ఎస్టీ గురుకులాలకు 1,515 పోస్టులు | ST Gurukuls to 1,515 posts | Sakshi
Sakshi News home page

ఎస్టీ గురుకులాలకు 1,515 పోస్టులు

Published Wed, Jul 6 2016 3:23 AM | Last Updated on Tue, Oct 2 2018 4:36 PM

ST Gurukuls to 1,515 posts

మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చిన ఆర్థిక శాఖ
 
 
 సాక్షి, హైదరాబాద్ : కొత్తగా ప్రారంభించనున్న 50 ఎస్టీ గురుకుల (బాలురు, బాలికలు) పాఠశాలల్లో శాశ్వత ప్రాతిపదికన 1,500 మంది టీచింగ్ , నాన్‌టీచింగ్ పోస్టులను, ఎస్టీ గురుకులాల కార్యదర్శి కార్యాలయంలో 15 మందిని భర్తీ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ఆమోదించింది. ఆయా విధులను నిర్వహించేందుకు ఔట్‌సోర్సింగ్ కింద 256 మంది సేవలను వినియోగించుకునేందుకు అనుమతినిచ్చింది. మంగళవారం ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.శివశంకర్ ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన 1,515 టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను, ఔట్‌సోర్సింగ్ కింద మంజూరు చేసిన 256 మందిని 2016-19 (మూడేళ్లకాలంలో)లో భర్తీచేస్తారు.

 ఎస్టీ గురుకులాల కార్యదర్శి కార్యాలయంలో...
 ఎస్టీ గురుకులాల కార్యదర్శి కార్యాలయంలో 15 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో ఒక అడిషనల్ డెరైక్టర్, ఒక జాయింట్ డెరైక్టర్, 2 డిప్యూటీ డెరైక్టర్లు, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 2 అసిస్టెంట్ సెక్రటరీలు, ఒక కంటెంట్ మేనేజర్, 3 సూపరింటెండెంట్, 4 సీనియర్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. వీటన్నింటినీ 2016-17లోనే భర్తీ చేస్తారు.

 ఔట్‌సోర్సింగ్ సేవలివే : ఔట్‌సోర్సింగ్ కింద వినియోగించుకునే సేవలివీ.. వాటిలో 50 మంది ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లు, 50 మంది జూనియర్ అసిస్టెంట్/డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 100 మంది ల్యాబ్ అసిస్టెంట్లు, 50 మంది ఆఫీస్ సబార్డినేట్ల సేవలను ఉపయోగించుకోనున్నారు. ఎస్టీ గురుకులాల కార్యదర్శి కార్యాలయంలో నలుగురు జూనియర్ అసిస్టెంట్లు/డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్ల సేవలను వినియోగించుకుంటారు. 2016-17లో 156 మంది సేవలను, 2018-19లో వంద మంది సేవలను వినియోగించుకుంటారు.
 
 భర్తీ చేసే పోస్టుల వివరాలివీ
  కొత్తగా ఏర్పాటు చేయనున్న 50 ఎస్టీ గురుకులాల్లో రాబోయే మూడేళ్లలో భర్తీచేసే పోస్టులివీ.. 2016-17 లోనే 50 ప్రిన్సిపాల్ పోస్టులను భర్తీ చేస్తారు. జూనియర్ లెక్చరర్ (350) పోస్టులను  2018-19లో భర్తీ చేస్తారు. పీజీ టీచర్స్ (350) పోస్టుల్లో 2017-18లో 250, 2018-19లో వంద పోస్టులు, ట్రైన్‌డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) 450 పోస్టులకు గాను 2016-17లో 350, 2018-19లో 100, ఫిజికల్ డెరైక్టర్ (50) పోస్టులను మొత్తం 2018-19లో, పీఈటీ (50) పోస్టులను 2018-19లో, ల్రైబేరియన్లు (50) పోస్టులను 2018-19లో,  50 స్టాఫ్‌నర్స్ పోస్టులను, 50  క్రాఫ్ట్/మ్యూజిక్ టీచర్స్ పోస్టులను, 50 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 2016-17లో భర్తీ చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement