Pre-budget
-
Budget 2024-2025: వ్యయ వివరాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: వ్యయ వివరాలు అందించాలని వివిధ మంత్రిత్వ శాఖలను ఆర్థికశాఖ కోరింది. 2024–25 మధ్యంతర బడ్జెట్‌పై కసరత్తు, బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా ప్రక్రియను ప్రారంభించినట్లు ఒక సర్క్యులర్ పేర్కొంది. వచ్చే ఏడాది ప్రారంభంలో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నందున మధ్యంతర బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. జూలై 2019లో తన మొదటి పూర్తి బడ్జెట్‌ను సమరి్పంచిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రానున్నది ఆరవ బడ్జెట్. సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడి, 2024–24కు సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను సమర్పిస్తుంది. ‘‘వ్యయ విభాగం కార్యదర్శి అధ్యక్షతన ప్రీ–బడ్జెట్ సమావేశాలు అక్టోబర్ 2023 రెండవ వారంలో ప్రారంభమవుతాయి. దాదాపు 2023 నవంబర్ మధ్య వరకు కొనసాగుతాయి’’ అని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ నేతృత్వంలో పనిచేసే బడ్జెట్ డివిజన్ సర్క్యులర్ (2024–25) ఒకటి వివరించింది. ప్రీ–బడ్జెట్ సమావేశాల్లో అంచనాల ఖరారు సెప్టెంబర్ 1 నాటి ఈ సర్క్యులర్ ప్రకారం, అవసరమైన అన్ని వివరాలను అక్టోబర్ 5 లోపు సమరి్పంచేలా ఆర్థిక సలహాదారులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అటు తర్వాత ప్రీ–బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల అనంతరం 2024–25 మధ్యంతర బడ్జెట్‌కు సంబంధించి అంచనాలు తాత్కాలిక ప్రాతిపదికన ఖరారవుతాయి. ప్రీ–బడ్జెట్ సమావేశాల సందర్భంగా, మంత్రిత్వ శాఖలు లేదా శాఖల ఆదాయాలతో పాటు వ్యయాలకు నిధుల ఆవశ్యకతపై చర్చించడం జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. 2024–25 మధ్యంతర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న సమరి్పంచే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఫిబ్రవరి–చివరిలో బడ్జెట్‌ను సమర్పించే వలస పాలన సంప్రదాయాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017 సంవత్సరంలో ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను సమరి్పంచే విధానాన్ని ప్రారంభించారు. తాజా ప్రక్రియతో ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండే మంత్రిత్వ శాఖలకు బడ్జెట్ కేటాయింపు నిధులు అందుబాటులో ఉంటాయి. గతంలో ఫిబ్రవరి చివరిలో బడ్జెట్‌ను సమరి్పంచినప్పుడు మూడు–దశల పార్లమెంట్ ఆమోద ప్రక్రియ... వర్షాల ప్రారంభానికి వారాల ముందు మే మధ్యలో పూర్తయ్యేది. దీనితో ప్రభుత్వ శాఖలు వర్షాకాలం ముగిసిన తర్వాత ఆగస్టు–ఆఖరు లేదా సెపె్టంబర్ నుండి మాత్రమే ప్రాజెక్టులపై వ్యయాలను ప్రారంభించేవి. -
మహమ్మారిని ఎదుర్కొనడంపైనే బడ్జెట్ దృష్టి
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ రికవరీ ఇంకా పేలవంగా ఉందని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేర్కొంది. ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ వచ్చే నెల 1వ తేదీన పార్లమెంటులో 2022–23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఎస్బీఐ చీఫ్ ఎకనమిస్ట్ సౌమ్యకాంతి ఘోష్ బుధవారం ఒక ప్రీ–బడ్జెట్ సిఫారసుల నోట్‌ను విడుదలచేశారు. ఈ డాక్యుమెంట్ ప్రకారం, మహమ్మారిని ఎదుర్కొనడంపై రానున్న బడ్జెట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ద్రవ్యలోటు పరమైన ఇబ్బందుల పరిశీలించడం మాత్రమే తాజా పరిస్థితుల్లో సరికాదు. కొత్త ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ విక్రయం ద్వారా ఎల్ఐసీ వాటా విక్రయాన్ని పూర్తిచేయాలి. కొత్త ఆర్థిక సంవత్సరానికి ఇది అత్యుత్తమ పప్రారంభం అవుతుంది. 2022–23లో ఖజానాకు దాదాపు రూ.3 లక్షల కోట్ల నిధులను సమకూర్చుకోడానికి, ద్రవ్యలోటును 6.3 శాతానికి తగ్గించడానికి ఈ చర్య దోహదపడుతుంది. ద్రవ్యలోటు కట్టడి చేయాలన్నా అది 40 బేసిస్ పాయింట్ల కన్నా అధికంగా ఉండకూడదు. ప్రస్తుతం ఎకానమీలో కీలక రంగాలకు ప్రభుత్వ మద్దతు అవసరం. సంపద పన్ను వంటి కొత్త పన్నుల జోలికి వెళ్లవద్దు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి చర్యలు లాభాలకన్నా ప్రతికూల ఫలితాలకే దారితీస్తుంది. జీడీపీలో దాదాపు 29 శాతం వాటాతో 11 కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న ఉన్న లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మద్దతునిచ్చేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి వరకూ అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్జీఎస్) కొనసాగించాలి. -
ఆర్థిక వేత్తలతో ప్రీ బడ్జెట్ మీటింగ్
సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్రం కీలక సమావేశం నిర్వహించింది. పలు ఆర్థిక వేత్తలు, నిపుణులతో ఆర్థికమంత్రిత్వ శాఖ ప్రీ బడ్జెట్ సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం బడ్జెట్ సమావేశానికి హాజరయ్యారు. రాబోయే 2018 కేంద్ర బడ్జెట్ కరసరత్తులో భాగంగా ఆర్థికవేత్తల బృందంతో సమావేశమైంది. రెవెన్యూ కార్యదర్శి హస్ముక్ ఆదియా కూడా ఉన్నారు. గతంలో వ్యవసాయ రంగం, పరిశ్రమ, వ్యాపార విభాగాలు, ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులతో ఆర్థిక మంత్రి సమావేశమయ్యారు. ముఖ్యంగా కార్పొరేట్ పన్ను తగ్గింపు తదితర కీలక అంశాలపై ఈ సమావేశం చర్చించింది. మరోవైపు 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వ చివరి ఆర్థిక బడ్జెట్ కావడంతో భారీ పెట్టుబడులు, తక్కువ పన్నులు, మరిన్ని ప్రోత్సాహకాలతోఆకర్షణీయంగా బడ్జెట్‌ను వడ్డించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. -
కార్పొరేట్ ట్యాక్స్ కోతపై స్పష్టత కావాలి
ప్రీ-బడ్జెట్ సమావేశాల్లో పరిశ్రమవర్గాల వినతి న్యూఢిల్లీ: రాబోయే బడ్జెట్లో కార్పొరేట్ ట్యాక్స్ రేటును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించే అంశానికి సంబంధించి స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాలని పరిశ్రమవర్గాలు ప్రభుత్వాన్ని కోరాయి. ప్రోత్సాహకాల ఉపసంహరణ అనేది... కార్పొరేట్ ట్యాక్స్ రేటు తగ్గింపుతో పాటు కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) తొలగింపునకు అనుగుణంగా జరగాలని పేర్కొన్నాయి. బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ సందర్భంగా పరిశ్రమల సమాఖ్యలు సీఐఐ, ఫిక్కీ ఈ మేరకు తమ వినతులు సమర్పించాయి. ప్రోత్సాహకాలు, మినహాయింపుల ఉపసంహరణ ప్రతిపాదనకు తమ మద్దతు ఉంటుందని సీఐఐ ప్రెసిడెంట్ సుమీత్ మజుందార్ చెప్పారు. వీటిని తగ్గించిన తర్వాత మ్యాట్‌ను దశలవారీగా ఎత్తివేయాలని కోరినట్లు ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ నోతియా తెలిపారు. ఇక వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ) అమలులో ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతుంటుందని వారు పేర్కొన్నారు. ప్రారంభ దశలోని స్టార్టప్‌లకు పన్నులపరమైన బాదరబందీ ఉండకుండా చూడాలని తాము సూచించినట్లు ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. వ్యాపారాలకు అనుకూల పరిస్థితులను కల్పించడంతో పాటు పన్నుల విధానాన్ని కూడా మెరుగుపర్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు అసోచాం ప్రెసిడెంట్ సునీల్ కనోడియా వివరించారు. ఎగుమతులకు సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేసినట్లు ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. -
కమిషనరేట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే ?
