ట్రాన్స్‌కో సీఎండీ రఘుమారెడ్డి
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలు భారీగా పెంచింది. పీఆర్సీ 43 శాతం పెంపుతో ఉద్యోగుల జీతాలు రెట్టింపయ్యా యి. గతంలో కంటే మెరుగ్గా ఉద్యోగుల ఆదా యం పెరిగింది. విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అవినీతిని వదిలిపెట్టి బాధ్యత ఎరిగి పనిచేయండి అని ట్రాన్స్‌కో సీఎండీ రఘుమారెడ్డి ఉద్బోధించారు. విద్యుత్ శాఖ నెల వారీ సమీక్షలో భాగంగా శుక్రవారం నల్లగొం డలోని విద్యుత్ శాఖ అతిథి గృహంలో నిర్వహించిన సమావేశానికి ట్రాన్స్‌కో డైరక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భ ంగా సీఎండీ మాట్లాడుతూ...శాఖా పరం గా చోటుచేసుకుంటున్న అవినీతిని తగ్గించాలని ఆదేశించారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో రైతులకు ఇబ్బంది కలగకుండా అం దుబాటులో సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు. మరమ్మతులకు వచ్చిన ట్రాన్స్‌ఫార్మర్లను 24 గంటల్లో రిపేరు చేసి పంపాలని తెలిపారు.
రబీలో చాలా చోట్ల పంటలు సాగుచేశారు కాబట్టి పంటలకు నష్టం కలగకుండా విద్యుత్ సరఫరాలో తగు జాగ్రత్తలు పాటించలన్నారు. వేసవి పరిస్థితి గురించి రై తులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కలి గించాలన్నారు. మున్సిపాలిటీల్లో విద్ద్యుద్ధీకరణ పను లు వేగవంతం చేయాలని, బిల్లుల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ వసూళ్లు మరింత పెంచాలని సీఎండీ ఆదేశించారు. స్టోర్స్ అగ్నిప్రమాదం ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించాలని, స్థానిక పోలీసుల సహకారంతో కేసు విచారణ చేపట్టాలన్నారు. సమావేశంలో ట్రాన్స్ కో ఎస్‌ఈ బాలస్వామి, డైరక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, విజిలెన్స్ డీఎస్పీ రామచంద్రుడు పాల్గొన్నారు.
జీతాలు పెరిగాయ్...అవినీతిని తగ్గించండి
Published Sat, Feb 7 2015 2:34 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement