్రికల్ ఏఈ చక్రధర్ తెలిపారు. అక్కడక్కడా ఫ్రిజ్‌లు కూడా ఆపేశారు. చల్లటి పదార్థాలు, కూలింగ్ వాటర్‌కు సైతం దూరంగా ఉంటున్నారు. దేశమంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. లాక్డౌన్ నాటి నుంచీ.. ► రాష్ట్రంలో విద్యుత్ వినియోగం సాధారణంగా రోజుకు 170 మిలియన్ యూనిట్లు కాగా.. ఏప్రిల్, మే నెలల్లో గరిష్టంగా 210 మిలియన్ యూనిట్లు దాటుతుందని అంచనా. ► కానీ.. ప్రస్తుతం రోజుకు సగటున 160 మిలియన్ యూనిట్లు దాటడం లేదు. గృహ వినియోగం 20 శాతం పైగా తగ్గింది. ► రాష్ట్రంలో 1.45 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. ఇందులో 92.24 లక్షల మంది గృహ వినియోగదారులే. ► గృహ విద్యుత్ వినియోగం రోజుకు 58 మిలియన్ యూనిట్లు ఉంటుంది. ఇందులో చాలా ఇళ్లల్లో నెలవారీ విద్యుత్ వినియోగం 100 యూనిట్ల లోపే. ► నెలకు 225 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలు 43.56 లక్షల వరకు ఉండగా.. కుటీర పరిశ్రమలు సైతం ఇందులోనే ఉన్నాయి. ► కుటీర పరిశ్రమలు కూడా నడవడం లేదు కాబట్టి ఈ కేటగిరీ విద్యుత్ వాడకం తగ్గింది. ► పరిశ్రమలు, వాణిజ్య వినియోగ కనెక్షన్లు 10 లక్షల వరకూ ఉన్నాయి. ఈ రెండు కేటగిరిల్లో వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. డిమాండ్ పడిపోతోంది ఏప్రిల్‌లో రోజుకు 210 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనా వేశాం. పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు ఆగిపోగా.. గృహ విద్యుత్ వినియోగం తగ్గింది. అన్ని కేటగిరీల్లోనూ ఈ మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. – శ్రీకాంత్ నాగులాపల్లి,విద్యుత్ శాఖ కార్యదర్శి -
అత్తింటి వారి వేధింపుల వల్లే కుమారుడు బలి
సాక్షి, సిటీబ్యూరో: ప్రేమ–పెళ్లి..వీటితో పాటే వివాదం. సిటీలో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. బుధవారం కన్నతండ్రే కూతురు, అల్లుడిపై కత్తితో దాడికిపాల్పడగా...గురువారం ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య దూరం కావటాన్ని జీర్ణించుకోలేని శ్రీకాంత్అనే యువకుడు సంతోష్నగర్రక్షాపురంలో సెల్ఫీలో సూసైడ్ డిక్లరేషన్ ఇచ్చి..తనకు తానే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వైనం అందరిలో విషాదాన్ని నింపింది. ఇదిలా ఉంటే బోరబండలో నివాసం ఉంటూ ప్రేమ వివాహం చేసుకుని కన్న తండ్రి చేతిలో కత్తిపోట్లకు గురైన మాధవి యశోద ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఎడమ చెయ్యి పూర్తిగా తెగిపోగా చెవి, దవడ భాగంతో పాటు గుండె నుండి మెదడుకు రక్తాన్ని తీసుకుపోయే నాలాలు తెగిపోయాయి. ఎనిమిది గంటల పాటు ప్రత్యేక వైద్యుల బృందం శస్త్ర చికిత్సలు చేసి ఆమె ప్రాణాలను కాపాడేందుకు శత ప్రయత్నాలు చేస్తోంది. వైద్యానికి ఆమె శరీరం సహకరిస్తుందని, మరో 36 గంటలు గడిస్తే కానీ పూర్తి భరోసా ఇవ్వలేమని వైద్యులు పేర్కొనటంతో ఆమె బంధువులు, సన్నిహితుల్లో ఆందోళన నెలకొంది. కుటుంబాలు..