సీపీ ప్రతిపాదనలపై సీఎం అనాసక్తి విజయవాడ సిటీ : నగర పోలీసు కమిషనరేట్ విస్తరణ మరికొంత జాప్యం కానుంది. కమిషనరేట్ విస్తరణలోని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మరోసారి చర్చిద్దామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడి అధికారుల ప్రతిపాదనలపై దాటవేసినట్టు తెలిసింది. కమిషనరేట్ విస్తరణపై ముఖ్యమంత్రి అయిష్టత వ్యక్తం చేయడంతో అధికారులు కొంత ఇబ్బందికి లోనయ్యారు. నగరంలోని మహాత్మాగాంధీ రోడ్డులోగల ఓ హోటల్లో బుధవారం ప్రీబడ్జెట్‌పై ముఖ్యమంత్రి రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నగర పోలీసు కమిషనరేట్ విస్తరణపై కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నవ్యాంధ్ర రాజధానిగా నగరాన్ని ప్రకటించడంతో కమిషనరేట్ విస్తరణ అనివార్యమైంది. ఇందుకు సంబంధించి నగర పోలీసు కమిషనర్ వెంకటేశ్వరరావు కమిషనరేట్ తరఫున ప్రతిపాదనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తుళ్లూరు, తెనాలి, తాడికొండ, తాడేపల్లి, అమరావతి, ఫిరంగిపురం, పెదకూరపాడు, క్రోసూరు, పెదకాకాని, కొల్లిపర, దుగ్గిరాల, అచ్చంపేట మండలాలను, నగర పోలీసు కమిషరేట్‌లో ఇప్పటికే ఉన్న విజయవాడ రూరల్, గన్నవరం, కంకిపాడు, పెనమలూరు, ఇబ్రహీంపట్నం, తోట్లవల్లూరు, ఉయ్యూరు, పమిడిముక్కల మండలాలతో పాటు హనుమాన్ జంక్షన్, ఆగిరిపల్లి, నూజివీడు, కంచికచర్ల మండలాలను కలిపి విస్తరించాల్సిన అవసరాన్ని వివరించారు. రేంజ్‌లు మారడంతో పాటు ఆయా మండలాలను కలపడం రాజకీయ ఇబ్బందులు సృష్టిస్తుందనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అన్ని అంశాలను సానుకూలంగా చర్చించేందుకు మరోసారి ప్రయత్నిద్ధామంటూ ఇప్పటికిప్పుడైతే కమిషనరేట్ విస్తరణపై ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదని తెలిసింది. గత కొద్ది రోజులుగా కమిషనరేట్ విస్తరణపై నగర పోలీసులు పెద్దఎత్తున కసరత్తు చేసి ప్రతిపాదనలు తయారు చేశారు. ఇందుకు సంబంధించి ప్రధాన కమిషనరేట్ల డేటాను సైతం సేకరించి పొందుపరిచినప్పటికీ ముఖ్యమంత్రి అనాసక్తి చూపడం కమిషనరేట్ అధికారులకు మింగుడుపడటం లేదు. పోలీసుల పనితీరుపై అసంతృప్తి నగర పోలీసుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చుకుని నిలువరించాలి తప్ప సామాన్యులకు ఇబ్బంది కలిగించే చర్యలకు దిగరాదంటూ పరోక్షంగా ఆపరేషన్ నైట్ డామినేషన్‌పై వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు. ఇదే సమయంలో కమిషనరేట్ పరిధిలోని దిగువస్థాయి అధికారుల పనితీరు ఏమాత్రం బాగోలేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా.. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొందరు విద్యార్థులు ముఖ్యమంత్రిని కలిసేందుకు రాగా పోలీసు అధికారులు అడ్డుకోవడంపై కూడా ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు తమ పద్ధతులను మార్చుకొని ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించాలి తప్ప ఇలాంటి చర్యలు మంచివి కావంటూ హితవు పలికారు. -
అభివృద్ధి నివేదికలు రెడీ
