న్యూ ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్యాకేజీ నిధులను విడుదల చేసింది. 33 కోట్ల మందికి పైగా ప్రత్యక్ష నగదు బదిలీ చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజి కింద రూ. 31,235 కోట్లు, 20 కోట్ల మహిళా జన్‌ధన్ ఖాతాల్లోకి రూ. 10,025 కోట్లను బదిలీ చేసినట్టు తెలిపింది.
2.82 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పెన్షన్ కోసం రూ. 1,405 కోట్లు, పీఎం-కిసాన్ యోజన కింద 8 కోట్ల మంది రైతులకు రూ. 16,146 కోట్లను బదిలీచేశామని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 68,775 కంపెనీల్లో పనిచేసే 10.6 లక్షల ఉద్యోగులకు ఈపీఎఫ్ వాటాగా రూ. 162 కోట్లు బదిలీ చేసినట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment