న్యూఢిల్లీ: వ్యయ వివరాలు అందించాలని వివిధ మంత్రిత్వ శాఖలను ఆర్థికశాఖ కోరింది. 2024–25 మధ్యంతర బడ్జెట్‌పై కసరత్తు, బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా ప్రక్రియను ప్రారంభించినట్లు ఒక సర్క్యులర్ పేర్కొంది. వచ్చే ఏడాది ప్రారంభంలో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నందున మధ్యంతర బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. జూలై 2019లో తన మొదటి పూర్తి బడ్జెట్‌ను సమరి్పంచిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రానున్నది ఆరవ బడ్జెట్.
సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడి, 2024–24కు సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను సమర్పిస్తుంది. ‘‘వ్యయ విభాగం కార్యదర్శి అధ్యక్షతన ప్రీ–బడ్జెట్ సమావేశాలు అక్టోబర్ 2023 రెండవ వారంలో ప్రారంభమవుతాయి. దాదాపు 2023 నవంబర్ మధ్య వరకు కొనసాగుతాయి’’ అని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ నేతృత్వంలో పనిచేసే బడ్జెట్ డివిజన్ సర్క్యులర్ (2024–25) ఒకటి వివరించింది.
ప్రీ–బడ్జెట్ సమావేశాల్లో అంచనాల ఖరారు
సెప్టెంబర్ 1 నాటి ఈ సర్క్యులర్ ప్రకారం, అవసరమైన అన్ని వివరాలను అక్టోబర్ 5 లోపు సమరి్పంచేలా ఆర్థిక సలహాదారులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అటు తర్వాత ప్రీ–బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల అనంతరం 2024–25 మధ్యంతర బడ్జెట్‌కు సంబంధించి అంచనాలు తాత్కాలిక ప్రాతిపదికన ఖరారవుతాయి.
ప్రీ–బడ్జెట్ సమావేశాల సందర్భంగా, మంత్రిత్వ శాఖలు లేదా శాఖల ఆదాయాలతో పాటు వ్యయాలకు నిధుల ఆవశ్యకతపై చర్చించడం జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. 2024–25 మధ్యంతర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న సమరి్పంచే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఫిబ్రవరి–చివరిలో బడ్జెట్‌ను సమర్పించే వలస పాలన సంప్రదాయాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే.
మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017 సంవత్సరంలో ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను సమరి్పంచే విధానాన్ని ప్రారంభించారు. తాజా ప్రక్రియతో ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండే మంత్రిత్వ శాఖలకు బడ్జెట్ కేటాయింపు నిధులు అందుబాటులో ఉంటాయి. గతంలో ఫిబ్రవరి చివరిలో బడ్జెట్‌ను సమరి్పంచినప్పుడు మూడు–దశల పార్లమెంట్ ఆమోద ప్రక్రియ... వర్షాల ప్రారంభానికి వారాల ముందు మే మధ్యలో పూర్తయ్యేది. దీనితో ప్రభుత్వ శాఖలు వర్షాకాలం ముగిసిన తర్వాత ఆగస్టు–ఆఖరు లేదా సెపె్టంబర్ నుండి మాత్రమే ప్రాజెక్టులపై వ్యయాలను ప్రారంభించేవి.
Comments
Please login to add a commentAdd a comment