
'వంద'ల పాట్లు
80% ఏటీఎంల్లో నో క్యాష్.. వంద నోట్ల జాడలేదు
- ఏటీఎంలే కాదు బ్యాంకుల్లోనూ ‘నో క్యాష్’ బోర్డులు
- రాజధాని ప్రాంతం విజయవాడ బ్యాంకుల్లోనే స్వైపింగ్ మిషన్లు లేవు
- వెలగపూడి సచివాలయం ఎస్‌బీఐలో నో క్యాష్ బోర్డు
- 1వ తేదీ రావడంతో ఉద్యోగులు, సామాన్య ప్రజల్లో టెన్షన్.. టెన్షన్
- సచివాలయ ఉద్యోగులు వేతనాలు తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
- ఒకేసారి 24 వేల రూపాయలు ఇచ్చేందుకు ఆర్థిక శాఖ చర్యలు
సాక్షి, అమరావతి: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 22 రోజులైనా నోట్ల సంక్షోభం వీడలేదు. ఒకటవ తేదీ వచ్చినా ఏటీఎంలోను, బ్యాంకుల్లోను నగదు దొరక్కపోవడంతో ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజానీకంలో టెన్షన్ పెరిగిపోతోంది. గురువారం బ్యాంకు ఖాతాల్లో వేతనం పడుతుందని, దాన్ని తీసుకోవడం ఎలా అనే విషయంపైనే ఉద్యోగులు బుధవారం నుంచి హైరానా పడుతున్నారు. ఏటీఎంల్లో రోజుకు రూ.2500 మాత్రమే తీసుకోవడానికి అనుమతి ఉంది. కానీ ఏదైనా ఏటీఎంలో నగదు వస్తోందంటే అదీ ఒక్క రెండు వేల నోటు మాత్రమే. బ్యాంకుల్లో వారానికి 24 వేల రూపాయలు తీసుకోవడానికి అనుమతి ఉన్నప్పటికీ... నగదు కొరత నేపథ్యంలో ఒకేసారి 24 వేల రూపాయలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నారుు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, పేదలు, సామాన్య ప్రజానీకం... అందరిలోనూ ఆందోళనే. ఒకటవ తేదీన ఇంటి అద్దె చెల్లించడానికి, పిల్లల ఫీజులు కట్టడానికి, పాలు పోసే వారికి ఇవ్వడానికి నగదు ఎలాగంటూ సతమతమవుతున్నారు.
ఇంటి అద్దె చెక్‌ల రూపంలో చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత సలహా ఇచ్చిందని, అరుుతే ఇంటి యజమానులెవ్వరూ చెక్‌లు తీసుకోరని, నగదు ఇవ్వాలని పట్టుపడతారని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నారుు. బ్యాంకు రుణాలు చెల్లించడానికై తే చెక్‌లు ఇస్తామని, మిగతా వాటికి నగదు ఎలాగంటూ ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల్లో స్వైపింగ్ మిషన్ల ద్వారా అకౌంట్ నుంచి నగదు తీసుకోవచ్చునని చెబుతున్నప్పటికీ ఆచరణలో సాధ్యం కావడం లేదు. విజయవాడలోనే చాలా బ్యాంకుల్లో స్వైపింగ్ మిషన్లు లేకపోవడం గమనార్హం. నగరంలోని సూర్యారావు పేటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో స్వైపింగ్ మిషన్ లేకపోవడం ఇందుకు ఉదాహరణ మాత్రమే. బుధవారం విజయవాడతో పాటు రాష్ట్రంలోని పలు పట్టణాల్లో 80 శాతం ఏటీఎంల్లో నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చారుు. మిగతా 20 శాతం ఏటీంఎల్లో రెండు వేల నోట్లు తప్ప వంద నోట్లు జాడే కనిపించలేదు. సాక్షాత్తు పరిపాలన కేంద్రమైన వెలగపూడి సచివాలయంలోని స్టేట్ బ్యాంకు ఇండియా బ్రాంచిలో నో క్యాష్ బోర్డు పెట్టారు. ఏమిటని అడిగితే నగదు అరుుపోందని సిబ్బంది పేర్కొన్నారు.
సచివాలయ ఉద్యోగులకు ఒకేసారి రూ.24 వేలు ఇప్పించేందుకు ఏర్పాట్లు
ఇలా ఉండగా సచివాలయ ఉద్యోగులు ఒకేసారి 24 వేల రూపాయలు బ్యాంకులు ఇప్పించాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లంను బుధవారం కోరారు. సచివాలయ ఉద్యోగులందరికీ స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్, ఆంధ్రా బ్యాంకుల్లోనే వేతన ఖాతాలున్నాయని, ఆ బ్యాంకుల ద్వారా ఒకేసారి 24 వేల రూపాయలు ఇప్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కల్లం బ్యాంకు అధికారులతో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. వెలగపూడి సచివాలయంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ బ్రాంచి లేనందున గురువారం, శుక్రవారం రెండు రోజులపాటు ఆ బ్యాంచి అధికారులను వెలగపూడి రప్పించి అక్కడే విత్ డ్రా ఫారాలను ఉద్యోగుల నుంచి తీసుకుని తగిన నగదు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. అలాగే ఉండవల్లి, తుళ్లూరు, మంగళగిరి స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ బ్రాంచీల్లో సచివాలయ ఉద్యోగులు వెళ్లి 24 వేల రూపాయల చొప్పున నగదు తీసుకునేందుకు ఏర్పాటు చేశారు. సచివాలయంలోని ఆంధ్రా బ్యాంకు బ్రాంచితో పాటు ఆయా బ్యాంకుల్లో సరిపడా నగదును అందుబాటులో ఉంచనున్నారు. ఇక రాష్ట్ర ఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు కూడా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లంను కలిసి ప్రధానంగా గ్రామాల్లో, మండలాల్లో, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు నగదు రూపంలో వేతనాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బుధవారం నాటికి కరెన్సీ చెస్ట్‌ల్లో రూ.1480 కోట్లు
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కరెన్సీ చెస్ట్‌ల్లో కేవలం రూ.1480 కోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు ఆర్‌బీఐ గణాంకాలు స్పష్టం చేశారుు. ఇందులో 90 శాతం మేర నగదు రెండు వేల నోట్ల రూపంలోనే ఉందని బ్యాకింగ్ అధికారులు తెలిపారు. చిన్న నోట్ల సమస్య ఇప్పట్లో తీరదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నారుు. ఆర్‌బీఐ నిబంధనల మేరకు సగం చిన్న నోట్లను, సగం పెద్ద నోట్లను పాటిచాల్సి ఉందని, అరుుతే 2005 సంవత్సరం నుంచి ఆర్‌బీఐ నగదు ముద్రణ వ్యయాన్ని తగ్గించడంలో భాగంగా చిన్న నోట్ల ముద్రణను తగ్గించేసి పెద్ద నోట్ల ముద్రణను చేపట్టిందని ఉన్నతస్థారుు అధికారి తెలిపారు. దీంతో పెద్ద నోట్లు శాతం 86 ఉండగా చిన్న నోట్ల శాతం 14 శాతానికి పడిపోరుుందని, దీంతో చిన్న నోట్ల సమస్య తలెత్తిందని, ఇప్పటికిప్పుడు చిన్న నోట్ల సరిపడా అందుబాటులోకి రావడం సాధ్యం కాదని అధికార వర్గాలు పేర్కొన్నారుు.