పోలవరం పేరుతో మరో రూ.3825.44 కోట్లు కొట్టేసేందుకు రంగం సిద్ధమైంది. అందుకోసం ఆర్థిక శాఖ అభ్యం తరాలు, స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ సూచనలను సర్కారు తోసిపుచ్చింది. పోలవరం కుడి కాలువ అంచనా వ్యయాన్ని రూ.2240.68 కోట్ల నుంచి రూ.4375.77 కోట్లకు.. ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని రూ.1954.74 కోట్ల నుంచి రూ.3645.15 కోట్లకు పెంచేసింది. ఈ మేరకు జలవనరుల శాఖ కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల ప్రయోజనాలతో ముడిపడిన పత్యేక హోదా ను తాకట్టు పెట్టి.. పోలవరం నిర్మాణ బాధ్య తలు దక్కించుకున్న 24 గంటల్లోనే ప్రధాన పనులు (హెడ్ వర్క్స్) అంచనా వ్యయం రూ.1482 కోట్లు పెంచేసి.. కాంట్రాక్టర్ అరుున టీడీపీ ఎంపీ రాయపాటి నుంచి పర్సెంటేజీలు దండుకున్న ‘ముఖ్య’ నేత తాజాగా మరో అడుగు ముందుకేశారు.