వీరి వేతనాలు ఎంత ఎక్కువో...!
న్యూఢిల్లీ : ఒక కంపెనీ మధ్య స్థాయి ఉద్యోగి పొందే వేతనానికి ఎన్నో రెట్లు ఎక్కువగా ఆ కంపెనీ సీఈఓ వేతనం ఉంటోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వేతనం గత ఏడేళ్లుగా పెరగలేదు. కానీ ఆ కంపెనీలోని మధ్య స్థాయి ఉద్యోగికంటే ఆయనవేతనం 205 రెట్లు అధికం. ఇదే విధమైన తేడాలు పలు కంపెనీల్లో ఉన్నాయి. అయితే కొన్ని కంపెనీల్లో వార్షికంగా ఉద్యోగుల వేతనాలు, కీలకమైన పదవుల్లో ఉండే వ్యక్తుల కంటే బాగా పెరిగాయి.
కొన్ని కంపెనీల్లో ఈ వేతనాల పెరుగుదల కీలకమైన పదవుల్లో ఉన్నవారికే అధికంగా ఉంటోంది. కాగా వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ బోనస్‌ను 28 శాతం(రూ.8.85 కోట్లు) పెంచాలని వేదాంత రిసోర్సెస్ ప్రతిపాదిస్తోంది.