పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల్ని సోమవారం కేంద్రం కరుణించింది. రబీ సీజన్ నేపథ్యంలో వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా విత్తనాల కొనుగోలుకు పాత రూ. 500 నోట్లు వాడుకోవచ్చంటూ సడలింపునిచ్చింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విత్తన విక్రయ కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగ నియంత్రణలోని సంస్థలు, జాతీయ, రాష్ట్ర విత్తన కార్పొరేషన్లు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్)లో తగిన ఆధారాలు చూపి పాత నోట్లు చెల్లించి విత్తనాలు కొనుగోలు చేయొచ్చని ఆర్థిక శాఖ తెలిపింది.