నేడు ప్రీ బడ్జెట్ సదస్సు సీఎం ముందుకు కీలక ప్రతిపాదనలు మచిలీపట్నం : నవ్యాంధ్రప్రదేశ్‌లో జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలను బుధవారం విజయవాడ నగరంలో జరగనున్న ప్రీ బడ్జెట్ రాష్ట్రస్థాయి సదస్సులో ప్రస్తావించేందుకు అధికారులు, మంత్రులు నివేదికలు సిద్ధం చేశారు. ఇన్చార్జ్ కలెక్టర్ జె.మురళి, ట్రైనీ కలెక్టర్ సృజన నేతృత్వంలో ఈ నివేదికలను తయారుచేశారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి వివిధ అం శాలు ఈ సదస్సులో చర్చించేందుకు మంత్రులు సిద్ధమైనట్లు సమాచారం. మచి లీపట్నం, విజయవాడ జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసేందుకు రెండేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం రూ.760 కోట్లతో టెండర్లు పిలిచింది. వివిధ కారణాలతో నిలిచిపోయాయి. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ మధుకాన్ పనులు సకాలంలో ప్రారంభించకపోవడంతో కాంట్రాక్టును రద్దు చేశారనే ప్రచారం జరుగుతోంది. భూ సేకరణ 80శాతానికి పైగా పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. మచిలీపట్నంలో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)ను రూ. 150 కోట్లతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయాలని మూడేళ్లుగా ప్రతిపాదన చేస్తూనే ఉన్నారు. బెల్ కంపెనీ విస్తరణపై బుధవారం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని మంత్రి కొల్లు రవీంద్ర ‘సాక్షి’కి చెప్పారు. కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు 370 కిలోమీటర్ల మేర కోస్తా జాతీయ రహదారి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. గతంలోనే ఈ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే పనులు జరగడం లేదు. ఈ రోడ్డును రెండు లైన్లుగా అభివృద్ధి చేసే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. కృష్ణా యూనివర్సిటీకి నూతన భవనాలను సమకూర్చేందుకు రూ.77 కోట్ల నిధులు అవసరమవుతాయని నిర్ణయించారు. మొదటి విడతగా రూ. 7కోట్ల నిధులు విడుదలయ్యాయి. యూనివర్సిటీ అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఒప్పించేందుకు మంత్రులు సంసిద్ధులవుతున్నట్లు సమాచారం. కృష్ణా యూనివర్సిటీ, ఆంధ్రా జాతీయ కళాశాలను అభివృద్ధి చేయాలనే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు సమాచారం. మంగినపూడి బీచ్ అభివృద్ధికి సంబంధించిన వివరాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు నివేదికలను అధికారులు సిద్ధం చేశారు. బందరు పోర్టు పనులను అధికారం చేపట్టిన ఆరు నెలల్లో ప్రారంభిస్తామని టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. పోర్టు పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభింపజేయాలని మంత్రులు, అధి కారులు నివేదికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రైతు సాధికార సంస్థకు నిధుల కేటాయింపు, రుణమాఫీ, గన్నవరం ఎయిర్‌పోర్టుపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న ఇంద్రకీలాద్రి అభివృద్ధిని సీఎం దృష్టికి తీసుకువచ్చేందుకు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. తుళ్లూరులో రాజధాని నిర్మాణం చేస్తామని ప్రకటించిన అనంతరం విజయవాడలో ట్రాఫిక్ సమస్య అధికమైంది. బెంజ్ సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఉన్న అవకాశాలను నివరించేందుకు నివేదికలు రూపొందించారు. డెల్టా ఆధునికీకరణలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్ కమిటీ సూచనల మేరకు కాలువల ఆధునికీకరణ పైనా నివేదికలు తయారు చేశారు.అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కూచిపూడి గ్రామాన్ని, నాట్య మండలిని రూ. 100 కోట్లతో అభివృద్ధి చేసే అంశంపైనా అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. కృష్ణానదిలో ఉన్న భవానీ ఐల్యాండ్ అభివృద్ధి చేసే అంశంపైనా ఈ సదస్సులో చర్చించనున్నట్లు తెలిసింది.