
సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్రం కీలక సమావేశం నిర్వహించింది. పలు ఆర్థిక వేత్తలు, నిపుణులతో ఆర్థికమంత్రిత్వ శాఖ ప్రీ బడ్జెట్ సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం బడ్జెట్ సమావేశానికి హాజరయ్యారు.
రాబోయే 2018 కేంద్ర బడ్జెట్ కరసరత్తులో భాగంగా ఆర్థికవేత్తల బృందంతో సమావేశమైంది. రెవెన్యూ కార్యదర్శి హస్ముక్ ఆదియా కూడా ఉన్నారు. గతంలో వ్యవసాయ రంగం, పరిశ్రమ, వ్యాపార విభాగాలు, ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులతో ఆర్థిక మంత్రి సమావేశమయ్యారు. ముఖ్యంగా కార్పొరేట్ పన్ను తగ్గింపు తదితర కీలక అంశాలపై ఈ సమావేశం చర్చించింది. మరోవైపు 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్‌డీఏ ప్రభుత్వ చివరి ఆర్థిక బడ్జెట్ కావడంతో భారీ పెట్టుబడులు, తక్కువ పన్నులు, మరిన్ని ప్రోత్సాహకాలతోఆకర్షణీయంగా బడ్జెట్‌ను వడ్డించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది.