Jan Dhan Account
-
4వ తేదీ నుంచి జన్‌ధన్ ఖాతాల్లో నగదు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ మహిళా ఖాతాదారులకు రెండో విడత ఆర్థిక సాయం రూ. 500 ఈనెల 4వ తేదీ నుంచి విడుదల చేయనుంది. నిర్దేశించిన తేదీల్లో నగదు వారి ఖాతాల్లో జమ కానున్నట్లు ఎస్ఎల్బీసీ (రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి) శనివారం ప్రకటించింది. ఖాతా నంబరు చివరి అంకె ఆధారంగా షెడ్యూల్ ఇచ్చామని, లబ్ధిదారులు ఆయా తేదీ ల్లో సంబంధిత బ్యాంకులు, ఏటీఎం, బ్యాంకు మిత్ర, బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా నగదును తీసుకోవచ్చని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఇచ్చే రూ.1,500 ఆర్థిక సాయం కూడా వారి ఖాతాల్లో ఈనెల 2వ తేదీ నుంచి జమ కానున్నాయి. ఈ నిధులను కూడా నిర్దేశించిన షెడ్యూల్ ఆధారంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ నగదు ఉపసంహరణ చేసుకోవాలని ఎస్ఎల్బీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 12వ తేదీ తర్వాత సీరియల్ నంబర్‌తో సంబంధం లేకుండా అందరూ విత్‌డ్రా చేసుకోవచ్చని, జన్‌ధన్ అకౌంట్ లేదా బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో ఒకసారి జమ అయిన నిధులను ప్రభుత్వం తిరిగి వెనక్కు తీసుకోదని స్పష్టం చేసింది. చదవండి: వడివడిగా ‘కొండపోచమ్మ’ చెంతకు -
33 కోట్ల మందికిపైగా ప్రత్యక్ష నగదు బదిలీ
న్యూ ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్యాకేజీ నిధులను విడుదల చేసింది. 33 కోట్ల మందికి పైగా ప్రత్యక్ష నగదు బదిలీ చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజి కింద రూ. 31,235 కోట్లు, 20 కోట్ల మహిళా జన్‌ధన్ ఖాతాల్లోకి రూ. 10,025 కోట్లను బదిలీ చేసినట్టు తెలిపింది. 2.82 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పెన్షన్ కోసం రూ. 1,405 కోట్లు, పీఎం-కిసాన్ యోజన కింద 8 కోట్ల మంది రైతులకు రూ. 16,146 కోట్లను బదిలీచేశామని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 68,775 కంపెనీల్లో పనిచేసే 10.6 లక్షల ఉద్యోగులకు ఈపీఎఫ్ వాటాగా రూ. 162 కోట్లు బదిలీ చేసినట్టు తెలిపింది. -
జన్ ధన్ ఖాతాల్లో రూ.36,000 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన్ ధన్ ఖాతాల్లోని డిపాజిట్ల విలువ రూ.36,000 కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన ‘సివిల్ సర్వీసెస్ డే’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన కింద 28 కోట్ల బ్యాంకు అకౌంట్లు ప్రారంభమయ్యాయని, వీటి ద్వారా బ్యాంకులు రూ.36,000 కోట్ల డిపా జిట్లను స్వీకరించాయని తెలిపారు. ఇది ప్రజల స్వయం సమృద్ధికి సంకేతమన్నారు. ప్రధాని మోదీ గురువారం ‘సివిల్ సర్వీసెస్ డే’ గురించి మాట్లాడనున్నారు. అలాగే ఆయన ప్రభుత్వ కార్యక్రమాలను బాగా అమలు చేసిన అధికారులకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. -
జన్‌ధన్ ఖాతాపై డిపాజిట్ గన్!
శ్రీకాకుళం పాత బస్టాండ్: పొదుపును ప్రోత్సహించడం, పేదలకు బీమా సౌకర్యం కల్పించడం, భవిష్యత్తులో అన్ని రకాల సంక్షేమ ఫలాలను బ్యాంకు ఖాతాలకే జమ చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం కొన్ని బ్యాంకుల నిర్వాకం కారణంగా ఖాతాదారులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.పేదలను దృష్టిలో పెట్టుకొని కనీస డిపాజిట్ కూడా అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్‌తో జన్‌ధన్ ఖాతాలు తెరవాలని నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే కొన్ని బ్యాంకులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(ఏపీజీవీబి) రూ.500 డిపాజిట్‌ను డిమాండ్ చేస్తోంది. ముందు డిపాజిట్ లేకుండా ఖాతా తెరిచినా.. కనీస డిపాజిట్ కట్టనిదే పాస్‌పుస్తకం ఇచ్చేది లేదని పలు శాఖల అధికారులు స్పష్టం చేస్తుండటంతో కొత్త ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. లక్ష్యానికి దూరంగా.. అన్ని కుటుంబాలకు జన్‌ధన్ ఖాతా ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఇటువంటి కొన్ని లోపాల కారణంగా చేరుకోలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 27 ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు చెందిన 263 శాఖలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ జన్‌ధన్ ఖాతాలు తెరుస్తున్నారు. అయితే ఏపీజీవీబీ శాఖల్లో మాత్రమే రూ.500 కనీస డిపాజిట్ వసూలు చేస్తున్నారని ఆ బ్యాంకులో ఖాతాలు తెరిచిన పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఏపీజీవీబీ శాఖలే ఉన్నాయి. బిజినెస్ ప్రొవైడర్ల ద్వారా ఈ శాఖల పరిధిలోని గ్రామాల్లో వేల సంఖ్యలో కొత్త ఖాతాలు తెరిపించారు. ఖాతాలు తెరిచిన వారు ఆయా శాఖలకు వెళ్లి పాస్‌పుస్తకాలు అడిగితే కనీస డిపాజిట్ కట్టాలని, అప్పుడే పాస్ పుస్తకం ఇస్తామని బ్యాంకు ఆధికారులు స్పష్టం చేస్తున్నారని ఖాతాదారులు వాపోతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8.83 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీటన్నింటికీ ఖాతాలు తెరవాలన్నది లక్ష్యంగా ఇప్పటివరకు సుమారు 4 ల క్షల ఖాతాలు ఉన్నాయి. కాగా గత నవంబర్‌లో ప్రారంభమైన జన్‌ధన్ పథకం కింద 2.30 లక్షల ఖాతాలు తెరిచారు. కనీస బ్యాలెన్స్ పేరుతో ఏపీజీవీబీ ఒత్తిడి చేస్తుండటంతో కొత్తవారు ఖాతాలు తెరిచేందుకు ముందురాని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి వద్ద ప్రస్తావించగా జన్‌ధన్ ఖాతాలకు కనీస డిపాజిట్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఇలా వసూలు చేస్తున్న బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ సమస్య లేకుండా చేస్తానని చెప్పారు.