Soniyaman
-
‘ఎ ఫిల్మ్ బై అరవింద్’లా...
రిషి, సోనియామాన్ జంటగా శ్రీ వెంకటేశ్వర సూపర్ మూవీస్ బ్యానర్‌పై ఆకుల వెంకటేష్ నిర్మిస్తున్న చిత్రం ‘డాక్టర్ చక్రవర్తి’. శేఖర్ సూరి దర్శకుడు. విజయ్ కురాకుల సంగీత దర్శకుడు. ఈ చిత్రం మే ద్వితీయార్ధంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘శేఖర్ సూరి ‘ఎ ఫిల్మ్ బై అరవింద్’ని అద్యంతం ఉత్కంఠ కలిగేలా తీశారు. ఆ సినిమాలానే ఈ ‘డాక్టర్ చక్రవర్తి’ కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ థ్రిల్‌కి గురి చేసేలా ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని అన్నారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. నిర్మాత వెంకటేష్ సహకారం మాటల్లో చెప్పలేనిది. విజయ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’’ అన్నారు చిత్రదర్శకుడు శేఖర్ సూరి. ఈ చిత్రానికి ఎడిటింగ్: తిరుపతిరెడ్డి, కెమెరా: రాజేందర్. -
ఆ అబ్బాయితో ఢీ
ఓ అబ్బాయి, అమ్మాయి ఆఫీసులో కలిసి పనిచేస్తూ ఉంటారు. వారిద్దరి మధ్య వృత్తిపరంగా ఓ గొడవ జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ల జీవితాలు ఎలా మారాయి? అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘ఢీ అంటే ఢీ’. శ్రీకాంత్, సోనియామాన్ జంటగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయదర్శ కత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ -‘‘చిన్న వయసులోనే శ్రీకాంత్ వందకు పైగా సినిమాలు చేశారు. ఈ నెల 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు’’ అని చెప్పారు. ‘‘చక్రిగారు ఈ సినిమాకు మంచి పాటలు అందించారు. ఇప్పుడు ఆయన లేకపోవడం దురదృష్టకరం’’ అని పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పారు. శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘భూపతి కథ చెప్పినప్పుడు శ్రీనివాసరావు గారికి ఈ సినిమా బాగా నచ్చి, ఆయనే నిర్మాతగా మారారు. ఆయన ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటులు పోసాని కృష్ణమురళి, రచయిత చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎప్పుడైనా సిద్ధం!
ఎలాంటి సవాల్ అయినా ఎదుర్కోవడానికి అతను ఎప్పుడూ రెడీగా ఉంటాడు. ప్రత్యర్థితో ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉంటాడు. అసలు అతను ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా అధిగమించాడు? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘ఢీ అంటే ఢీ’. శ్రీకాంత్, సోనియామాన్ జంటగా స్వీయదర్శకత్వంలో జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నాయకా నాయికలపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ పాటకు ప్రేమ్క్ష్రిత్ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. 24న ప్రత్యేక పాట చిత్రీకరణను ఆరంభిస్తాం. దాంతో షూటింగ్ పూర్తవుతుంది. శ్రీకాంత్ మంచి పాత్ర చేస్తున్నారు. బ్రహ్మానందం పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని చెప్పారు. శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘భూపతిరాజా అద్భుతమైన కథ అందించారు. ఆ కథను శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న విధానం బాగుంది. కొత్త తరహా చిత్రం ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: రాజేంద్రకుమార్, సంగీతం: చక్రి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: జి. లక్ష్మణ్‌రెడ్డి, సి.ఎన్. రెడ్డి, జి. జ్యోతిక. -
చిత్రమైన సవాల్
‘‘శ్రీకాంత్ మినిమమ్ గ్యారంటీ హీరో. అతని సినిమాలకు శాటిలైట్ హక్కులు బాగా వస్తాయి. అందుకే, శ్రీకాంత్ హీరోగా సినిమా చేయబోతున్నానని జొన్నలగడ్డ శ్రీనివాసరావు అనగానే, ‘గో ఎ హెడ్’ అన్నాను. ‘ఢీ’ విజయవంతమైన టైటిల్ కాబట్టి, ఈ చిత్రం జొన్నలగడ్డకి మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని దాసరి నారాయణరావు చెప్పారు. శ్రీకాంత్, సోనియామాన్ జంటగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో సీఎన్ రెడ్డి, జి. జ్యోతిక నిర్మిస్తున్న చిత్రానికి‘ఢీ అంటే ఢీ’ టైటిల్‌ని ఖరారు చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దాసరి ఈ టైటిల్‌ని ప్రకటించారు. రెండు డ్యూయెట్లు, ఓ ఐటమ్ సాంగ్ చిత్రీకరించడంతో సినిమా పూర్తవుతుందని జొన్నలగడ్డ చెప్పారు. శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రకథకు తగ్గ టైటిల్ కుదిరింది. కథ వినగానే తప్పకుండా విజయవంతమైన చిత్రం అవుతుందనిపించింది’’ అన్నారు. చిత్రమైన సవాల్‌తో ఢీ అంటే ఢీ అనేలా సినిమా ఉంటుందని మాటల రచయిత రాజేంద్రకుమార్ చెప్పారు. ఈ చిత్రానికి కథ: భూపతిరాజా,సంగీతం: చక్రి.