పార్లమెంట్‌లో క్రిప్టోకరెన్సీపై నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. క్రిప్టోకరెన్సీపై, ఆర్బీఐ తెస్తోన్న డిజిటల్ కరెన్సీపై జబల్‌పూర్ పార్లమెంట్ సభ్యులు రాకేష్ సింగ్ చౌదరీ, ఉత్తర ప్రదేశ్ పార్లమెంటు సభ్యురాలు జగదాంబిక పాల్ లోక్‌సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
ప్రోత్సహించే ఉద్ధేశ్యం లేదు..!
క్రిప్టో కరెన్సీ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. భారత్‌లో క్రమబద్ధీకరించబడని క్రిప్టోకరెన్సీ, బ్లాక్‌చెయిన్ పరిశ్రమను నియంత్రించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. క్రిప్టోకరెన్సీ సెక్టార్‌పై డేటాను ప్రభుత్వం సేకరించట్లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా క్రిప్టోకరెన్సీ నియంత్రణ బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
కరెన్సీపై ఆధారపడడం తగ్గుతోంది..!
త్వరలోనే రిజర్వ్ బ్యాంకు తీసుకువస్తోన్న డిజిటల్ కరెన్సీపై అడిగిన ప్రశ్నకు కూడా పంకజ్ సమాధానమిచ్చారు. కరెన్సీపై ఆధారపడడం తగ్గించేందుకు ఈ డిజిటల్ కరెన్సీ ఉపయోగపడుతోందని అన్నారు. డిజిటల్ కరెన్సీ పరిచయంతో తక్కువ లావాదేవీ ఖర్చుల కారణంగా అధిక సీగ్నియరేజ్, తగ్గిన సెటిల్మెంట్ రిస్క్ వంటి ముఖ్యమైన ప్రయోజనాలను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉండే అవకాశం ఉందని పంకజ్ అభిప్రాయపడ్డారు. డిజిటల్ కరెన్సీ మరింత దృఢమైన, సమర్థవంతమైన, విశ్వసనీయమైన, నియంత్రిత, చట్టపరమైన టెండర్ ఆధారిత చెల్లింపుల ఎంపికగా నిలుస్తోందని ఆయన అన్నారు.
చదవండి: 22 కోట్ల ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్‌న్యూస్..!
Comments
Please login to add a commentAdd a comment