రూ.4.41 కోట్ల పంచాయతీరాజ్ బిల్లులను పట్టించుకోని ఆర్థిక శాఖ
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ససేమిరా అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పద్దుల కింద చేపట్టిన పనులను పూర్తిచేసినా, సదరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోతుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. 13వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధులతో 2014–15లో అప్పటి ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రామీణ రహదా రుల నిర్మాణాన్ని, మరమ్మతులను చేపట్టింది. రాష్ట్రా నికి వచ్చిన నిధుల కంటే ఎక్కువ మొత్తంలో పనుల ను చేపట్టడంతో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఆగిపోయాయి.
కాంట్రాక్టర్లకు బకాయిపడ్డ రూ.4.41 కోట్లను గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కింద చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిం చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం నుంచి 2015–16లో ప్రతిపాదనలు పంపిన ప్పటికీ ఆర్థికశాఖ కొర్రీలు వేయడంతో నిధుల విడుద ల నిలిచిపోయింది. కనీసం ఈ ఏడాదైనా తమ బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుందో లేదోనని పలువురు కాంట్రాక్టర్లు ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చేసిన పనులకు మూడేళ్లయినా బిల్లులు రానందున ప్రభుత్వం ఈ ఏడాది చేపడుతున్న రహదారుల నిర్మాణ పనులను చేసేందుకు కాంట్రాక్టర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు.
పనులు చేసి మూడేళ్లు...ఇప్పటికీ పాస్‌కాని బిల్లులు!
Published Mon, Feb 20 2017 2:00 AM | Last Updated on Tue, Oct 2 2018 4:36 PM
Advertisement