చెల్లా చెదురు బుధ, గురువారాల్లో నగరంలో చోటు చేసుకున్న ప్రేమ–పెళ్లి –వివాదాల నేపథ్యంలో నాలుగు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కూతురు మాధవిపై దాడికి పాల్పడ మనోహరచారిని పోలీసులు జైలుకు పంపగా, కూతురు ఆస్పత్రిలో, భార్య లక్ష్మి, కొడుకు నవీన్‌లు ఇళ్లు వదిలి ఇతర ప్రాంతానికి వెళ్లిపోయారు. కన్నకూతురు చావూ బతుకుల మధ్య ఉన్నా చూడలేక తమ ఇంటి పక్క వారికి తరచూ ఫోన్లు చేస్తూ బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తున్నట్లు తెలిసింది. మాధవి, సందీప్ కుటుంబాలు నిరుపేదవే కావటం, ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఫీజు లేకుండానే యశోద వైద్యులు అధునాతన వైద్యాన్ని అందజేస్తున్నారు. ఇక పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్ కుటుంబం సైతం పెద్ద దిక్కును కోల్పోయింది. బీ ఫార్మసీ చదువుకున్న తన కొడుకు ఉన్నత ఉద్యోగంలో చేరి తమకు అండగా ఉంటాడనుకుంటే..ఇలా అందరి ముందే అగ్నికి ఆహుతి అవుతాడనుకోలేదంటూ ఆయన తండ్రి ముత్యాలు రోదనలు అందరినీ కలిచివేశాయి. ఈ రెండు ఘటనలు వెను వెంటనే చోటు చేసుకోవటంతో నగరంలో ఎవరినోట విన్నా ప్రేమ– పెళ్లి– వివాదాలకు సంబంధించిన చర్చలే వినిపిస్తున్నాయి. అత్తింటి వారి వేధింపుల వల్లే మా కుమారుడు బలి– శ్రీకాంత్ తల్లిదండ్రుల ఆరోపణ సుల్తాన్‌బజార్: ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న తన కుమారుడి మరణానికి అతని అత్తింటి వారే కారణమని ఆత్మహత్యకు పాల్పడిన శ్రీకాంత్ తండ్రి ముత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ మేరకు బుధవారం ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చురీ వద్ద వారు విలేకరులతో మాట్లాడారు. తమ కుమారుడు శ్రీకాంత్ ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీహర్ష తండ్రి షణ్ముకచారి తమపై పగబట్టాడని ఆరోపించారు. పోలీసు కేసులతో తమ కుటుంబాన్ని వేధించడం, తమ కోడలిని ఇంటికి రానివ్వకుండా చేయడంతో మనస్థాపం చెంది తమ కుమారుడు శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపించారు. ప్రేమించిన భార్యతో పాటు అతని అత్తమామల మోసం వల్ల మనోవేదనకు గురైన శ్రీకాంత్...సామాజిక మధ్యంలో తన చావుకు తన మామతో సహా అతని కుటుంబ సభ్యులు కారణమని సూసైడ్‌నోట్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు బోరున విలపించారు. ఇలాంటి అన్యాయం మరొకరికి జరగకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. తమ కుటుంబానికి షణ్ముకచారి, అతని కుటుంబసభ్యులతో ప్రాణాహాని ఉందని తమకు రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో శ్రీకాంత్ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం అతని స్వగ్రామానికి పంపించారు. ఈ మేరకు సంతోష్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ పెళ్లి.. భార్యను దూరం చేశారని..
-
సాగర్ కెనాల్లో పడి యువకుడి మృతి
గరిడేపల్లి: నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కుత్బుషాపురం బ్రిడ్జి వద్ద బైక్ అదుపుతప్పిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన శ్రీకాంత్ బీటెక్ చదువుతూ... నేరేడుచర్లలో ఓ పెట్రోల్ బంక్‌లో పార్ట్ టైమ్ గా పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున బైక్‌పై వెళుతూ అదుపుతప్పి సాగర్ కెనాలో పడిపోవడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సత్తెనపల్లిలో ప్రేమజంట ఆత్మహత్య
సత్తెనపల్లి: తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరని ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. కలిసి బతకలేక పోయినా చావులోనైనా కలిసే ఉందామని నిర్ణయించుకున్న ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా ప్రియుడు అక్కడికక్కడే మృతిచెందగా, ప్రియురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాలెం గ్రామ శివారులోని పంట కాలువ వద్ద బుధవారం తెల్లవారుజామున వెలుగు చూసింది. వివరాలు.. ముప్పాళ్ల మండలం తొండపి గ్రామానికి చెందిన ఎర్ర శ్రీకాంత్(22), అచ్చంపేట మండలం గ్రందసిరి గ్రామానికి చెందిన భువనేశ్వరి(19) ప్రేమించుకున్నారు. ఇది తెలిసిన కుటుంబ సభ్యులు చదువు మానిపించి ఇంటికే పరిమితం చేశారు. కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు తమ పెళ్లికి ఒప్పుకోరని నిర్ణయించుకున్న ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఇద్దరు మంగళవారం రాత్రి రెంటపాలెం చేరుకొని వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగారు. దీంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందగా.. భువనేశ్వరి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. బుధవారం ఉదయం గుర్తించిన స్థానికులు ఆమెను సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భువనేశ్వరి కొద్ది సేపటి క్రితం మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పు కట్టకుండా.. దంపతులను హత్య చేశాడు
-
చిత్రమైన సవాల్
‘‘శ్రీకాంత్ మినిమమ్ గ్యారంటీ హీరో. అతని సినిమాలకు శాటిలైట్ హక్కులు బాగా వస్తాయి. అందుకే, శ్రీకాంత్ హీరోగా సినిమా చేయబోతున్నానని జొన్నలగడ్డ శ్రీనివాసరావు అనగానే, ‘గో ఎ హెడ్’ అన్నాను. ‘ఢీ’ విజయవంతమైన టైటిల్ కాబట్టి, ఈ చిత్రం జొన్నలగడ్డకి మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని దాసరి నారాయణరావు చెప్పారు. శ్రీకాంత్, సోనియామాన్ జంటగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో సీఎన్ రెడ్డి, జి. జ్యోతిక నిర్మిస్తున్న చిత్రానికి‘ఢీ అంటే ఢీ’ టైటిల్‌ని ఖరారు చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దాసరి ఈ టైటిల్‌ని ప్రకటించారు. రెండు డ్యూయెట్లు, ఓ ఐటమ్ సాంగ్ చిత్రీకరించడంతో సినిమా పూర్తవుతుందని జొన్నలగడ్డ చెప్పారు. శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రకథకు తగ్గ టైటిల్ కుదిరింది. కథ వినగానే తప్పకుండా విజయవంతమైన చిత్రం అవుతుందనిపించింది’’ అన్నారు. చిత్రమైన సవాల్‌తో ఢీ అంటే ఢీ అనేలా సినిమా ఉంటుందని మాటల రచయిత రాజేంద్రకుమార్ చెప్పారు. ఈ చిత్రానికి కథ: భూపతిరాజా,సంగీతం: చక్రి. -
జ్వరాలతో అల్లాడుతున్న గిరిజనం
ఖానాపూర్, న్యూస్‌లైన్ : జ్వరాలతో గిరిజనులు మంచం పట్టారు. మండలంలోని మారుమూల అటవీ గిరిజన గ్రామాలైన పస్పుల పంచాయతీ పరిధి పుల్గంపాండ్రి, కొలాంగూడ గ్రామాల్లోని గిరిజనులు జ్వరాలతో అల్లాడుతున్నారు. గ్రామంలో ఐదేళ్లలోపు ఉన్న ఆత్రం రజిత, ఆత్రం రమేశ్, ఆత్రం సంగీత, ఆత్రం రాధతోపాటు పెద్దలు ఆత్రం జంగు, రజితబాయి, కొమురం చిన్ను తదితరులు 20 మందికిపైగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. సమీపంలోని పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన వైద్యం అందించకపోవడం.. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేరుుంచుకునే ఆర్థిక స్థోమత లేక ఇళ్ల వద్దే జ్వరాలతో మంచం పట్టారు. 15 రోజుల క్రితం తీవ్ర జ్వరంతో ఇదే పంచాయతీ పరిధిలోని చింతగూడకు చెందిన శ్రీకాంత్(8) మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ గ్రామాల చుట్టూ అడవులుండడం.. గ్రామాల్లో పారిశుధ్యం లోపించడంతో దోమలు ఎక్కువై మలేరియూ, టైఫారుుడ్ తదితర జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించి జ్వరంతో బాధపడుతున్నవారికి చికిత్స అందించాలని కోరుతున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగునకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.