
సాక్షి, అమరావతి : 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ పరిహారంగా రాష్ట్రానికి రూ.3,028 కోట్లు చెల్లించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని రాష్ట్రాలకూ జీఎస్టీ పరిహారంగా రూ.1,65,302 కోట్లు చెల్లించినట్టు నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. వాస్తవంగా జీఎస్టీ పరిహారం కోసం విధించే సెస్ రూ.95,444 కోట్లు వచ్చినా, రూ.1.65 లక్షల కోట్లు చెల్లించినట్టు పేర్కొన్నారు. తెలంగాణ రూ.3,054 కోట్లు, కర్ణాటక రూ.18,628 కోట్లు, తమిళనాడు రూ.12,305 కోట్లు పరిహారంగా పొందాయి.
Comments
Please login to add a commentAdd a comment