చిత్రమైన సవాల్ | sreekanth , soniyaman acts in dhee ante dhee movie | Sakshi
Sakshi News home page

చిత్రమైన సవాల్

Published Sat, Jul 12 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM

చిత్రమైన సవాల్

చిత్రమైన సవాల్

‘‘శ్రీకాంత్ మినిమమ్ గ్యారంటీ హీరో. అతని సినిమాలకు శాటిలైట్ హక్కులు బాగా వస్తాయి. అందుకే, శ్రీకాంత్ హీరోగా సినిమా చేయబోతున్నానని జొన్నలగడ్డ శ్రీనివాసరావు అనగానే, ‘గో ఎ హెడ్’ అన్నాను. ‘ఢీ’ విజయవంతమైన టైటిల్ కాబట్టి, ఈ చిత్రం జొన్నలగడ్డకి మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని దాసరి నారాయణరావు చెప్పారు. శ్రీకాంత్, సోనియామాన్ జంటగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో సీఎన్ రెడ్డి, జి. జ్యోతిక నిర్మిస్తున్న చిత్రానికి‘ఢీ అంటే ఢీ’ టైటిల్‌ని ఖరారు చేశారు.

శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దాసరి ఈ టైటిల్‌ని ప్రకటించారు. రెండు డ్యూయెట్లు, ఓ ఐటమ్ సాంగ్ చిత్రీకరించడంతో సినిమా పూర్తవుతుందని జొన్నలగడ్డ చెప్పారు. శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రకథకు తగ్గ టైటిల్ కుదిరింది. కథ వినగానే తప్పకుండా విజయవంతమైన చిత్రం అవుతుందనిపించింది’’ అన్నారు. చిత్రమైన సవాల్‌తో ఢీ అంటే ఢీ అనేలా సినిమా ఉంటుందని మాటల రచయిత రాజేంద్రకుమార్ చెప్పారు. ఈ చిత్రానికి కథ: భూపతిరాజా,సంగీతం: చక్రి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement